శ్రీకృష్ణ భగవానుడు ఒకానొకరోజు భీమునికి తొలి ఏకాదశి అనగానేమి, ఆరోజు పాటించవలసిన నియమాలు గురించి బోధించెను.
తొలి ఏకాదశి: ఆషాడ మాస ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజుని ఇంకా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. తొలి ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు. తొలి ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసము ఉంటారు. ఈ రోజు చాతుర్మాస్య వ్రతం మరియు గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని తొలి ఏకాదశి రోజు నుంచి క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.
ఉపవాసము; తొలి ఏకాదశ నాడు ఉపవాసము చేయుట వలన చాల మంచిదని, చేసిన వారికి కోరుకున్న కోరికలు నేరవేరునని అంటారు. అయితే ఉపవాసం అంటే కేవలం తినడం మానేయటం కాదు. ఆ రోజు మంచి పనులు అనగా పేదవారికి దాన, ధర్మములు చేయుట మరియు ఆ మహా విష్ణువును పూజించుట చేయవలెను.
ఉపవాసములో రకములు; శక్తి కొద్ది భక్తి అన్నారు పెద్దలు. అలాగే మన శక్తిని బట్టి మనం ఆ భగవంతుని పూజ గాని అందులో బాగామైన ఉపవాసం గాని చెయ్యవచ్చు. మన శక్తిని బట్టి ఈ క్రిందనివ్వబడిన నాలుగు విదానాలలో ఎలైగైన చెయ్యవచ్చు.
1.రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉండి మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
2.నీళ్ళు, పాలు తీసుకుని.. మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
3.నీళ్ళు, పాలుతో పాటు పండ్లను కూడా తీసుకుని, మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
4.అల్పాహారం స్వీకరించి, మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
ఈ వ్రతము వలన కలిగే ప్రయోజనాలు; అరవై వేల సంవత్సరాలు తపస్సు, , అశ్వమేధ యాగం, భూమి దానం చేసినంత పుణ్యం వస్తుంది. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. అంతేకాకుండా ఉపవాసము చేయడం వలన మనిషికి ఇంద్రియ నిగ్రహం కలిగి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను జయించడం వలన దేనినైనా సాదించగలడు.
ఈ విధంగా శ్రీకృష్ణుడు ఈరోజుకు ఉన్న మహిమ గురించి మరియు చేయాల్సిన విధివిధానాల గురించి భీముడికి చెప్పినారు.
No comments:
Post a Comment