త్రిమూర్తులలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది లింగార్చన, లింగ అభిషేకం. శివలింగాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటికి అర్చిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది.
వజ్రలింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.
ముత్యం లింగానికి అర్చన చేస్తే రోగాలు నశిస్తాయి.
పుష్యరాగం లింగానికి ఆర్చన చేస్తే యశస్సు ప్రాప్తిస్తుంది.
పద్మరాగ లింగానికి అర్చన చేస్తే లక్ష్మీ కటాక్షం
మరకత లింగానికి అర్చన చేస్తే జీవితంలో సుఖం ప్రాప్తిస్తుంది.
నీలంరంగు లింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.
స్ఫటిక లింగానికి అర్చన చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయి.
ఇత్తడి లింగానికి అర్చన చేస్తే తేజస్సు సిద్ధిస్తుంది.
లోహంతో చేసిన శివలింగానికి అర్చన చేస్తే శతృనాశనం అవుతుంది.
గంధలింగానికి అర్చన చేస్తే స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది.
వెన్న లింగానికి అర్చన చేస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
ధాన్యపు పిండితో చేసిన అర్చన చేస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు.
రసలింగం అంటే పాదరస లింగం అని అర్థం, పాదరసం బరువుగా ఉంటుంది. మన దేశంలో పాదరస లింగం ఉజ్జయినిలోని సిద్దాశ్రమంలో ఉంది. పాదరస లింగానికి అర్చన చేస్తే నెరవేరని కోరికలు అంటూ ఉండవు. లింగానికి అభిషేకం చేసి తీర్థంగా సేవిస్తే సర్వవ్యాధులూ నయం అవుతాయి.
సూపర్ చాలా బాగా చెప్పారు గురువు గారు
ReplyDelete