Saturday 26 March 2016

అష్ట భైరవులు ఎవరు? వారిని ఎవరు కొలుస్తారు?


కాపాలికులు ఒక గిరిజన తెగకి చెందినవాళ్ళు. కపాలం అంటే మనిషి పుర్రె. కపాలన్ని మెడలో ధరించి, చేతుల్లో త్రిశూలాల్ని, కత్తుల్ని ధరించి, దిగంబరంగా సంచరించే వామాచార శైవ సంప్రదాయానికి చెందిన వాళ్ళని కాపాలికులు అంటారు. వీళ్ళు మద్య-మాంసాల్ని నివేదిస్తు శివున్ని సేవిస్తారు. శ్రీశైల క్షేత్రంలోని కొండగుహల్లో కాపాలికులు నివసించారు. కాపాలికులు ఎనిమిది మంది భైరవుల్ని కొలుస్తారు. వీళ్ళనే అష్ట భైరవులు అంటారు.
(1) సిద్ధ భైరవుడు.
(2) యోగినీ భైరవుడు
(3) మహాభైరవుడు
(4) శక్తి భైరవుడు
(5) వటుక భైరవుడు
(6) కంకాళ భైరవుడు
(7) కాల భైరవుడు
(8) కాలాగ్ని భైరవుడు
ఈ ఎనిమిది మందిని అష్టభైరవులు అంటారు. ఈ భైరవుల ద్వారా నిధి-నిక్షేపాలు పొందడానికి భైరవాష్టక తంత్రం చెయ్యడం కూడా పరిపాటి.

No comments:

Post a Comment