Thursday, 28 July 2016

ప్రతి నిత్యము మరియు సమస్యలు వచ్చినప్పుడు పటించవలసిన స్తోత్రములు / ప్రార్దనలు

ఉదయం నిద్ర లేచిన తరువాత
"కాశ్యాం దక్షిణ దిగ్భాగే కుక్కుటో నామ వై ద్విజ
తస్య స్మరణ మాత్రేణ దుస్స్వప్న శ్శుభదో భవేత్"
ఉదయం భూప్రార్ధన
“సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే”
మానసిక శుద్ది
“అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:”
ఉదయం కరదర్శనం
“కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి
కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం”
స్నాన సమయంలో
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు”
భోజనానికి ముందు
"అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి
అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే"
భోజన తరువాత
అగస్త్యం కుంభకర్ణంచ శమించ బడభానలనం
అహారపరిమాణార్దం స్మరమిచ వృకోదరం
ప్రయాణ సమయంలో 21 పర్యాయములు పఠించాలి
“గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ"
అన్ని ఆరోగ్య సమస్యలకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి
“ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహీ కురుకురు స్వహా"
మరియు / లేక "క్రీం అచ్యుతానంత గోవింద”
విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి
"ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా
వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః
ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం
నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం
శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం
ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి"
విద్యార్జన లేక ఉద్యోగ నిమిత్తం నివాసానికి దూరంగ ఉన్నప్పుడు మానసిక / ఆరోగ్య సమస్యలు లేకుండ ఉండటానికి పఠించాల్సిన మంత్రం
“గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ
ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ”
ప్రారంబించిన పనిని విజయ వంతంగ పూర్తి చేయడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
"ఓం నమో మహామాయే మహా భోగదాయిని హూం స్వాహా"
చేపట్టిన కార్యం లొ, పోటి పరిక్షలొ ను విజయం సాదించడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
"శ్రీ రామ జయరామ జయజయ రామరామ"
అన్ని సమస్యలకు ప్రతి నిత్యం సూర్యోదయానికి సూర్య నమస్కారం ఉత్తమం
"ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ:"
ఉద్యోగం లొ ఉన్నతి కొరకు, పై అదికారుల అబిమానం మరియు తన వద్ద పనిచేయువారి సహకారం లబించాలంటె క్రింది మంత్రాన్ని ప్రతి దినం గంట సమయం పఠించాలి
"ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ మమ గృహే పూరయ పూరయ దూరయ దూరయ స్వాహా" మరియు / లేక “శ్రీ రాజ మాంతాంగై నమ:”
ఉత్తమ భర్తను పొందుటకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
“హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా
తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్”
ఉత్తమ భార్యను పొందుటకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
“పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్”
వివాహాం తోందరగా జరగడానికి
మంత్రాన్ని 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
“ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే”
అమ్మాయిలకు వివాహాం తోందరగా జరగడానికి
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
“కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరీ
నందగోపసుతం దేవిపతిం మేకురుతేనమ:
పతింమనోహరం దేహి మనోవృత్తానిసారిణం
తారక దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం
పత్నీమనోరమాం దేహి మనోవృత్తానిసారిణం
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం”
అబ్బాయిలకు వివాహాం తోందరగా జరగడానికి
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
“విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః”
స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కొరకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
"హరిస్త్వా మారాధ్య ప్రణిత జనసౌభాగ్య జననీం
పురానారి భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
స్మరోపిత్వాం వత్యా రతినయన లేహ్యేన వవుషా
మునీనాప్యంత: ప్రభవతి మోహాయ మహతామ్"
వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి
"శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం"
కుటుంభాన్ని నిర్లక్ష్యం చేయు భర్తను మార్చుకోవడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
“ఓం క్లీం త్రయంబకం యజామాహే సుగంధీం పతిర్వర్దనమ్
పతిం ఉర్వారుకవ బంధతృతి మోక్ష మామృతాత్ క్లీం”
కుటుంబంలొ వచ్ఛు సమస్యలను తొలగి సౌఖ్యంగ ఉండడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
"ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ" లేక
"సదాశాంతా సదాశుద్దా గృహచ్ఛిద్ర నివారిణి
సత్సంతానప్రదారామా గ్రహోపద్రవనాశిని"
కుటుంబ సమస్యలతో దూరమైన భర్త ను పొందడానికి మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
:ఓం నమో మహాయక్షిణ్యై మమపతిం
మే వశ్యం కురు కురు స్వహా”
ఆరోగ్య సమస్యలు లేని గర్భధారణకొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“ఓం దేవకిసుత గోవింద జగత్పతె
దేహిమే తనయం కృష్ణ త్వామహాం శరణాగత:”
సుఖ ప్రసవం కొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
ఆస్తి గోదావరీ జలతీరే జంభలానామ దేవతా
తస్యాః స్మరణ మత్రేణ విశల్యాగర్బిణీ భవేత్ జంభలాయై నమః"
ఆపదలు తగ్గడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
"గౌరి వల్లభకామారే కాలకూట విషాదన
మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక"
ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
"అపదామపర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం
"దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ
అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని"
సర్వకార్యసిద్దికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
"నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ
మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల"

