Tuesday, 29 March 2016

ఏ లింగాలను పూజిస్తే ఏమి ఫలితం?



త్రిమూర్తులలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది లింగార్చనలింగ అభిషేకంశివలింగాలలో ఎన్నో రకాలు ఉన్నాయివాటికి అర్చిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది.
వజ్రలింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.
ముత్యం లింగానికి అర్చన చేస్తే రోగాలు నశిస్తాయి.
పుష్యరాగం లింగానికి ఆర్చన చేస్తే యశస్సు ప్రాప్తిస్తుంది.
పద్మరాగ లింగానికి అర్చన చేస్తే లక్ష్మీ కటాక్షం
మరకత లింగానికి అర్చన చేస్తే జీవితంలో సుఖం ప్రాప్తిస్తుంది.
నీలంరంగు లింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.
స్ఫటిక లింగానికి అర్చన చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయి.
ఇత్తడి లింగానికి అర్చన చేస్తే తేజస్సు సిద్ధిస్తుంది.
లోహంతో చేసిన శివలింగానికి అర్చన చేస్తే శతృనాశనం అవుతుంది.
గంధలింగానికి అర్చన చేస్తే స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది.
వెన్న లింగానికి అర్చన చేస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
ధాన్యపు పిండితో చేసిన అర్చన చేస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు.
రసలింగం అంటే పాదరస లింగం అని అర్థంపాదరసం బరువుగా ఉంటుందిమన దేశంలో పాదరస లింగం ఉజ్జయినిలోని సిద్దాశ్రమంలో ఉందిపాదరస లింగానికి అర్చన చేస్తే నెరవేరని కోరికలు అంటూ ఉండవులింగానికి అభిషేకం చేసి తీర్థంగా సేవిస్తే సర్వవ్యాధులూ నయం అవుతాయి.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజునకు అధిష్టాన దైవం....


సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.
మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.
మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.
జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం.
సంతానప్రాప్తిని కోరే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు.

లక్ష్మీ కటాక్షం కోసం

లక్ష్మీ కటాక్షం కోసం భక్తులు వివిధ రకాల పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తుంటారు. అలాగే లక్ష్మీదేవిని ఏ తిథులలో ఎటువంటి అభిషేకం చేయాలి? వారం రోజులలో లక్ష్మీదేవికి ఏ ప్రసాదం పెట్టాలి? అని చాలామందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం …
S.No ఏ తిథి అభిషేకం
1పాడ్యమి ఆవు నేయితో అభిషేకం చేసినట్లయితే సకల రోగాలు నివారణ అవుతాయి.
2విదియ  చెక్కరతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది.
3తదియ  ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే ఎలాంటి అకాలమృత్యు దోషాలు తొలగిపోతాయి.
4చవితి   పిండివంటల నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు సంప్రాప్తిస్తాయి.
5పంచమ   అరటిపళ్ళు నైవేద్యం నివేదించడం వలన మేథస్సు, బుద్ధిశక్తి దిగ్వినీకృతం అవుతుంది (పెరుగుతుంది).
6షష్ఠి      తేనెతో అభిషేకించి చేసినట్లయితే, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన కాంతి పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది.
7అష్టమి బెల్లం నీళ్ళతో అభిషేకించి, శుద్ధి బెల్ల్లం ఎవరికయినా దానం ఇవ్వడం వలన అష్టకష్టాలు తీరిపోయి సుఖంగా ఉంటారు.
8నవమి  పేలాలు నైవేద్యం నివేదించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
9దశమి      నల్లనువ్వులతో చేసిన పదార్థాలు నైవేద్యంగా నివేదించినట్లయితే సకల రోగాలు తొలగిపోయి దీర్ఘాయుష్మంతులు అవుతారు.
          
    వారంలో అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం నివేదించాలి 
S.NO   వారం  నైవేద్యం 
1ఆదివారం   పాలు
2సోమవారం పాయసం
3మంగళవారం    అరటిపళ్ళు
4బుధవారం     వెన్న
5గురువారం  పటికబెల్లం
6శుక్రవారం   తీయని పదార్థాలు
7శనివారం    ఆవునెయ్యి  
  
     

ఉద్యోగంలో ప్రమోషన్ కోసం సూచన ?


ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యోగంలో స్థిరత్వం కోసం అభద్రతా భావం తొలగించు కోవాలంటే తప్పకుండా శనీశ్వరుడిని "ఓం చర స్థిర స్వభవాయ నమః'' అనే మంత్రంతో పూజించాలి. ఈ మంత్రాన్ని వీలయినన్ని సార్లు శనివారం రోజున జపిస్తూ ఉండాలి. సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి. దీనితో పాటు హనుమంతుని విగ్రహానికి లేదా చిత్రపటానికి నువ్వుల నూనె. సింధూరం కలిపి పటానికి కానీ విగ్రహానికి కానీ లేపనం వేయాలి.
ఆవనూనెతో శివాలయంలో, కాళభైరవ ఆలయంలో దీపం వెలిగించినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఇంట్లో శనివారం రోజు ఒక ఇనుప ప్రమిదలో కొబ్బరినూనెతో దీపం వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితం ఉంటుంది. శనివారం రోజున పచ్చకర్పూరం కుంకుమ కలిపి ముఖానికి ధరించాలి. అలాగే ప్రదోష కాలంలో రావిచెట్టు, వేపచెట్టు మొదట్లో ఉన్న పుట్టలలో పాలు, నీళ్ళు కలిపి పోయడం ద్వారా ఉద్యోగంలో సంతృప్తికరమైన స్థానానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.
సోమవారం రోజున పరమేశ్వరుడి చిత్రపటానికి పసుపురంగు పువ్వుల మాల వేసి, గరికె పూలతో స్వామిని పూజించిన తరువాత శనగలు తాలింపు పెట్టి ప్రసాదంగా పరమేశ్వరుడికి నివేదించాలి. పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఉద్యోగంలో సరైన స్థితికి రావడం జరుగుతుంది. అలాగే "ఓం వృషభ వాహనాయ నమః'' మంత్రాన్ని వీలయినన్ని సార్లు జపించాలి. 

Sunday, 27 March 2016

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా

శ్రీనివాస గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా,

భక్తవత్సల గోవిందా, భాగవతప్రియా గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||1||



నిత్యనిర్మల గోవిందా, నీలమేఘశ్యామా గోవిందా,

పురాణపురుష గోవిందా, పుండరీకాక్ష గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||2||



నందనందన గోవిందా, నవనీత చోర గోవిందా,

పశుపాలక శ్రీ గోవిందా, పాపవిమోచన గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||3||



శిష్టపరిపాలక గోవిందా, కష్టనివారణ గోవిందా,

దుష్టసంహార గోవిందా, దురిత నివారణ గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||4||



వజ్రమకుటధర గోవిందా, వరాహమూర్తి గోవిందా,

గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||5||



దశరధనందన గోవిందా, దశముఖ మర్దన గోవిందా,

గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||6||



మత్స్యకూర్మా గోవిందా, మధుసూదనహరి గోవిందా,

వరాహ నరసింహ గోవిందా, వామన భృగురామ గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||7||



బలరామానుజ గోవిందా, భౌద్ధకల్కి గోవిందా,

వేణుగానలోల గోవిందా, వేంకటరమణా గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||8||



సీతానాయక గోవిందా, శ్రితపరిపాలక గోవిందా;

ఆద్ర పోషక గోవిందా, ఆది పురుష గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||9||



అనాధ రక్షక గోవిందా, ఆపద్భాంధవ గోవిందా,

కరుణాసాగర గోవిందా, శరణాగత నీదే గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||10||



కమలదళాక్ష గోవిందా, కామిత ఫలదా గోవిందా;

పాపవినాశక గోవిందా, పాహిమురారే గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||11||



శ్రీ ముద్రాంకిత గోవిందా, శ్రీ వత్సాంకిత గోవిందా;

ధరణీనాయక గోవిందా, దినకరతేజా గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||12||



పద్మావతిప్రియ గోవిందా, ప్రసన్నమూర్తీ గోవిందా,

అభయమూర్తి గోవిందా, ఆశ్రిత వరద గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||13||



శంఖచక్రధర గోవిందా, శాoగదాధర గోవిందా,

విరజాతీరస్థ గోవిందా, విరోధిమర్ధన గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||14||



సాలగ్రామ గోవిందా, సహస్రనామా గోవిందా,

లక్ష్మీవల్లభ గోవిందా, లక్ష్మణాగ్రజ గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||15||



కస్తూరితిలక గోవిందా, కాంచనాంబర గోవిందా,

గరుడవాహన గోవిందా; గానలోల గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||16||



వానరసేవిత గోవిందా, వారధిబంధన గోవిందా;

అన్న దాన ప్రియ గోవిందా, అన్నమయ్య వినుత గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||17||



ఆశ్రిత రక్ష గోవిందా, అనంత వినుత గోవిందా,

వేదాంత నిలయ గోవిందా, వేంకట రమణ గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||18||



ధర్మ స్థాపక గోవిందా, ధన లక్ష్మి ప్రియ గోవిందా,

స్త్రీ పుం రూప గోవిందా, శర్వాణి నుత గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||19||



