Saturday, 16 July 2016

గరుడ కవచ స్తోత్రం


కాలసర్పదోష(యోగం) నివారణకు,నాగదోష నివారణకు,బందనముల నుండి విముక్తి కొరకు,శత్రుభాదల కొరకు గరుడ కవచ స్తోత్రం త్రికరణ శుద్దితో పఠించిన సర్వ పాపములు తొలగిపోవును. గరుడ కవచ స్తోత్రాన్ని పఠిస్తే చెవి, చర్మ సంబంధ వ్యాధులు పోతాయని, సంతానం కలుగుతుందని ఓ నమ్మకముంది.
జాతకచక్రంలో గ్రహాలు అన్ని రాహు కేతువుల మద్య ఉండి మిగతా రాశి భావాలు ఖాళీగా ఉండటం వలన ఆలస్య వివాహం, భార్యాభర్తలు విడిపోవడం, దాంపత్య సౌఖ్యం లేకపోవడం, చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించడం వంటి ప్రధాన సమస్యలన్నీ జీవితం లో కొన్ని అనుకోని ఊహించలేని మార్పులు జరుగుతుంటాయి.
కాలసర్పదోషం అంటే రాహు కేతువుల మధ్యలో మిగిలిన రవి చంద్ర కుజ గురు శుక్ర శని గ్రహాలు ఒకపక్కన వుండి మరొక పక్కన అసలు గ్రహాలు లేకుండా ఉండడం. సరే బాగా జ్యోతిశ్శాస్త్రం రీసెర్చ్ చేసేవారు వారి అనుభవాలతో చెప్పే అంశాలు ఏమిటి అంటే రాహుకేతువుల మధ్య మాలికా యోగం (సప్తగ్రహ) అనగా వరుస ఏడు రాశులలో ఏర్పడితే అది ప్రమాదకరం అని రాహు కేతువులకు ఈ మాలికా యోగం వలన ప్రత్యక్ష సంబంధం కలగడం వంటివి ఏర్పడుతాయి. కావున ఇబ్బందికరం అని చెబుతారు.
మిగిలిన విషయాలలో కేవలం కాలసర్పదోషం వలన జీవితం పాడయిపోతుంది. అభివృద్ధి వుండదు అనే భావన వాదన శాస్త్ర దూరమైన విషయమే. మిగిలిన గ్రహాలు వాటి స్థితి బాగుండకపోతే వచ్చే ఫలితాలు బాగుంటే వచ్చే ఫలితాలు గూర్చి పరిశీలింపక కేవలం కాలసర్ప దోషం వలన జాతకం పాడయిపోతున్నది అని చెప్పే సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ వున్నారు.
పంచమంలో రాహువు ఉండటం వలన పూర్వజన్మలో శాపం వలన ఈ జన్మలో సంతాన దోషాన్ని అనుభవిస్తున్నారని పరాశర మహర్షి తెలియజేసిన గ్రంధాల ఆదారంగా తెలుస్తుంది. వీటి నివారణకు గరుడ కవచ స్తోత్రాన్ని గురు ముఖంగా పఠించటం వలన సంతాన దోషాన్ని తొలగించుకోవచును.
దోషం తీవ్రం గా ఉన్న జాతకులు మంగళవారం కాని, ఆదివారం నాడు కాని ఉపవాసముండి నాగదేవతను గాని దుర్గాదేవిని గాని పూజించుకుంటూ గరుడ కవచ స్తోత్రాన్ని పఠిస్తే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక బాధలు తొలగించుకోవచ్చును.
అసలు దోష శాంతి ఏమిటి? రాహు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చేరడం వలన వచ్చిన దోషం కావున శాంతి కోసం తొమ్మిది గ్రహాలకు జపం దానం హోమం తర్పణం చేయుట వైదిక ప్రక్రియ. తద్వారా దోష శాంతి చేకూరుతుంది. ఇది వైదీక విజ్ఞానం వున్న బ్రాహ్మణులు, నవగ్రహ మంటపం వున్న ప్రతి దేవాలయంలోనూ చేయించుకోవచ్చు. అలాగ కాకపోతే ఎవరి ఊరిలో వారు కాలసర్ప దోష శాంతి చేసుకోవచ్చు.



No comments:

Post a Comment