Tuesday, 26 July 2016

అస్త్రాలు మొత్తం 23 ఉన్నాయి

మన పురాణకావ్యాలలోని యుధ్దాలలో అస్రశస్త్రాల గురించి విన్నాం. అస్త్రాలలో బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం మొదలైనవి విన్నాం.
అస్త్రాలు మొత్తం 23 ఉన్నాయి. అవి:-
1. పాశుపతాస్త్రం
2. నారాయణాస్త్రం
3. సుబ్రహ్మణ్యాస్త్రం
4. ఇంద్రాస్త్రం
5. బ్రహ్మాస్త్రం
6. ఆగ్నేయాస్త్రం
7. వారుణాస్త్రం
8. వాయువాస్త్రం
9. ఈశానాస్త్రం
10. గంధర్వాస్త్రం
11. నాగాస్త్రం
12. గరుడాస్త్రం
13. అసురాస్త్రం
14. యమ్యాస్త్రం
15. కుబేరాస్త్రం
16. అంధకారాస్త్రం
17. పర్వతాస్త్రం
18. అక్షాస్త్రం
19. గజాస్త్రం
20. సింహాస్త్రం
21. మాయాస్త్రం
22. భైరవాస్త్రం
23. మోహనాస్త్రం
అస్త్రవిద్య ప్రయోగం మాత్రమే తెలిసిఉండడం కాదు. ఉపసంహరణ కూడా తెలిసిఉండాలి.
అస్త్రాలు దుర్వినియోగం కాకుండా ఉండటానికే వేదాలలో వాటివివరణ నేరుగాకాకుండా నిగూఢంగా ఉంటుంది. ఆ కారణంచేతనే వాటి ప్రయోగ ఉపసంహరణలకొరకు గురువు అవసరమైంది.
ప్రస్తుతం నాసా(అమెరికా) ఈ అస్త్రాలపై మన ప్రాచీన గ్రంధాలలో ఉన్న వివరణల ఆధారంగా పరిశోధనలు జరుపుతున్నారు.
వీరి నివేదికల ప్రకారం బ్రహ్మాస్త్రం అంటే న్యూక్లియర్ బాంబు అని సమాచారం.
మన వారసత్వ సంపదలు పరదేశాలకు తరలిపోతుంటే మనప్రభుత్వాలు మాత్రం మొద్దునిద్ర పోతున్నాం.

నవగ్రహాల తల్లిదండ్రులు & భార్యలు పేర్లు

01. రవి[సూర్యుని] తల్లిదండ్రులు అతిది - కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ.
02. చంద్రుని - తల్లిదండ్రులు అనసూయ - అత్రి మహర్షి - భార్య రోహిణి .
03. కుజుని- తల్లిదండ్రులు - భూమి, భరద్వాజుడు - భార్యశక్తి దేవి
04. బుధుని - తల్లిదండ్రులు - తార, చంద్రుడు - భార్య జ్ఞాన శక్తి దేవి
05. గురుని - తల్లిదండ్రులు - తార, అంగీరసుడు - భార్య తారాదేవి
06. శుక్రుని - తల్లిదండ్రులు - ఉష,భ్రుగు - భార్య సుకీర్తి దేవి
07. శని - తల్లిదండ్రులు - ఛాయ, రవి - భార్య జ్యేష్ట దేవి
08. రాహువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య కరాళి దేవి
09 కేతువు - తల్లిదండ్రులు - సింహిక, కశ్యపుడు - భార్య చిత్రా దేవి
* నవగ్రహస్తోత్రాన్ని ప్రతిరోజూపఠించడంవలన గ్రహదోషాలుతొలగిపోతాయి.
రవి- జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో‌రిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
చంద్ర- దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
కుజ-- ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
బుధ-- ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
గురు- దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
శుక్ర-- హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
శని - నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
రాహు - అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
కేతు - ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్