ఏకస్వరూప గోవిందా, లోక రక్షక గోవిందా,

వేంగమాంబనుత గోవిందా, వేదాచల స్థిత గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||20||



వజ్ర కవచ ధర గోవిందా, వసుదేవ తనయ గోవిందా,

వైజయంతి ధర గోవిందా, వేంకట నాయక గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||21||



బిల్వపత్రార్చిత గోవిందా, బిక్షుక సంస్థుత గోవిందా,

బ్రహ్మాండ రూప గోవిందా, భక్త రక్షక గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||22||



నిత్య కళ్యాణ గోవిందా, నీల జనాభా గోవిందా,

హాతి రామ ప్రియ గోవిందా, హరి సర్వోత్తమ గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||23||



జనార్థన మూర్తి గోవిందా, జగత్ పతీ హరి గోవిందా,

అభిషేక ప్రియ గోవిందా, ఆపన్నివారణ గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||24||



రత్న కిరీట గోవిందా, రామానుజనుత గోవిందా,

స్వయం ప్రకాశ గోవిందా, సర్వ కారణ గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||25||



నిత్య శుభ ప్రద గోవిందా, నిత్య కళ్యాణ గోవిందా,

ఆనంద రూప గోవిందా, ఆద్యంత రహిత గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||26||



ఇహ పర దాయక గోవిందా, ఇభ రాజ రక్షక గోవిందా,

పరమ దయాలో గోవిందా, పద్మనాభ హరి గోవిందా;

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||27||



గరుడాద్రి వాస గోవిందా, నీలాద్రి నిలయా గోవిందా,

అన్జనాదీస గోవిందా, వృషభాద్రీసా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||28||



తిరుమల నాయక గోవిందా, తులసీమాల గోవిందా,

శేషాద్రి నిలయ గోవిందా, శ్రేయోదాయక గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||29||



శాంతాకారా గోవిందా, వైకుంఠ వాసా గోవిందా,

బ్రుగుముణి పూజిత గోవిందా, రమాది రహిత గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||30||



బ్రహ్మాండ రూప గోవిందా, పుణ్య స్వరూప గోవిందా,

శ్రీ చక్ర భూషణ గోవిందా, శ్రీ శంఖ రంజిత గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||31||



నందక ధారి గోవిందా, ఇరు నామ ధారి గోవిందా,

భాగ్య శీతల గోవిందా, భక్త వత్సల గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||31||



పద్మావతీస గోవిందా, పద్మ మనోహర గోవిందా,

ఆనంద నిలయ గోవిందా, ఆనంద రూపా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||32||



నాగేంద్ర భూషణ గోవిందా, మంజీర మండిత గోవిందా,

తులసి మాల ప్రియ గోవిందా, ఉత్పమాలాంకృత గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||33||



దివ్య సుదేహ గోవిందా, మాల లోల గోవిందా,

శ్రీ స్మిత వదన గోవిందా, శ్రీ నిర్మలా కార గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||34||



మహేంద్ర వినుత గోవిందా, మహాను భావా గోవిందా,

మహా లక్ష్మి నాధ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||35||



శ్రీ విశ్వ తేజా గోవిందా, శ్రీ గిరి నిలయ గోవిందా,

నిర్గుణ రూప గోవిందా, తిరుమల వాస గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||36||



శ్రీ వరద రూప గోవిందా, అభయ ప్రదాయ గోవిందా,

యోగేద్ర వన్య గోవిందా, తిరు వెంకటాద్రీస గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||37||



కృపాసాగర గోవిందా, శరణ సుందర గోవిందా,

పుణ్య స్వరూప గోవిందా, శ్రీ పురుషోత్తమ గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||38||



గోకుల కృష్ణ గోవిందా, గరుడ వాహన గోవిందా,

శ్రీ గాన లోల గోవిందా, శ్రీ చంద్ర హాస గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||39||



గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.

నక్షత్ర గాయత్రి ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి


1.అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే
సుధాకరాయై ధిమహి
తన్నో అశ్వినేన ప్రచోదయాత్
2.భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే
దండధరాయై ధిమహి
తన్నో భరణి:ప్రచోదయాత్
3.కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే
మహాతపాయై ధీమహి
తన్నో కృత్తికా ప్రచోదయాత్
4.రోహిణి
ప్రజావిరుధ్ధై చ విద్మహే
విశ్వరూపాయై ధీమహి
తన్నో రోహిణి ప్రచోదయాత్
5.మృగశిరా
ఓం శశిశేఖరాయ విద్మహే
మహారాజాయ ధిమహి
తన్నో మృగశిర:ప్రచోదయాత్
6.ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే
పశుం తనాయ ధిమహి
తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్
7.పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే
అదితి పుత్రాయ ధిమహి
తన్నో పునర్వసు ప్రచోదయాత్
8.పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
మహాదిశాయాయ ధిమహి
తన్నో పుష్య:ప్రచోదయాత్
9.ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే
మహారోచకాయ ధిమహి
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్
10.మఖ
ఓం మహా అనగాయ విద్మహే
పిత్రియాదేవాయ ధిమహి
తన్నో మఖ: ప్రచోదయాత్
11.పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే
పశుదేహాయ ధిమహి
తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్
12.ఉత్తరా
మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి
తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్
13.హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే
ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా ప్రచోదయాత్
14.చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చైత్రా:ప్రచోదయాత్
15.స్వాతి
ఓం కామసారాయై విద్మహే
మహాని ష్ఠాయై ధీమహి
తన్నో స్వాతి ప్రచోదయాత్
16.విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
తన్నో విశాఖ ప్రచోదయాత్
17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే
మహామిత్రాయ ధీమహి
తన్నో అనూరాధా ప్రచోదయాత్
18.జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే
మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్
19.మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్
20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే
మహాబీజితాయై ధిమహి
తన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్
21.ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే
మహాషాఢాయ ధిమహి
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్
22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే
పుణ్యశ్లోకాయ ధీమహి
తన్నో శ్రవణ ప్రచోదయాత్
23.ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే
వసూప్రితాయ ధీమహి
తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్
24.శతభిషం
ఓం భేషజాయ విద్మహే
వరుణదేహాయ ధీమహి
తన్నో శతభిషా ప్రచోదయాత్
25.పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే
అజరక పాదాయ ధీమహి
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్
26.ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే
ప్రతిష్ఠాపనాయ ధీమహి
తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్
27.రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే
పూష్ణ దేహాయ ధీమహి
తన్నో రేవతి ప్రచోదయాత్

శని వలన కలిగే ఒంటి నొప్పులకి,కీళ్ళ నొప్పులకి ,మోకాళ్ళ నొప్పులకి కింద మంత్రం చదువుకోవాలి.

ఏల్నాటిశని,అష్టమ శని,కంటక శని,శని మహార్దశ,అంతర్దశ జరుగుతున్నప్పుడు కొంతమందికి ఒళ్ళు నొప్పులు,కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు నడుము నుండి క్రింది పాదాల వరకు నువ్వుల నూనె పట్టించి శని ఉపశమన మంత్రాన్ని పఠిస్తూ రెండు గంటల తరువాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
నువ్వుల నూనె లోకాపర్ వంటి మూలకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శక్తివంతంగా కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలకు, కీళ్ళను దృడంగా ఉండేలా చేస్తాయి.
నువ్వుల నూనెతో ప్రతి రోజూ శరీరానికి మర్దన చేస్తే చర్మానికి నిగారింపే కాక చిన్నతనంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను కూడా అరి కట్టవచ్చు. అలాగే, చిన్న పిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవు తాయి. ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు మాలిష్‌ చేయడం వల్ల జుట్టు బాగా పెరగడంతో పాటు మేధాశక్తి ఎక్కువవుతుంది. పిల్లలు పక్క తడపకుండా ఉండడానికి కూడా నువ్వుల నూనె పని చేస్తుంది.
ఏల్నాటిశని,అష్టమ శని,కంటక శని,శని మహార్దశ,అంతర్దశ జరుగుతున్నప్పుడు కొంతమందికి బద్దకం ఎక్కువగా ఉంటుంది.అలాంటివారు ప్రతిరోజు దేవాలయ ప్రదక్షిణలు గాని,వాకింగ్ గాని మేడిటేషన్ గాని చేస్తే శని తృప్తి పడి మన నిత్య కార్యక్రమాలు సవ్యంగా జరిగేటట్టు చేస్తాడు.
శనైశ్చరో మహాభాగో! సర్వారిష్ట నివారక: !
కాకధ్వజో రుద్రరూపో! కలికల్మష నాశక:!!
ధీరో గంభీరో !ధృడసంకల్ప కారక: !
దేవదేవో దుర్నిరీక్షో! దేవాసురవందిత:!!
కరాళో కంటకో క్రుద్ధో! కష్టనష్టకారక: !
పవిత్రో ప్రలోభో !ప్రారబ్ధకర్మ ఫలప్రద:!!
నిర్గుణో నిత్యతృత్పో! నిజతేజ ప్రకాశిత: !
నిరుపమో నిష్కళంకో! నీలాంజన సమప్రభ:!!
మందో మహావీరో! మదమాత్సర్య నాశక: !
ప్రసన్నో ప్రమోదో !శరణాగత వత్సల:!!
శనైశ్చర పంచకమిదం య: పఠేత్సతం నర:
సర్వకష్ట వినిర్ముక్తో శ్రీ శనైశ్చర కరుణాం లభేత్!!

శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.

శనిగ్రహాన్ని నిగ్రహించిన మహర్షి "పిప్పలాదుడు"
పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ . ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఈ కారణంగానే ఆ పిల్లవాడికి " పిప్పలాదుడు" అనే పేరు వస్తుంది.
ఆ పిల్లవాడి పరిస్థితి బాధకలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు.ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి ఆయన సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు.
పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని ఆయన అడుగుతాడు. శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు.
ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెబుతారు. ఆయన శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు. అందువలన శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.
పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం
నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||



Saturday, 26 March 2016

గృహ ఆయుర్ధాయ యోగము


ప్రతీవారు గృహము నిర్మిచునప్పుడు ఆ ఇల్లు నూరేళ్ళు సర్వశుభములు కలిగి పిల్ల పాపలతో కళకళ లాడవలేనను సదుద్దేశముతో ప్రారంభింతురు. అందుకు శుభ ముహూర్తము బలము ఉన్నచో మంచిది. ఆ గృహమునకు ముహుర్తబలము బట్టి ఎన్ని సం. వయస్సు ఉన్నదో ఆ బలములు/శుభములు అంతకాలము కనిపించును.
ముహూర్త లగ్నమున బుధుడు ఉండగా నిర్మించిన ఇల్లు 50 సం. ఆయువు కలిగి ఉండును.
ముహూర్త లగ్నమున, 4 వ ఇంట గురుడు, 10 వ ఇంట చంద్రుడు, 11 వ ఇంట శని కుజులు ఉన్న ఆ ఇల్లు 80 ఆయుష్షు కలిగి ఉండును. లగ్నమున గురుడు, 4 వ ఇంట శుక్రుడు, 6 వ ఇంట రవి ౭వ ఇంట బుధుడు ౩ వ ఇంట శని ఉండగా నిర్మించిన గృహము పూర్ణాయుషు కలిగి ఉండును.
లగ్నమున శుక్రుడు, 10 వ ఇంట బుధుడు 11 వ ఇంట రవి కేంద్రమున గురువు ఉండగా నిర్మించిన 100 ఏళ్ళు ఆయుష్షు కలిగి ఉండును. లగ్నమున శుక్రుడు, ౩ వ ఇంట రవి, 5 ఇంట గురుడు, 6 వ ఇంట కుజుడు ఉండగా నిర్మించిన గృహము 200 సం. ఆయుష్షు గలిగి ఉండును.
ఇన్ని శుభములు కలిగిన ముహూర్తము అరుదుగా దొరకును. కొన్ని శుభములున్నను మంచిదే. కొన్ని దోషములున్ననూ, వాటిపరిహారార్ధము పూజలు జరిపించి ప్రారంభించు సంప్రదాయము మనది .

ఆంజనేయస్వామి సిందూరాన్ని పెట్టుకుంటే లాభాలు!


1. ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
2. ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది.
3.ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది.
4. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.
5. వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతరు.
6. విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు.
7. లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది.
8. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.
9. ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన వన్నీ నెరవేరుతాయి.
10. ఆంజనేయస్వామికి సిందూరాన్ని పెట్టి తరువాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుంది.

చిదంబర రహస్యం అంటే ఏమిటి.....!!


పృధ్వి, అగ్ని, వాయువు, తేజస్సు , ఆకాశ లింగాలను పంచభూతలింగాలు అని అంటాము. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది.ఈ దేవాలయంలో లింగం వెనుక ఒక పరదా కట్టి ఉంటుంది. ఆ వెనుక ఏమీ ఉండదు. అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే, ఈ పరదా వెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయింది.
దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ – శివ – భగవంతుడు, అహం – నేను/మేము, భవ – మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు. మన తిరుపతికి దగ్గరలో శ్రీ కాళహస్తి ఉంది కదా, అక్కడ ఉండే లింగమే వాయు లింగం. మనం చిన్నప్పుడు సాలెపురుగు, పాము, ఏనుగు వారికి తోచిన విధంగా శివునికి పూజలు చేసి మోక్షం సంపాదించాయి అనే కథ విన్నాం కదా, ఆ క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి . ఇక్కడి స్వామి పేరు కాలహస్తీస్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.
రెండవది జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఇది తమిళనాడు లోని తిరుచిరాపల్లి సమీపంలోనిజంబూకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఇక్కడి స్వామివారి పేరు జమ్బూకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్న పరమేశ్వరుడు దాని నివారణ కోసం జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జమ్బూకేశ్వరుడు అని పేరు వచ్చింది.
మూడవది తేజోలింగం. ఇది తమిళనాడు లోని అరుణాచల (తిరువన్నామలై ) క్షేత్రంలో ఉంది. అరుణాచలం శిఖరాగ్రం పై అగ్ని శిఖ ఒకటి ఆవిర్భవించి, తేజోలింగ రూపుడయ్యాడు. ఇక్కడి శివుని పేరు అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అబిదకుచాంబ లేదా ఉన్నమలై అంబ / ఉన్నమలై నాయగి . ఇక పృథ్విలింగం సంగతేంటంటే ఇది మట్టిలింగం. ఇది తమిళనాడులోని కంచి క్షేత్రంలో ఉంది. ఈ లింగం పార్వతీదేవిచే ప్రతిష్టింపబడింది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు. ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆఖరిది ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబరం అనే క్షేత్రంలో ఉంది. ఈ ఆకాశలింగ దర్శనం చాలా రహస్యమైనది. ఆకాశం లాగా శూన్యంగా కనిపిస్తుంది. అస్సలు లింగ దర్శనమే ఉండదు. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. (అందుకే చిదంబర రహస్యం అని అంటారు) మరి అంతటి రహస్యమైన ఈ ఆకాశలింగాన్ని దర్శించాలంటే మనం ఎంతటి తపోనిష్ఠులం అవ్వాలో కదా. ఎంతో సాధన చేయాలి. జీవిత కాలంలో ఒక సారయినా చూడ వలసిన ప్రదేశం చిదంబరం. చిదంబర క్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు.

ప్రత్యంగిరామాతకధ.....!


ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు ఈ ఋషిపుంగవులిద్ధరు. అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ భీజాక్షరాలకు ఇలా ప్రత్య +అంగీర= ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .ఈ ప్రత్యంగిరా మహామంత్రము అధర్వణ వేదములోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తములో అంతర్భాగంగా వుంది . 

ప్రత్యంగిరామాత పుట్టినవైనము ;-కృతయుగములో హిరణ్యకశ్యుపుని సం హరించటానికి శ్రీహరి నరసిం హా అవతారములో రాతి స్ఠంభంలోనుండి ఉద్భవించి అసురసంద్యవేళ గడప పై తన పదునైన గోళ్ళతో కడుపు చీల్చి సం హరించాడు రాక్షసాధమున్ని అయినా నరసిం హ మూర్తి కోపం చల్లారలేదు నరసిం హుని క్రోధానికి సర్వ జగత్తు నాశనమౌతుందని భయపడ్డ దేవతలు నరసిం హుని కోపాన్ని చల్లార్చటానికి పరమేశ్వరున్ని ప్రార్ధించారు. అంతట పరమేశ్వరుడు వీరభధ్రావతారములో నరసిం హుని ముందుకు వచ్చి జ్ఞానభోధతో నరసిం హుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నిస్తాడు.కానీ నరసిం హ మూర్తి మరింత కోపంతో అష్టముఖగండభేరుండమూర్తి అవతారంతో వీరభద్రుని పైకి వురుకుతాడు. అంతట వీరభద్రుడు శరభా అవతారం దాలుస్తాడు.శరభుని రెండు రెక్కలలో ఒక రెక్కలొ శూలిని ,మరో రెక్కలో మహాప్రత్యంగిరా శక్తులు దాగి వుంటాయి. అష్టముఖగండభేరుండమూర్తి తనవాడి అయిన ముక్కుతో శరభేశ్వరున్ని ముక్కలు చేయ్యటానికి యత్నిస్తాడు. శరభేశ్వరుని శూలిని శక్తి దాగివున్న రెక్క అష్టముఖగండబేరుండమూర్తి ముక్కుకి చిక్కుతుంది రెండో రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించింది.