Saturday, 23 July 2016

శనిభగవానుని దృష్టి మహత్యం


శనీశ్వరుడు ఎప్పుడూ అధో దృష్టితోనే ఉంటాడు. దీనికి కారణమేమిటి? ఒకవేళ ఆయన నేరుగా ఎవరినైనా చూస్తే ఏమవుతుంది?
పూర్వం గణపతి పుట్టినప్పుడు జరిగిన కథ ఇది. గణేశుడు అవతరించారనగానే ఆ బాలుడిని చూడటానికి ఎందరెందరో దేవతలు, పార్వతీ పరమేశ్వరుల ఇంటికి వస్తూ ఉండేవారు. అలా ఆ ముచ్చటైన బాలుడిని చూసి ఆశీర్వదించి అంతా ఆనందంగా వెళుతుండేవారు. వారిలాగానే సూర్యుడి కుమారుడైన శని కూడా ఆ శిశువును చూడటానికి ముచ్చట పడుతూ వచ్చాడు. అయితే శని అందరిలాగా తల ఎత్తుకొని కాక తల దించుకొని నేల చూపులు చూస్తూ వచ్చాడు. అతడలా రావటానికి ముందు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని మనసారా స్తుతించాడు. అలాగే ఆయన పక్కనే ఉన్న శ్రీహరిని, బ్రహ్మదేవుడిని, శంకరుడిని, ధర్మదేవత ను, సూర్యుడిని ఇతర దేవతలనందరినీ వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాతనే శిశు రూపంలో ఉన్న గణపతిని చూడటానికి బయలుదేరాడు. ఆయన ముందుగా పార్వతీ దేవి అంతఃపురం ముందున్న శూలహస్తుడైన విశాలాక్షుడు అనే శివకింకరుడి దగ్గరకొచ్చి తల దించుకునే ఆ కింకరుడితో తానెవరో చెప్పి తనను లోపలకు పంపమన్నాడు.
విశాలాక్షుడు శనైశ్చరుడిని లోపలికి అనుమతించాడు. శని లోపలకు వెళ్ళేసరికి పార్వతీ దేవి రత్న సింహాసనం మీద కూర్చుని ఉంది. అయిదుగురు పరిచారికలు తెల్లని వింజామరలు వీస్తూ సేవిస్తూ ఉన్నారు. రత్నభూషణాలను అలంకరించుకొన్న ఆమె ఒళ్ళొ శిశురూప గణపతి ఉన్నాడు. అందరూ ఆ తల్లీ బిడ్డలను చూసి పలకరించి వెళుతున్నారు. రత్న సింహాసనం మీద ఉన్న పార్వతీదేవి దూరంగా తల దించుకొని నిలుచున్న శనీశ్వరుడిని చూసింది. ఆమెకు ఆయనొక్కడే అలా చాలా సేపటి నుంచి తలదించుకొనే ఉండటం విచిత్రమనిపించి అలా ఉండటానికి కారణమేమిటో చెప్పమని అంది. అప్పుడు శని అది తన కుటుంబానికి సంబంధించిన విషయమని, అయినా జగత్తుకంతటికీ తల్లిలాంటిదైన పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పటమే ఎంతో మేలైన విషయమని అంటూ తన స్వవిషయాన్ని వివరంగా ఇలా చెప్పాడు.
తాను సూర్యుడి కుమారుడినని, తనకు యుక్త వయస్సు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తనకు వివాహం చేశాడని అన్నాడు. తాను చిన్నప్పటి నుంచి నిరంతరం శ్రీహరినే ధ్యానిస్తూ ఉండేవాడినని, హరి ధ్యానమే తప్ప వేరొకటి తెలియని తనకు మళ్ళీ తనలాగే భక్తి పరురాలైన భార్య దొరికినందుకు ఆనందించానన్నాడు. తన భార్య కూడా ఎప్పుడూ అలా ధ్యానంలోనే ఉండేదని, అయితే ఓసారి ఆమె రుతుస్నాత అయి సంతానార్థం తన దగ్గరకు వచ్చి నిలిచినా తానామె వైపు కనీసం చూడలేదన్నాడు. అందుకామెకు బాగా కోపం వచ్చి ఆనాటి నుంచి తాను నేరుగా ఎవరిని చూస్తే వారు నశిస్తారని శపించిందని పార్వతీ దేవికి శనీశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఆమెను తాను ప్రసన్నురాలిని చేసుకున్నా ఆ శాపం మాత్రం విముక్తి కాలేదని, తాను ఎవరి వైపు నేరుగా చూస్తే వారు నశిస్తున్నారు కనుక అధో దృష్టితో కాలం గడుపుతున్నానన్నాడు శనైశ్చరుడు.
పార్వతీమాత ఆ మాటలు విని శని పరిస్థితికి బాధ పడింది. అయినా జరిగేదంతా భగవదేచ్ఛ ప్రకారం, కర్మను అనుసరించి జరుగుతుంటాయి కదా, మరేమీ ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అని పార్వతీ దేవి శనితో అంది. శని ఒకవేళ అలా చూడకపోతే ఆమెకు కోపం వచ్చి శపిస్తే మళ్ళీ ఎక్కడ ఆ శాపాన్ని అనుభవించాలో అని భయపడి ఆ తల్లి ఒళ్ళొ ఉన్న శిశువు వంక చూశాడు. ఆ మరుక్షణం లోనే ఆ శిశువు తల తెగి గోలోకంలోని శ్రీకృష్ణుడిలో లీనమైంది. శని చెబుతున్న విషయాన్ని పట్టించుకోక పార్వతీ మాత అలా పుత్ర శోకానికి గురైంది. శోకిస్తున్న ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సును తెచ్చి మళ్ళీ గణపతికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఈ కథా సందర్భంలో శని అధో దృష్టికి సంబంధించిన ఆమె భార్య శాపం, అలాగే పార్వతీ సుతుడు గణపతికి గజాననం రావటానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి.
కొన్ని పురాణాలలో శివుడు గజ ముఖాన్ని తెచ్చి బాల గణపతికి అమర్చినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడ శ్రీహరి అలా చేసినట్లుంది. ఇది కల్ప భేదాన్ని అనుసరించి జరుగుతుండే విషయమని, ఒకే కథ ఒక్కో కల్పంలో కొద్దిపాటి తేడాతో మరోలాగా కూడా కనిపిస్తుండటం సహజమని పురాణజ్ఞులు వివరిస్తున్నారు.

Friday, 22 July 2016

సుబ్రహ్మణ్యుని లీలలు

సుబ్రహ్మణ్యుని లీలలు
===============
పార్వతీ దేవి కరుణామయి, అనుగ్రహరాశి, మరి తండ్రి శంకరుడో ఉబ్బులింగడు, ఆయనా అనుగ్రహ రాశి..... ఈ ఇద్దరి అనుగ్రహాల కలపోత మన బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి వారు.
ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖములుగా పురాణములు చెప్తున్నాయి. ఈ ఆరు దివ్యమైన క్షేత్రములను తమిళనాడు లో ఆరుపడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రతీ చోటా రాక్షస సంహారం చేసేముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు. ఈ ఆరు క్షేత్రములు వరుసగా
1. తిరుచెందూర్
2. తిరుప్పరంకుండ్రం
3. పళముదిర్చొళై
4. పళని
5. స్వామిమలై
6. తిరుత్తణి
అమ్మవారి అనుగ్రహము వలన, 2008 లో మేము తమిళనాడు యాత్రలకు వెళ్ళినప్పుడు పళని స్వామి దర్శనం అయ్యింది. అప్పుడు ఈ ఆరు క్షేత్రముల గురించి మాకు తెలిసింది. తరువాత పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు “శివ పురాణము” ప్రవచనములో ఈ ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రముల గురించి వివరముగా తెలియజేయడం వలన ఈ సంవత్సరం 2011 మాఘ మాసములో ఈ ఆరు క్షేత్రములను దర్శించే భాగ్యం మాకు కలిగింది. స్వామి వారి ఆరు ముఖముల దర్శన భాగ్యము ద్వారా పొందిన ఆనందాన్ని, సుబ్రహ్మణ్య కటాక్షమును అందరితోనూ పంచుకోవాలని, “ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు” అనే శీర్షికన ఈ క్షేత్రముల గురించి వ్రాద్దామని చేస్తున్న చిన్ని ప్రయత్నం.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ ఆరుపడై వీడు క్షేత్రముల యందు తనని సేవించిన వారిని విశేషముగా అనుగ్రహిస్తారు. ఈ ఆరు క్షేత్రములలో ఒకో రూపములో స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ ఎక్కువగా కొండమీదే ఉంటాయి. ఇప్పటికీ ఆది శంకరాచార్యుల సాంప్రదాయ పీఠాధిపతులు అయిన జగద్గురువులు వారు పీఠాన్ని అధిరోహించే ముందు తప్పని సరిగా ఒక సారి ఈ ఆరుపడై వీడు క్షేత్రములను పాదచారులై దర్శించి వస్తారు అని విన్నాను. సుబ్రహ్మణ్య అనుగ్రహము తోనే అటు శ్రీ విద్యా ఉపాసనలో అయినా, ఇటు జ్ఞానములో అయినా ఒక స్థాయిలోకి వెళ్ళడం సాధ్యం అని పెద్దలు చెప్తారు.
నాగదోషం ఉన్న వారు ఎవరైనా ఈ ఆరు క్షేత్రముల దర్శనం చేస్తే ఆ దోషం పోయి ఇష్ట కామ్యములు నెరవేరుతాయి. అంతేకాక, కుజ గ్రహమునకు అధిపతి సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టి ప్రార్ధిస్తే కుజదోషం తొలగి పోతుంది. ఇవ్వాళ దేశంలో అనేక ప్రమాదాలు జరగడానికి కారణం ఈ కుజ దోషం వల్లనే. కుజ దోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన వల్లనే సాధ్యం అని పెద్దలు చెప్తారు. అటువంటి సుబ్రహ్మణ్యుని దివ్య క్షేత్రముల మహిమ ఎంతటిదో మనం ఊహించవచ్చు.