మహాప్రత్యంగిరరూపవర్ణన;- నేలనుండి నింగిని తాకేటట్లుండే మహాభారీకాయంతో కూడిన స్త్రీదేహం ఆ స్త్రీ దేహము కారుఛీకటితోకూడిన నల్లనివర్ణం మగసిం హపు వేయ్య తలలతో ఓకవైపు ఏర్రన్ని నేత్రాలు మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పైరెండు చేతులతో ఉద్భవిస్తుంది ప్రత్యంగిరామాత మొదటి నాలుగు చేతులలో ఒకచేతిలో త్రిశూలము మరోచేతిలో సర్పము అలంకారంగాచుట్టుకున్న డమురుకము,మరో చేతిలో ఈటె వంటి కత్తి మరోచేతిలో అసురుని శిరస్సు మిగితా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో మెడలో కపాల మాలతో అత్యంత పొడువైన కేశాలతో కేశాల చివర శక్తి తోకూడిన తంతువులు నాల్గు సిం హల స్వర్ణ రధంపై[ఈ నాల్గు సిం హలను నాల్గు వేదాలు గా కొందరు మరికొందరు నాల్గు పురుషార్ధాలుగానూ ఇంకొందరు నాల్గు ధర్మాలగానూ విశ్లేషిస్తారు సాధకులు} ఉద్బవించింది.ఈమె ఉద్బవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశ్ లోని ఒక రహస్య ప్రదేశములోవుంది ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో వుంటాయి ఈ సరస్సు కు ఎల్లప్పుడు సిం హాల గుంపు కాపలాగావుంటుంది అని ఎంతో మంది సిద్ధ సాదకులు నిక్కచ్చగా చెపుతున్నారు
మహామాత మహా ప్రత్యంగిర స్వరూపాన్ని చూసి నరసిం హ మూర్తి అహంకారాన్ని వీడి తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి ఉగ్ర నరసిం హ అవతారాన్ని చాలించి యోగ నరసిం హ మూర్తిగా కొలువు తీరుతాడు. అందుకే మహా ప్రత్యంగిరను కాళీ సహస్రనామస్తోత్రంలో నృసిం హిక అంటూ వర్ణించారు. శుభంభూయాత్ మరన్ని విషయాలు రేపు తెలుసుకుందాం

జ్యోతిష ప్రయోజనం.......!!