వేదాలలో చెప్పిన మానవ శరీరంలోని పంచకోశాలు

జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు గతాన్ని పరిశీలించకుండా ఏ మనిషి ఉండలేడు. కొందరైతే ఎప్పుడూ గతాన్నే తలచుకుంటూ ఆనందము లేదా దుఃఖాన్ని అనుభ విస్తూ ఉంటారు. చరమ దశలో మాత్రమే గతాన్ని గురించి ఆలోచించేవారూ ఉంటారు. ఏది ఏమైనా గతాన్ని మరచి ఎవరూ ముందుకు సాగలేరు అనేదిముఖ్యం. దీనికంతటికీ కారణం మనసనే పదార్థం. మన ఉపనిషత్తులు శరీరాన్ని, మనసును కూడా పదార్థంగానే తెలియచేసాయి.
మానవ దేహం ఐదు కోశాల సమూసం. అవి స్థూల, ప్రాణ, మనోమయ, బుద్ధి, ఆనందమయ కోశాలు.
పిల్లలు, ఆటవికులలో స్థూల, ప్రాణమయ కోశాలు మాత్రమే పనిచేస్తాయి. నాగరికత కల్గిన వారిలో మానసిక కోశం పరిపూర్ణంగా పనిచేస్తుంది. అనుభవం పరిపక్వత సంతరించుకున్న వారిలో బుద్ధికోశం వికసిస్తూ ఉంటుంది. పైవాటినన్నింటినీ అనుభూతి పొందిన మహాత్ములలో మాత్రమే ఆనందకోశం పరిపూర్ణంగా పనిచేస్తుంది. ఈ కోవకు చెందినవారే యోగులు. వీరు ఆత్మానుసంధానం కోసం పరితపిస్తూ ఉంటారు.
ఈ పంచకోశాలు ఎప్పుడూ చైతన్యంలోనే ఉంటాయి. చైతన్యరహితమైనపుడు దేహం ఒక వ్యర్థ పదార్థం మాత్రమే! బుద్ధికోశం చైతన్యమై తన కార్యకలాపాలను ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది. అంటే భగవంతుని గురించి అనే్వషణ ప్రారంభమయినదని అర్థం.
మానసిక పరిపక్వత కల్గినపుడు, బుద్ధి వికసించినపుడు మాత్రమే ఆనందకోశంలో లయం చెందడం జరుగుతుంది. ఈ ఐదు కోశాలకు నేతగా ఉన్నదే ‘ఆత్మ’. ఇదే మహాచైతన్యం. ఇది మాత్రమే భగవదంశ కలిగి ఉన్నది. ఇది లేనిదే పై ఐదుకోశాలు నిరర్థకం.
మనసును ఒక పదార్థంగా చెప్పుకున్నాం. ఈ సత్యాన్ని ఉపనిషత్తులు నిరూపించాయి. ఉద్దాలకుడు తన కుమారుడైన శే్వత కేతువుకి మనస్సు ఆహారమనే పదార్థం చేత, ప్రాణం నీటి చేత, వాక్కు అగ్ని చేత ఏర్పడతాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు.
పదిహేను రోజులు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కావల్సినంత జలము మాత్రము త్రాగుతూ ఉండమన్నాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పదిహేను దినములు ఆహారం తీసుకొనలేదు. తరువాత తండ్రి వద్దకు వచ్చి శే్వతకేతువును వేదాలను వల్లించమన్నాడు. కాని తనకు ఏమి గుర్తుకురావడంలేదని తెలియజేశాడు.