మనిషికి తెలిసిన అన్ని శాస్త్రాలలోకి జ్యోతిషం గొప్పది. పుట్టిన తేది, సమయం, ప్రదేశం- ఈ మూడిటిని బట్టి మనిషి వ్యక్తిత్వం, జీవితం లో జరుగబోయే సంఘటనలు, ఆయు ప్రమాణం, ఇతర వివరాలు ఏ ఇతర సైన్సు చెప్పలేదు. జీవితంలో ఎన్ని సాధించినా మనిషికి తెలియంది భవిష్యత్తు మాత్రమె. దానిని స్పష్టంగా చూపించే విద్య జ్యోతిషం.
జరిగేది ఎలాగూ జరుగుతుంది, జ్యోతిషం ఎందుకు అన్న ప్రశ్న ఈ నాటిది కాదు. చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నది. భట్టోత్పలుడు వరాహుని గ్రంధాలకు, పృధు యశస్సు గ్రంధాలకు వ్యాఖ్యాత. ఈయన ఈ విషయాన్ని వివరంగా చర్చించాడు. ముందు జరుగ బోయేవి తెలుసుకుంటే మార్చుకునే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అసలు జ్యోతిష ప్రయోజనం జరుగబోయే చెడును తొలగించుకోడమే. దానికి అవకాశముందా అన్నది ప్రశ్న?
భవిష్యత్తును మార్చుకునే అవకాశం తప్పక ఉంది. అవకాశమే లేకుంటే జ్యోతిష విద్యకు అర్థమే లేదు. అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు. దానిని మార్చవచ్చు. జీవితంలో మనం అనుభవించే మంచి, చెడు రెండూ మనము పూర్వ జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరియైన కర్మను ఇప్పుడు చేసి, దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితం మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది.
అయితే భవిష్యత్తు మొత్తాన్నీ మన ఇష్టం వచ్చినట్టు మార్చగలమా? మార్చలేము. కర్మ మూడు రకాలు. మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ. రెండవది రెమెడీస్ కి లొంగే అదృఢ కర్మ. మూడవది గట్టి రెమెడీస్ కి లొంగే మిశ్ర కర్మ. జ్యోతిష చక్రాన్ని బట్టి ఏది ఏదో తెలుస్తూంది. ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ , అక్ష వేదాంశ, నక్షత్రాంశ, షష్ట్యంశ లు పూర్వ జన్మ దోషాలను చూపుతాయి. నాడీ అంశ గుర్తించ గలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు. దోషాలన్నీ పూర్వ జన్మపు చెడు కర్మలు. మంచి యోగాలు మంచి కర్మలు. దోషాల పైన గురు దృష్టి లేదా పంచ విధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది. శుభ గ్రహ సంబంధం లేకుంటే లొంగదు.
మనిషి జీవితంలో పశ్చాత్తాపానికి ఎప్పుడూ అవకాశం ఉంది. చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం భగవంతుని సృష్టిలో ఉంటుంది. అయితే రెమెడీస్ అనేవి తూతూ మంత్రంగా చేసి తరువాత మళ్ళీ మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అంటే కుదరదు. చిత్త శుద్ధితో, చేసిన పాపాలకు నిజమైన పశ్చాత్తాపం తో భగవంతుని వేడుకుంటూ రెమెడీస్ మనస్పూర్తిగా చేస్తే తప్పక అవి ఫలితాన్ని ఇస్తాయి. చాలా సార్లు ఫలితాలు వెంటనే కనిపించి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇది ఎన్నో సార్లు రుజువైంది.
కాకుంటే రెమెడీస్ చెయ్యడం చాలా కష్టం. తేలికగా కనిపించే రెమెడీస్ కూడా ఒక పట్టాన లొంగవు. చెయ్యటానికి బుద్ధి పుట్టదు. పుట్టినా అనేక అవాంతరాలు కలుగుతాయి. మధ్యలో మాని వేయాల్సిన పరిస్తితులు తలెత్తుతాయి. వీటన్నిటికీ తట్టుకొని నిర్ణీత కాలం వరకు చెయ్య గలిగితే తప్పక దోషాలు తోలగుతవి. జ్యోతిషం మణి, మంత్ర, ఔషదాలను రేమేడీలుగా సూచించింది. ఇవే గాక తాంత్రిక రేమేడీలు ఉన్నాయి. సులభంగా కనిపిస్తూ చేసేటప్పుడు నానా బాధలు పెట్టె లాల్ కితాబ్ రేమేడీలు ఉన్నవి.
జ్యోతిషం నిరాశావాదం కాదు. ఇది జీవితం మీద ఆశను పెంచే శాస్త్రం. రేమేడీల ద్వారా భవిష్యత్తును మార్చుకోవచ్చు అనేది నిర్వివాదం. ఇదే జ్యోతిషం యొక్క అసలైన ప్రయోజనం.
పండుగలు
జ్యోతిషశాస్త్ర విజ్ఞానమును మనకిచ్చిన మహర్షుల ఉద్దేశ్యముజ్యోతిషశాస్త్ర విజ్ఞానమును మనకిచ్చిన మహర్షుల ఉద్దేశ్యము భవిష్యత్తును చూచి భయపడి పారిపోవటానికో దుఖి:స్తూ కృషించడానికి కాదు. భయంకరమైన నది లాంటి సంసారము లో ఈదే జీవులు ఇక్కడసుడిగుండాలున్నాయో, ఎక్కడ భయంకర కాలసర్పాలున్నాయో, ఏప్రాంతములో ఏసమయానికి మిమ్మల్నిమింగాలనిమొసల్లు కాచుకుని వుంటాయో తెలియజేయటము. తెలియటము ద్వారా భయపడటము కాక జాగ్రత్తలు తీసుకుని ఆప్రమాదాలనుంచి లేక ఇబ్బందులనుంచి తెలివిగా తప్పుకుని సాగిపోవటమే వారు కరుణతో మనకందించిన ఈవిద్య లక్ష్యము. ఈ ప్రయాణము ఆపుదామన్నా ఆగేది కాదు,దాని సమయము పూర్తయినదాకా. కనుక నదిని ఈది దాటటము ప్రమాదకరము,కష్టతరము. కాని నదిని ఈదక తప్పదు. మొండిగా ఈదుతానిని దిగి కొందరు అలసి సొలసి ఈదితే, ఈలోపలకొందరు అంతమయ్యేదికూడా మధ్యలో జరుగుతుంది.
తెలివి అదృష్టవంతుడు ఒక చెక్కనో దుంగనో ఆధారము చేసుకుని ఈదుతూ తన శ్రమను కొద్దిగా తగ్గించుకుంటాడు. తెలివి కలవాడు ఒక పడవను తయారు చేసుకుని దానిని నడుపుకుంటూ ప్రమాదాలు దాటుకుంటూ వెళతాడు. భగవన్నామము అను ఓడను ఎక్కిన వాడు పూర్ణవిశ్వాసముతో నిశ్చితముగా, హాయిగా , విశ్రాంతిగా , సునాయాసముగా ఈనదిని తరిస్తాడు.
ఈఈ ప్రమాదాలు ,గండాల గుండాలు ఎక్కడున్నాయో ప్రయాణముళో ఏసమయానికి మీకెదురవుతాయో తెలియజేసే స్పష్టమైన మ్యాపు జ్యోతిష్యము మనకిస్తుంది. దానిని చూసి భయపడి ప్రయాణము చేసినంతసేపు ఏడవడము కాదు.వివరాలు తెలిసాయికదా అన్న ధైర్యముతో సాగాలి.
ఆవిద్యను కూడా మనకిచ్చారా మహానుభావులు. అసలు మనిషి జీవిత విధానము ఈ ప్రకృతి లో ఏశక్తులు నియంత్రిస్తున్నాయో పరిశోధించి దర్శించి వాటి పరిష్కార మార్గాలను కూడా ఇచ్చారు.ఇంకా ఈప్రాకృతికశక్తులన్నీ ఏ దివ్య చైతన్యము ద్వారా నియమాత్మకముగా నడప బడుతున్నాయో ఆ పరాశక్తి ని ఆశ్రయిస్తే ,ఆశక్తితో మమేకమైతే ఇక సృష్టిలో ఎవరికీ భయపడవలసిన అవసరము లేదనే సత్యాన్నివారు కరుణతో మనకు బోధించారు. ఈపుణ్యభూమిలో మాత్రమే లభించినది ఈదివ్య విద్య.
ఇక మనకు ఈమధ్య ఆరోగ్య సృహ బాగాపెరిగినది. వ్యాధి రాకముందే అనేక రకాల వైద్య పరీక్షలు చేపించు కుంటున్నాము. అక్కద అన్ని పరీక్షలు చేసి వైద్యులు నాయనా ! నువ్వు ఈనూనెలు ఎక్కువ వాడితే నీకు గుండెపోటు రావచ్చు. నీ శరీరములో ఫలానా పదార్ధము ఎక్కువవుతున్నది దీనిద్వారా ఫలానా వ్యాధి వచ్చేఅవకాశమున్నది అని హెచ్చరిస్తే మనమేమి చేస్తాము. ఏడుస్తూ నాకావ్యాధి వచ్చేస్తున్నది అని తిండితిప్పలు మాని కూర్చుంటామా? లేదే! దానికి తగు జాగ్రత్తలు తీసుకుని రాబోయేప్రమాదాలనుంచి తప్పించుకుంటాము. ఎందుకండీ ఏపరీక్షలు లేనిపోనిది వల్లు చెప్పాక బాధపడాలి అని ఆపరీక్షలజోలి కెల్లకపోవటము మన ఇష్టాఇష్టాలకు సంబంధించినది. ఎక్కడో ఒక చోట కొందరు దుర్మార్గులైన వైద్యులు లేని రోగలక్షణాలను చెప్పి దోచుకునే వారుండవచ్చు,అంతమాత్రాన అది వైద్య విద్యకు సంబంధించిన లోపము కాదుకదా?
ఇక జ్యోతిష్యశాస్త్ర ఆధారముతో సమస్యలకు మూలాలను తెలుసుకుని. గురువులు ప్రసాదించిన భగవన్నామమనే సంజీవనిని అందిస్తున్నాం. ఆకలైన వారు కోసము వంటచేసుకునితినాలి. ఓపిక లేనప్పుడో, లేక చేతకానప్పుడో మనమేదో వండి పెడతాము కానీ తిని ఆకలి తీర్చు కోవలసిన పని వారికేసాద్యము,వారే ఆపనిచేయాలి.
ముందుగ నక్షత్రాలు, గ్రహాలు, రాశులు, లగ్నాలు మొదలైనవి నేర్చుకుందాం......
రాశులురాశులు 12...........
01. మేష రాశి
02. వృషభ రాశి
03. మిధున రాశి
04. కర్కాటక రాశి
05. సింహ రాశి.
06. కన్యా రాశి
07. తులా రాశి
08. వృశ్చిక రాశి
09. ధనుస్సు రాశి
10. మకర రాశి
11. కుంభ రాశి
12. మీన రాశి
గ్రహాలు...........
గ్రహాలు 9
1. సూర్యుడు
2. చంద్రుడు
3. అంగారకుడు
4. బుధుడు
5. బృహస్పతి
6. శుక్రుడు
7. శని
8. రాహువు
9. కేతువు
నక్షత్రాలు:నక్షత్రాలు 27.........
01. అశ్విని
02. భరణి
03. కృత్తిక
04. రోహిణి
05. మృగశిర
06. ఆరుద్ర
07. పునర్వసు
08. పుష్యమి
09. ఆశ్లేష
10. మఖ
11. పుబ్బ
12. ఉత్తర
13. హస్త
14. చిత్త
15. స్వాతి
16. విశాఖ
17. అనూరాధ
18. జ్యేష్ట
19. మూల
20. పూర్వాషాఢ
21. ఉత్తరాషాఢ
22. శ్రవణం
23. ధనిష్ట
24. శతభిషం
25. పూర్వాభాద్ర
26. ఉత్తరాభాద్ర
27. రేవతి
నక్షత్రములు - స్వభావములు.....
సవ్య నక్షత్రములు------
అశ్విని
పునర్వసు
హస్త
మూలభరణి
పుష్యమి
చిత్త
ఉత్తరాభాద్ర
పూర్వాభాద్ర
పూర్వాషాఢ
ఉత్తరాషాఢ
రేవతికృత్తిక
ఆశ్లేష
స్వాతి
అపసవ్య నక్షత్రాలు.....
రోహిణి
మఖ
విశాఖ
మృగశిర
పుబ్బ
అనూరాధ
శ్రవణం
ధనిష్ట
శతభిషం
ఆరుద్ర
ఉత్తర
జ్యేష్ట
పురుష నక్షత్రాలు........
అశ్విని
అనూరాధ
శ్రవణం
పుష్యమి
ఉత్తరాభాద్ర
పూర్వాభాద్ర
పునర్వసు
హస్త
స్త్రీ నక్షత్రాలు.....
భరణి
కృత్తిక
రోహిణి
ఆరుద్ర
ఆశ్లేష
మఖ
పుబ్బ
చిత్త
ఉత్తర
విశాఖ
స్వాతి
జ్యేష్ట
పూర్వాషాఢ
ఉత్తరాషాఢ
ధనిష్ట
రేవతి
పురుష నక్షత్రాలు......
ధృవ తారలు : ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి.
తీక్షణ తారలు : మూల, ఆరుద్ర, ఆశ్లేష, జ్యేష్ట.
ఉగ్ర తారలు : పూర్వాషాఢ, పూర్వాభాద్ర, భరణి, మఖ.
క్షిప్ర తారలు : కృత్తిక, విశాఖ.
చరములు : శ్రవణము, ధనిష్ట, శతభిషము, పుఅర్వాసు, స్వాతి.
నక్షత్రములు - ఆధిపత్య గ్రహములు..... అశ్విని, మఖ, మూల---కేతువు
భరణి, పుబ్బ, పూర్వాషాఢ---శుక్రుడు
కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ---రవి
రోహిణి, హస్త, శ్రవణం---చంద్రుడు
మృగశిర, చిత్త, ధనిష్ట ----కుజుడు
ఆరుద్ర, స్వాతి, శతభిషం---రాహువు
పునర్వసు,విశాఖ,పూర్వాభాద్ర---గురువు
పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర---శని
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి---బుధుడు
రాశి చక్రానికి ప్రారంభ బిందువు ఎక్కడ అన్నదొక వివాదం. ప్రతీ సంవత్సరం సూర్యుడు భూమధ్యరేఖ పైకి వచ్చే బిందువుని వసంత విషువద్బిందువు అని అంటారు. అది సుమారుగా మార్చి 21వ తేదీన జరుగుతుంది. ఆరోజు భూమధ్య రేఖమీద పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ బిందువే రాశి చక్రానికి ప్రారంభ బిందువు అని ఒక సాంప్రదాయం. ఇలా లెక్కపెట్టే రాశిచక్రాన్ని సాయన రాశిచక్రం అంటారు. కానీ భూమి తనచుట్టూ తాను తిరగడమే కాక బొంగరంలా ధృవాల దగ్గర అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. ఈ ఊగే చలనం ఫలితంగా ప్రతి ఏడాదీ సూర్యుడు భూమధ్య రేఖ మీదకి వచ్చే బిందువు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది . దీని ఫలితంగా రాశిచక్రపు ప్రారంభ బిందువు కూడా మారిపోతూ ప్రతీ డెబ్భైరెండు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సాయన రాశి చక్రం అంటే ప్రతీ ఏడాదీ ప్రారంభ బిందువు మారిపోయే రాశిచక్రం . దీన్ని ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషంలో ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న భారతీయ జ్యోతిశ్శాస్త్రం ఇలా మారిపోయే రాశిచక్రాన్ని పరిగణనలోకి తీసుకోదు. ఒకానొక స్థిరమైన బిందువునించి రాశిచక్రాన్ని లెక్కిస్తుంది. ఆ రాశిచక్రాన్ని నిరయణ రాశి చక్రం అంటారు. వసంత విషువద్బిందువుకీ (అంటే పాశ్చాత్య రాశిచక్రపు ప్రారంభ బిందువుకీ) ఈ స్థిరబిందువుకీ మధ్య ప్రస్తుతం సుమారు 23 డిగ్రీల తేడా ఉన్నది. దాన్నే అయనాంశ అంటారు. అయితే ఈ స్థిరబిందువు ఎక్కడ ఉండాలి అన్నదానిపై కూడా జ్యోతిష్కులకి ఏకాభిప్రాయం లేదు. భారతీయ జ్యోతిషంలో కూడా ఒక సంప్రదాయానికీ మరొక సంప్రదాయానికీ ఈ స్థిరబిందువు కొద్దిగా మారుతుంది. అంటే అయనాంశ మారుతుంది. ఈ అయనాంశలో లాహిరి, రామన్, దేవదత్త, కృష్ణమూర్తి మొదలైన రకాలు ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు రాశిచక్రాలు అనుకోవచ్చు. సాయన రాశిచక్రం ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషానికి చెందినది. ఒకే వ్యక్తి యొక్క జాతకచక్రాన్ని ఈ రెండు రాశిచక్రాల ప్రకారం గుణిస్తే అసలు ఒకదానికీ మరొకదానికీ సామ్యమే ఉండదు. ఒక జాతకం ప్రకారం మేషంలో సూర్యుడుంటే, మరొక జాతకం ప్రకారం మీనంలో ఉంటాడు (భారతీయ, పాశ్చాత్య రాశిచక్రాల మధ్య 23 డిగ్రీల భేదం ఉంది కాబట్టి). అదే విధంగా భారతీయ జ్యోతిషంలో కూడా అయనాంశ భేదాల ప్రకారం అంత కాకపోయినా కొద్ది భేదంతో (ఒక డిగ్రీ సుమారు) రాశిచక్రాలు మారతాయి. నిరయణ సిద్ధాంతం ప్రకారం విషువములూ, అయనములూ ఋతువులని అనుసరించి రావు. భాగవత ప్రమాణం ఇలా ఉంటుంది - మేష తులలయందు మిహిరుండహో రాత్రు లందు తిరుగు సమ విహారములను. (పంచమ స్కంధం, ద్వితీయాశ్వాసం, 21వ అధ్యయం, 79వ పద్యం.) అంటే మేష, తులా సంక్రమణాల సమయంలో పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి అని. సాయన సిద్ధాంతం ప్రకారం మేష తులా సంక్రమణాలు వరుసగా మార్చి 21, సెప్టెంబరు 22న వస్తాయి. ఆ దినాల్లో భూమధ్యరేఖ పైన రాత్రీ, పగలూ సమానంగా ఉంటాయి. కానీ నిరయణమతం ప్రకారం మేష తులా సంక్రమణాలు ఏప్రిల్ 14, అక్టోబర్ 14 న వస్తాయి. ఆ రోజుల్లో పగలూ రాత్రీ సమానంగా ఉండవు.