తదుపరి తండ్రి ఆజ్ఞ మేరకు ఆహారం తీసుకుని తిరిగి తండ్రి వద్దకు వచ్చి వేదాలన్నీ తిరిగి వల్లించినాడు. అప్పుడు ఉద్దాలకుడు నీలో ఉన్న సూక్ష్మమైన అగ్నికణికకు ఆహారం అందించగా తిరిగి అది జ్వలించినదని ఇంతవరకు దాని ఉనికిని జలము కాపాడినదని తెలియజేశాడు. కాబట్టి మనస్సు ఆహారం నుండి, ప్రాణం నీటి నుండి, వాక్కు అగ్నినుండి ఏర్పడతాయని నిరూపించాడు.
పదార్థంకంటే ఆత్మ వేరు. ఆత్మ మనసనే పనిముట్టుతో బాహ్య ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకొంటుంది అని తెలియజేసాయి మన ఉపనిషత్తులు.
తైత్తిరీయోపనిషత్తు దేహం మనస్సు నుండి ప్రారంభించి తుదకు ఆత్మ రూపాన్ని గొప్పగా ఆవిష్కరించి భగవంతుని ఎలా దర్శించుకోవాలో తెలియజేసింది. భగవంతుడు ఆనందమయుడు. ఆయన నుండి ఆనందాన్ని పొందినందువల్లే మనిషి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
భగవంతుడు ఆనందమయుడైనప్పుడు ఆత్మ కూడా ఆనందమయే! ఎందువలనంటే ఆత్మయే భగవంతుడు కనుక. మనిషిలో ఉన్నవాడు, సూర్యునిలో ఉన్నవాడు ఒక్కరే అన్న సత్యాన్ని తెలుసుకున్నవాడు లౌకిక చైతన్యం నుండి విడివడి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ లేదా బుద్ధిమయ, ఆనందమయ కోశాల ద్వారా ఆత్మజ్ఞానం పొందినపుడు మాత్రమే భగవంతుని చేరుకోగలం. ప్రయత్నించడం మన అదృష్టం.

Thursday, 21 July 2016

దుర్గా మంగళమ్

ఈ దుర్గావాహన సింహధ్యానాన్ని క్రమం తప్పకుండా మననం చేస్తే సకలశుభాలు కలుగుతాయి. బాలగ్రహపూతనారాజభాయ శత్రుభయ రోగ భయములు దూరమవుతాయి. సంపదలు చేకూరుతాయి. మంచిసంతానం కలుగుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి.
దుర్గా మంగళమ్
దుర్గా భర్గమనోహరా సురవరైః సంసేవ్యమానా సదా
దైత్యానాం సువినాశినే చ మహతాం సక్షాతృలాదాయినీ
స్వప్నె దర్శనదాయినీ వరముదం సంధాయినీ శాంకరీ
పాపాగ్నీ శుభకారిణీ సుముదితా కుర్యాత్సదా మనగళమ్
జనన్యై జయదాయిన్యై హారిణ్యై సకలాపదామ్
తారిణ్యై సర్వధారిణ్యై దుర్గాయై యయమంగళమ్
ఓజసే బ్రహ్మనే సాక్షాత్ తేజసే దివ్యతేజసామ్
భ్రాజసే జ్యోతిషాం భాసాం దుర్గాయై జయమంగళమ్
భక్తానాం సుఖంసంధాత్ర్యై విధాత్ర్యై సుఖసంపదామ్
సంతాప పాప సంభెత్ర్యై దుర్గాయై జయమంగళమ్
ఈశానీ భువనేశ్వరీ చ విమలా ఈశత్వసంధాయినీ
గర్జన్మాహిష చండముండ దమనీ గంభీరముద్రాంచితా
రుద్రాణీ రుధిరారుణోగ్ర వదనా లోకైక రక్షాకరీ
శ్రీదుర్గా శుభదా మహార్తిదమనీ కుర్యాత్సదామంగళమ్
ఆగ్రహానుగ్రహాలు రెండూ అమ్మ సొత్తే. విద్యా అవిద్యలూ అమ్మ సృష్టే. సుఖదుఃఖాలు రెండూ అమ్మలీలలే. అమ్మకొంగు పట్టుకుంటే అఖిలజగత్తత్వమంతా చేతికి అందినట్లే! అందుకే జగదంబను కోలుచుకుందాం.