అద్దం పగలకూడదా.....!!


మనం అందం, ఆకారం ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం... అద్దం. అది మనల్ని మనకు పరిచయం చేస్తుంది. మన అందాన్ని పట్టి చూపిస్తుంది. అటువంటి అద్దం పగిలితే అరిష్టమంటారు మన పెద్దలు. పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు. పగిలిన, మరకలు పడిన, మాసిపోయిన అద్దాన్ని అసలు ఇంటిలోనే ఉంచుకోకూడదని వారి వాదన. మన ఇంటి గోడకు హుందాగా వేళ్లాడే అద్దం వెనుక ఇటువంటి నమ్మకాలు, కథలు ఎన్నో ఉన్నాయి.
హిందువులు అద్దాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే అద్దం పగిలితే సంపద చెల్లాచెదురైపోతుందని అంటారు. అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలిచి ఉండదు. లక్ష్మి కూడా అంతే. నిలకడగా ఉండదు. అందుకే అద్దం పగిలితే ధననష్టం జరుగుతుందని పెద్దలు చెబుతారు.
అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందని భావిస్తారు కొందరు. దానికి ఏవో కారాణాలు చెబుతారు. అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలితే మన రూపం ఛిద్రమైనట్టేనని వారి అభిప్రాయం. అటువంటి నమ్మకాల వెనుక కొన్ని ప్రాక్టికల్ నిజాలున్నాయంటున్నారు ఆధునిక పరిశోధకులు. అద్దం అంటే గాజుతో తయారుచేయబడిన వస్తువు. కాబట్టి జారిపడి పగిలినప్పుడు ఎంత జాగ్రత్తగా ఏరినా… అక్కడక్కడా చిన్న ముక్కలు ఉండి కాళ్లలో గుచ్చుకుంటాయి.
కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదంజరుగుతుందని మన పూర్వీకులు ఆ విధంగా చెప్పి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా అద్దం పగిలితే మరో అద్దం కొనాలి. అందుకు ధనవ్యయం అవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిదని అంటున్నారు.

ఇంట్లో గడప అవసరం ఎంతైనా ఉంది....!!

‘దేహళి’ అంటే ‘కడప’ ద్వారం దాటడానికి వేసే ‘నడిమి పడిని’ కడప అంటారు. కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వరస్వామి యొక్క దేవుని కడప కావటమే. అయితే కొన్ని ప్రాంతాలలో గడపగా కూడా పిలుస్తుంటారు.
కడప ఇళ్లల్లోకైతే మేలైన కలపతో ద్వారానికి అనుసంధానంగాను, దేవాలయాలలో అయితే శిలా రూపంలోనూ చెక్కుతారు. ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కాని, దేవాలయంలోకి కాని వెళ్లకూడదు. దాటుతూ వెళ్లాలి. ఈ కడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి. అలా కాకుండా నిర్మిస్తే అది దేహళీ భిన్న వేధగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైన ఇబ్బందులకు గురి చేస్తుంది.
గడప నిర్మాణంవలన మరొక వాస్తు ప్రయోజనం లౌకిక ప్రయోజనం కూడా ఉంది. ఏ గదికి ఆ గదికి గడప, లేకపోతే పడక గదికీ, వంట గదికీ దేవుని గదికీ తేడాయే ఉండదు.
ఒక సామాన్యమైన ఉదాహరణ గమనించండి. ఒక భూస్వామికి పదెకరాల పొలం ఉందనుకోండి, ఆ మొత్తం పొలానికి ఏకంగా నీరు పెడతాడా? పెట్టడు. మడికీ మడికీ మధ్య గట్టు ఏర్పరచి మళ్లు మళ్లుగా నీరు పెడతాడు. కారణం ‘మడి’ అంటే హద్దు గట్టు అంటే హద్దును ఏర్పరిచే ఒక గడప.
దేవుని పూజకు మడికట్టుకోవడమంటే కూడా అదే అర్థం. ఒక ప్రత్యేకమైన పనికి కట్టుబడి ఉండడం. అందుకే ఇంట్లో గడప అవసరం ఎంతైనా ఉంది.
గడప వలన మరొక లౌకిక ప్రయోజనం కూడా ఉంది. పాములూ, తేళ్లు వంటి పాకుడు క్రిమి కీటకాలు (సరీసృపాలు) ఎప్పుడూ ఏదో ఒక ఆధారంగా ఓరగా పాకుతుంటాయి. అదే గడప ఉన్నట్టయితే ఇంట్లోకి రాకుండా బయటినుండే వెళ్లిపోతాయి. అందుకే ఇంట్లో ప్రతి గదికీ గడప (కడప) ఉండాలి అని వాస్తు శాస్త్రం సర్వార్ధ సాధక నియమాన్ని నిర్దేశించింది. ఆ గడప ద్వార ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. చీలికలు, నరుకులు ఉండకుండా అఖండంగా ఉండాలి. అది దోషంగా ఉన్నప్పుడు దేహళీభిన్న వేధగా పీడిత ద్వార దోషంగా హాని కలిగిస్తుంది.
ఏ గృహానికయినా గడపలు తప్పనిసరి. పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వా రానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారా లు బిగించబడ వు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగే గడపలేని గృహాలు ఉండకూడదు.

చేతితో భోజనం ఎంత ఉపయోగమో!?


డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది.
తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..?
హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది. 
ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు.
దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం..
చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని.
అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓ సారి చూద్దాం. ఇది చదివాక ఎక్కడున్నా…?
మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను
చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు......
1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.
2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.
3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.
4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.
6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.
7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.
8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.
9.చేతితో తినటం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో తెలుస్తుంది.
10.శుభ్ర౦చేసిన చేతితో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు.
జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది.
ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది.
పురణాల పరంగా…
*చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట.
*బొటనవేలు:అగ్నితత్వం
*చూపుడు వేలు:వాయుతత్వం
*మధ్యవేలు:ఆకాశం
*ఉంగరపు వేలు:భూమి
*చిటికిన వేలు:జలతత్వం..
ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.
ఫ్యాషన్ కి ఇచ్చినంత విలువ ..సంస్కృతికి ఇస్తే ...మానవ జీవనం కొంత సరళమవుతుందనుకుంటా...

ఆ తల్లి నుదుటన బొట్టుపెట్టి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయట.....!!




అడవిలో ఆలయం ముళ్లు, రాళ్లలో ప్రయాణం అడుగడుగునా ప్రణవిల్లే దైవత్వం కోరిన కోర్కెలు తీర్చే పుణ్యధామం కష్టాలు తొలగిపోయే ఇష్టకామేశ్వరి దర్శనం శ్రీశైలం మల్లన్న స్వామికి చేరువలో భక్తుల కోర్కెలు తీరుస్తున్న ఇష్టకామేశ్వరి దేవి ఆలయం గురించి తెలుసుకుందాం.
పూర్వం సిద్ధుల పూజలు అందుకున్న ఇష్టకామేశ్వరీ దేవి నేడు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తోంది. శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన నల్లమల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు. పక్షుల కిలకిలలు జంతువుల అరుపులు జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన తప్పకుండా కలుగుతుంది.
ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో తామర పుష్పాలను మిగతా రెండు చేతుల్లో జపమాల - శివలింగం ధరించి కనిపిస్తుంది. విష్ణుదర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల, శివలింగాన్ని ధరించి ఉంటుందని వర్ణించబడింది. అందుకే ఈ అమ్మవారిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఆ తల్లి నుదురు మెత్తగా ఉంటుందని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. ఇష్టకామేశ్వరి నుదుటిపై బొట్టు పెడితే తమ కోరికలు 41 రోజుల్లో తప్పకుండా నెరవేరతాయని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటే, తప్పకుండా ఆ కోరికలు నెరవేరతాయని అంటారు. ఇదే విషయం 'ఇష్ట కామేశ్వరీ వ్రతం' లోను కనిపిస్తుంది.
అమ్మవారి ఆలయంలోకి పాకుతూ వెళ్లాలి.. చిన్న పాటి గుహలా కనిపిస్తుంది. గర్భగుడిలో నలుగురు కూర్చోడానికి మాత్రమే స్థలం ఉంటుంది. వారికి దర్శనం అయిన తర్వాతే మిగతావాళ్లు వెళ్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు అధికసంఖ్యలో ఇక్కడకి వస్తుంటారు. ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం, పొంగలిని నివేదనగా సమర్పిస్తారు.
ఇక ఇక్కడి ఆలయ గోపురానికి ఓ ప్రత్యేకత ఉంది. మెట్ల రూపంలో కోలగా కనిపిస్తుంటుంది. జిల్లాలోని కొలమిగుండ్ల శివారులో నాలుగు శివాలయాలున్నాయి.. వాటి గోపురాలను కూడా మెట్ల లాగే నిర్మించారు. శ్రీశైలం మల్లన్న గర్భాలయ విమాన గోపురం కూడా మెట్లను కలిగి కోలగా కనిపిస్తుంది.
ఈ ఆలయానికి ఎదురుగా భిన్నమైన సిద్ధుని విగ్రహం, మహిషాసురమర్ధని విగ్రహం, కాపాలికుని విగ్రహం కనిపిస్తాయి. దీనినిబట్టి ఒకప్పుడు సిద్దులకు తర్వాత కాపాలికులకు ఈ ఆలయం కేంద్రంగా ఉండేదని భక్తులు చెబుతుంటారు. ఇక ఇక్కడ ఉత్తర వాహినిగా ఓ వాగు నిరంతరం ప్రవహిస్తుంటుంది. శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి, భ్రమరాంబదేవి వెలిసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా వెలిశారని ఇక్కడి పూజారులు చెబుతున్నారు.
ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఈ జీపుల్లో ఏడుగురిని మాత్రమే ఎక్కించుకుంటారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 770 రూపాయలు వసూలు చేస్తారు. రోజు మొత్తం మీద చెక్ పోస్టు నుంచి 10 జీపులను మాత్రమే ఆలయానికి పంపిస్తారు.. గతంలో త్రిపురాంతకం నుంచి యర్రగొండపాలెం వెళ్లి అక్కడ నుంచి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించి పాలుట్ల నెక్కంటి మీదుగా ఇష్టకామేశ్వరి ఆలయానికి చేరుకునే అవకాశం ఉండేది. కాని భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పుడు ఫారెస్ట్ అధికారుల అనుమతి తప్పనిసరి చేశారు. అయితే రోడ్డు సరిగ్గా లేదని కనీసం మట్టి రోడ్డయినా వేయాలని భక్తులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు.
పక్షుల కిలకిలలు . జంతువుల అరుపులు ... జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన తప్పకుండా కలుగుతుందట.


"శ్రీ సీతారాముల కల్యాణోత్సవం" సందర్భంగా ఇరువురి వంశ వైభవాన్ని తెలుసుకుందాం రండి.

రాబోయే శ్రీరామ నవమి "శ్రీ సీతారాముల కల్యాణోత్సవం" సందర్భంగా ఇరువురి వంశ వైభవాన్ని తెలుసుకుందాం రండి.
🙏రఘువంశ వర్ణన🙏
(దశరథ మహారాజు పూర్వీకులు)
చతుర్ముఖ బ్రహ్మ
మరీచి -->
కశ్యపుడు -->
సూర్యుడు -->
మనువు -->
ఇక్ష్వాకుడు -->
కుక్షి -->
వికుక్షి ->
భానుడు -->
అనరంయుడు -->
పృథుడు -->
త్రిశంకువు -->
దుందుమారుడు ->
మాంధాత -->
సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌
ధృవసంధి->
భరతుడు -->
అశితుడు -->
సగరుడు -->
అసమంజసుడు -->
అంశుమంతుడు -->
దిలీపుడు -->
భగీరతుడు -->
కకుత్సుడు -->
రఘువు -->
ప్రవృద్ధుడు -->
శంఖనుడు -->
సుదర్శనుడు -->
అగ్నివర్ణుడు -->
శీఘ్రకుడు -->
మరువు -->
ప్రశిశృకుడు -->
అంబరీశుడు -->
నహుశుడు -->
యయాతి -->
నాభాగుడు -->
అజుడు -->
దశరథుడు -->
రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుడు.
🙏జనక వంశ వర్ణన🙏
(జనక మహారాజు పూర్వీకులు)
నిమి చక్రవర్తి -->
మిథి -->
ఉదావసువు -->
నందివర్దనుడు -->
సుకేతువు -->
దేవరాతుడు -->
బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.
మహావీరుడు -->
సుదృతి -->
దృష్టకేతువు -->
హర్యశృవుడు -->
మరుడు -->
ప్రతింధకుడు -->
కీర్తిరతుడు -->
దేవమీదుడు -->
విభుదుడు -->
మహీద్రకుడు -->
కీర్తిరాతుడు -->
మహారోముడు -->
స్వర్ణరోముడు -->
హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు.
జనకుడు --> సీత, ఊర్మిళ
కుశద్వజుడు --> మాంఢవి, శృతకీర్తి
శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.
👏శ్రీరామ ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
👏సీతాదేవి ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...
👉ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది

పంచభూత తత్వ లింగములు

 ఈ విశ్వమంతా, అంటే మన కళ్ళకు కనిపించేది, కనిపించకుండా ఉన్న ప్రతి పదార్థం, ప్రతి ప్రాణి అయిదు మూల ధాతువుల సంయోగం వాళ్ళ రూపు దిద్దుకున్నవే. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి (మట్టి) అనేవి ఆ అయిదు మూల ధాతువులు. మహేశ్వరుడైన పరమ శివుడు ఆ అయిదు మూల ధాతువుల (పంచభూతాల)లో ఒక్కొక్కదాని రూపం తనలో నింపుకొని అయిదు చోట్ల వెలసి యున్నదని ప్రాణకథ. ఆ అయిదు ప్రదేశాల వివరాలు ఇవి:
1. ఆకాశలింగం ::: తమిళనాడులోని చిదంబరం.
2. వాయులింగం :: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి
3. తేజో (అగ్ని) లింగం :: తమిళనాడులోని తిరువణ్ణామలై
4. జలలింగం :: తమిళనాడులోని శ్రీరంగం (జంబుకేశ్వరం)
5. పృథివి (మట్టి) లింగం :: తమిళనాడులోని కంచీపురం