Tuesday, 19 July 2016

నిత్యజీవితంలో పాటించవలసిన నూరు నియమాలు


1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.
17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. 26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.
31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.
33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.
35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.
41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.
47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.
48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.
49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.
50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.
51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.
61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.
65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.
73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.
74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.
76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.
77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.
78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
91. దిగంబరంగా నిద్రపోరాదు.
92. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
93. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
94. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.
95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
96. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
97. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
98. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
99. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
100. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.

Monday, 18 July 2016

గురు పూర్ణిమ

గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ ||
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ ||
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ ||
.
.
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.
ఈ పర్వం యతులకు అతిముఖ్యమైనది. వారీనాడు మహా భారతం మొదలైన సంహితా గ్రంథాలకు రచయిత అయిన వ్యాసుని పూజిస్తారు. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారు..
.
పూజా విధానం.
.
.
.
కొత్త అంగవస్త్రం భూమి మీద పరుస్తారు. దాని మీద బియ్యం పోస్తారు. ఆ బియ్యం మీద నిమ్మ కాయలు ఉంచుతారు. ఇది శంకరులు, అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకొంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తలా ఒక పిడికెడు తీసుకుకెళ్లి తమ తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుకుంటారు. బియ్యం, కొత్తవస్త్రం లక్ష్మీ చిహ్నం. శుభసందర్భాల్లో బియ్యం యథాశక్తిని రాసి పోసి లక్ష్మిని ఆహ్వానించటం హిందూ సాంప్రదాయం. నిమ్మపళ్లు కానుకగా ఇచ్చుపళ్లు.అవి కార్యసిద్ధిని సూచిస్తాయి. బియ్యం, నిమ్మపళ్లు ఉంచడం లక్ష్మీ కటాక్షం కోసమే. దక్షిణాదిని కుంభకోణంలో, శృంగేరిలో శంకర పీఠాలు ఉన్నాయి. వ్యాస పూర్ణిమ అక్కడ ఎంతో వైభవంతో జరుపబడుతుంది. ఆ పర్వసందర్భంలో అక్కడికి వేల కొలది తైర్థికులు వస్తారు.