పాశుపత మంత్ర ప్రయోగము


శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వారా శతృంజయమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు.
పాశుపతము రుద్ర సంపుటి ద్వారా చేయవలయును. రుద్రమునందలి 169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యాన్ని, ఆయుర్వృద్ధిని ఇచ్చే అమృత పాశుపతమును చేస్తున్నప్పుడు ముందుగా పాశుపత మంత్రమును చెప్పాలి.
ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।।
ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా।
ఇది సంపుటి చేయవలసిన మంత్రం.
ఈ మంత్రం చెప్పాక రుద్రం లోని ఒక మంత్రం చెప్పాలి.
ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పాలి.
ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పి రుద్రంలోని తర్వాతి మంత్రాన్ని చెప్పాలి.
ఇలా 169 రుద్ర మంత్రములను సంపుటీకరిస్తే అది ఒక పాశుపతం అవుతుంది. ఇది గురుముఖతః నేర్చుకొని, మంచి అనుభవజ్ఞులతో చేయించుకొన్నచో మంచి ఫలితములను ఇస్తుంది.
ఈ పాశుపత మంత్రములు ప్రధానముగా 14 రకములు.
1. మహా పాశుపతము
2. మహాపాశుపతాస్త్ర మంత్రము
3. త్రిశూల పాశుపతము
4. ఆఘోర పాశుపతము
5. నవగ్రహ పాశుపతము
6. కౌబేర పాశుపతము
7. మన్యు పాశుపతము
8. కన్యా పాశుపతము
9. వరపాశుపతము
10. బుణ విమోచన పాశుపతము
11. సంతాన పాశుపతము
12. ఇంద్రాక్షీ పాశుపతము
13. వర్ష పాశుపతము
14. అమృత పాశుపతము
విధానము:
1. మహాపాశుపతము: Maha Pashupatam
For removing hurdles
మంత్రము: నమశ్శంభవేచ మయోభవేచ నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ।।
ఈ మంత్రమును 169 రుద్రమంత్రములతో సంపుటీకరించి శివునికి అభిషేకించాలి.
అభిషేక ద్రవ్యములు: పంచామృతములు మరియు ఇతర అభిషేక ద్రవ్యములు.
ఫలము: ఈ మహా పాశుపత మంత్ర రాజముతో సమానమగు మంత్రము ముల్లోకములలో ఎక్కడను లేదు. దీని వలన రాజ్యాధికారము ఎట్టి కార్యమైననూ శీఘ్రముగా అగుటకు ఈ మంత్రమును చేయించవలయును.
2. మహాపాశుపతాస్త్ర మంత్రము: Maha Pashupata Astra Mantra
To fulfill wishes
మంత్రము: క్రాం క్రీం క్రోం ఘ్రం క ఎ ఇ ల హ్రీం నమశ్శంభవేచ మయోభవేచ నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ।।
ఈ మంత్రమును 169 రుద్రమంత్రములతో సంపుటీకరించి శివునికి అభిషేకించాలి.
అభిషేక ద్రవ్యములు: పంచామృతములు మరియు ఇతర అభిషేక ద్రవ్యములు.
ఫలము: సర్వ కార్య సిద్ధి, వాంఛితార్థ ఫలదాయిని.
3. త్రిశూల పాశుపతము: Trishula Pashupatam
For health problems and protections from enemies
దీని విధానము మిగతా పాశుపతములకంటే భిన్నంగా ఉంటుంది. దీనిలో మొదట నమకమును, తరువాత పురుషసూక్తమును తదనంతరము చమకమును పఠించిన యెడల ఈ పాశుపత విధానము పూర్తి అగును. ఇది అపమృత్యుహరము.
4. అఘోర పాశుపతము: Aghora Pashupatam
For serious health problems
మంత్రము: ఓం అఘోరేభ్యో2ధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః। సర్వేభ్య స్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః।।
ఈ మంత్రమును రుద్రముతో సంపుటము చేసి శివుణ్ణి అభిషేకించినచో ఈ మంత్రసిద్ధి అగును.
అభిషేక ద్రవ్యములు: దీనికి పంచామృత అభిషేకముతో పాటు అష్టపుష్పపూజ, క్షీరాన్న నివేదనము చేయవలసియుండును.
ఫలము: అపమృత్యుహరం.
5. నవగ్రహ పాశుపతము: Navagraha Pashupatam
For Doshas in Brith chart caused by planets
మంత్రము: ఓం క్లీం శ్రీం ఐం హ్రీం గ్లౌం రం హుం ఫట్‌
విధానము: పైన ఇచ్చిన మంత్రముతో రుద్ర సంపుటి గావించి శివుణ్ణి అభిషేకించాలి.
అభిషేక ద్రవ్యము: పంచామృతములు, బిల్వపత్రములు, అష్టపుషములు, క్షీరాన్నము ఈ అభిషేకమునకు కావలసియుండును.
ఫలము: నవగ్రహ పీడా పరిహారము. జాతకంలోని గ్రహదోష నివృత్తికి, గోచార గ్రహదోష నివృత్తికి ఈ పాశుపత మంత్రము అత్యంత ఫలదాయి.
6. కౌబేర పాశుపతము: Koubera Pashupatam
For Financial growth
మంత్రము: రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే ।
నమో వయం వై శ్రవణాయ కుర్మహే।
సమే కామాన్కామ కామాయ మహ్య।్‌
కామేశ్వరో వైశ్రవణో దదాతు।
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః।
ఈ పై మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటము చేసిన యెడల కౌబేర పాశుపతమనబడును.
ద్రవ్యము: ఆవునెయ్యి తో అభిషేకము, బిల్వపత్ర పూజ, మౌద్గదన నివేదన
ఫలము: ఐశ్వర్యాభివృద్ధి. ఆర్థిక లాభములు.
7. మన్యు పాశుపతము: Manyu Pashupatam
For protections from enemies
మంత్రము: సంపృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చమన్యుః।
భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయం ।।
పై మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటము చేసిన యెడల అది మన్యుపాశుపతమనబడును.
ద్రవ్యము: ఖర్జూర ఫల రసాభిషేకము, జమ్మి పత్రి పూజ, మాషచక్ర నివేదన.
ఫలము: ఈ పాశుపతము వలన శతృబాధానివారణమగును.
8. కన్యా పాశుపతము: Kanya Pashupatam
For unmarried boys
మంత్రము: ఓం పావీ రవీ కన్యా చిత్రాయుస్సరస్వతీ వీరపత్నీధియంధాత్‌ ।
జ్ఞ్నాభిరచ్చిద్రగ్‌ ం శరణగ్‌ ం సజోషా దురాద్ష్రం గృణతే శర్మయగ్‌ ం సత్‌ ।।
ఈ మంత్రమును 169 రుద్రమంత్రమంత్రములచే సంపుటితము చేసిన యెడల కన్యాపాశుపతమనబడును.
అభిషేక ద్రవ్యము: పంచదార (మెత్తగా పొడిచేయాలి) అభిషేకము కొరకు, కరవీర పుష్పములు పూజ కొరకు, చక్కెర పొంగలి నివేదన కొరకు.
ఫలము: ఈ మంత్రము వలన ఇష్టకన్యాప్రాప్తి, వివాహము కాని పురుషులకు తొందరగా వివాహం అవటం ఫలములుగా చెప్పబడ్డాయి.
9. వర పాశుపతము: Vara pashupatam
For Unmarried girls
మంత్రము: ఓం క్లీం నమో భగవతే గంధర్వరాజ విశ్వావసో మమాభిలషితం వరక్షిప్రం ప్రయచ్ఛ స్వాహా।।
ఈ మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటితం చేసిన యెడల అది వర పాశుపతం అగును.
అభిషేక ద్రవ్యము: పంచదార (మెత్తగా పొడిచేయాలి) అభిషేకము కొరకు , కరవీర పుష్పములు పూజ కొరకు, చక్కెర పొంగలి నివేదన కొరకు.
ఫలము: ఈ పాశుపతం వలన ఇష్ట వర ప్రాప్తి, వివాహం కాని కన్యలకు శీఘ్రముగా వివాహం అవటం ఫలములుగా చెప్పబడ్డాయి.
10. బుణ విమోచన పాశుపతం : Rina Vimochana Pashupatam
For Finacial problems and coming out from debts
మంత్రము: ఆనృణా అస్మిన్ననృణాః పరస్మిగ్గ్‌ న్తృతీయే లోకే అనృణాస్యామా। యే దేవయానా ఉత పితృయాణా సర్వాంపథో అన్నణా ఆక్షియేమ।।
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది బ??ుుణ విమోచక పాశుపతమగును.
అభిషేక ద్రవ్యములు: అభిషేకము కొరకు చెఱకు రసం, పూజ కొరకు వాకుడు పువ్వులతో పూజ, ఆవునేయి నైవేద్యం కొరకు.
ఫలితం : బుణ బాధనుంచి విముక్తి
11. సంతాన పాశుపతము : Santana Pashupatam
For Child birth
మంత్రము: ఓం కాణ్డాత్కాణ్డాత్ప్రరోహంతీ పరుషః పరుషః పరీ। ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేనచ।।
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది బ??ుుణ విమోచక పాశుపతమగును.
అభిషేక ద్రవ్యములు: పంచామృతములు, దూర్వాలు(గరిక) -అభిషేకం కొరకు, బిల్వ పత్రములు, అష్ట పత్రములు- అభిషేకము కొరకు, అపూపములు(అప్పడములు), క్షీరాన్నము నైవేద్యము కొరకు.
ఫలము: సంతాన ప్రాప్తి.
12. ఇంద్రాక్షీ పాశుపతము: Indrakshi Pashupatam
For Health problems
మంత్రము: భస్మాయుధాయ విద్మహే। రక్త నేత్రాయ ధీమహీ। తన్నో జ్వరః ప్రచోదయాత్‌ ।
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది ఇంద్రాక్షీ పాశుపతమగును.
అభిషేక ద్రవ్యములు: భస్మము ( భస్మోదకముతో అభిషేకము చేయాలి.) అష్ట పుష్పములు, బిల్వ పత్రములు పూజ కొరకు, మాష చక్రము నివేదన కొరకు.
ఫలితము: నిరంతరము అనారోగ్యములు, జ్వరములతో బాధ పడువారు ఈ పాశుపతము చేసినచో అన్ని రకాల అనారోగ్యముల నుంచి దూరమవుతారని ఫలితము చెప్పబడ్డది.
13. వర్ష పాశుపతము: Varsha Pashupatam
For Rains
మంత్రము: నమో రుద్రేభ్యో యే దివియేషాం వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచిర్దశోదీచిర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తేనో మృడయంతు తేయం ద్విశ్మోయశ్చవో ద్వేష్టితం వో జంభే దధామి.
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది వర్ష పాశుపతమగును.
అభిషేక ద్రవ్యములు: పంచామృతములు, నారికేళములు అభిషేకము కొరకు, బిల్వపత్రములు అర్చన కొరకు, క్షీరాన్నము నివేదన కొరకు
ఫలము: ఇది లోక కళ్యాణార్థము చేయబడే పాశుపతము. సకాల వర్ష ప్రాప్తి, కరువు కాటకముల నివారణ దీని ఫలములు.
14. అమృత పాశుపతము: Amruta Pashupatam
For Longevity and overall growth.
మంత్రము:ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।
ఉర్వారుక మివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।।
ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా।
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది అమృత పాశుపతమగును.
అభిషేక ద్రవ్యము: అభిషేకము కొరకు పంచామృతములు, పూజ కొరకు బిల్వ పత్రములు.
ఫలము: ఈ పాశుపతము అన్నింటిలోకి ముఖ్యమైనది. ఇది అపమృత్యు హరము. సకల ఐశ్వర్య ప్రదము