.
.. వ్యాసపూర్ణిమ గురుపూజా రోజుగా పాంచజన్యం పత్రిక ఇట్లా అంటూ ఉంది..
.
.
''ఇందులో వ్యాసపదం గురుపరము. ఇప్పుడు ప్రతి చోటా తమతమ గురువుల నారాధించుకొని తరింప వలయునని శాస్త్రాదేశం. స్వస్వరూపాను సంధానమున కన్న భిన్నమగు అన్యారాధనను తెలియని యతిశేఖరులచే ఈ నాగాచార్య పీఠార్చనల నాచరింపవలసినగా శాస్త్ర మాదేశించినది. గుర్వారాశనం విశేష ప్రయోజనకారియు, అనుల్లంఘ్యమనియు చెప్పుటకు రెండు ప్రబల ప్రమాణ ములు కలవు. యస్యదేవే పరాభక్తి: యధా దేవేయతాథా గురౌ' అని శ్వేతాశ్వతరోపనిషతు నందు పేర్కొన్నారు. ఇందు వేదమాత, ఈశ్వరారాధన తోటి తుల్య గౌరవం, సమాన ప్రాధాన్యతను ఇస్తుంది. గురుపూజకు, కాని స్మృతికర్తలింకొక మెట్టెక్కుడధిష్టింప చూశారు. గురువును ''దైవేఋష్టే గురుస్తాతా,
గురౌ ఋష్టేనకశ్చన'' యని దైవానుగ్రహమునకు గురువనుగ్రహం అనివార్యం. గనుక సాధనమపేక్షించి వ్యాస పూర్ణిమలో వ్యాస పదమాధికారిక పదపరముగాని వ్యక్తి పరం కాదనునదొకటి, ఆనాడొ నర్చు గురు పీఠార్చనలలో ఇప్పుడు దేశమందములు లోనున్న యతి కర్తృక పూజ మాత్రములు ఉప లక్షకములు మాత్రమే. ఆనాడు సర్వులు సర్వవిధములు తమ తమ గుర్వర్చనజేసి గురుభక్తిని వెల్లడించి పెంపొందింప జేశారు. ఎంతో మంది ఋషులు ఉండగా ఒక్కవ్యాసుని పేరున ఈ పూజ జరుప బడుటకు ఏమిటి కారణం! ఈ పూజలో ప్రత్యేక పూజలు అందే ఆదిశంకరులు వ్యాసభగవానుని అపరావతారమని చెబుతారు. కాగా ఇది వ్యాస పూజకు ఉద్దిష్టమైనది. వ్యాస పూజ అనగా ఆదిశంకరుల పూజ. సన్యాసులందరూ ఆది శంకరులు తమ గురువుని ఎంచుకుంటారు. నేడు సన్యాసులందరూ వ్యాసుని రూపంలో తమ గురువును కొలుస్తున్నారన్నమాట అందుచేత ఇది వ్యాస పూజారోజు. శంకరాచార్యుల వారి జయంతికి వేరే ఒక రోజు ఉద్దిష్టమై ఉన్నది. కాగా దీనిని గురుపూజా దినోత్సవగా భావింపవలసి ఉంది.
మహాషాఢ వ్యాస పూజ
ఈ రోజు అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాస మహర్షిని పూజించాలి.
శ్లో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యకృతౌ వందే భగవంతా పున:పున:
అని పూజించిన బ్రహ్మత్వసిద్ధి లభిస్తుందంటారు.
వైష్ణవ పురాణమును ఆషాఢ పూర్ణిమకు దానమిస్తే విష్ణు లోకం కలుగును. వ్యాస భగవానుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకు పోయినపుడు అవి ఒకదానితో ఒకటి కలిసి పోయాయి. కొంతకాలానికి శ్రీమహావిష్ణువే వ్యాసావతారం ఎత్తి ఆ వేదాలను విభజించి చక్క పరచాడు. చిక్కుపడిన వేదములను విభాగించిన విద్యావేత్తయేకాక అతడు శస్త్ర చికిత్సావేది కూడ. గాంధారి ఈసుపూని దిగజార్చుకొన్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి ఆపిండంలో నూట ఒక్క శిశువులు ఉండడం గుర్తించి ఆ విధంగా ఆ పిండాన్ని నేర్పుతో విభాగించి నేతి కుండలో నిక్షిప్త మొనర్చి పోషించేటట్లు చేసిన వైద్యవరుడు, వైద్యవిద్యానిధి, మేధానిధి, ఆత్మవిద్యానిధి అయిన వ్యాస భగవానుని పూజించడానికి ఉద్దిష్టమైన పర్వమిది. ఆషాఢ శుద్ధ పూర్ణిమ రుద్ర సావర్ణి మన్వంతరాది రోజు. రుద్ర పావర్ణి పన్నెండో మనువు. అతడు రుద్రపుత్రుడు ఈ మన్వంతరంలో ఋతధాముడు ఇంద్రుడు, తపస్వి, సుతపస్వి మున్నగువారు సప్తర్షులు.

గురు పూర్ణిమ ప్రాముఖ్యత


హిందువులు ఆధ్యాత్మిక గురువులకు అసమానమైన ప్రాముఖ్యత ఉంది. గురువులను తరచుగా దేవుని తో పోల్చుతూ మరియు ఎల్లప్పుడూ వ్యక్తిగత  వారధిగా భావిస్తారు. చంద్రుడు సూర్యుని యొక్క కాంతి పరావర్తనం ద్వారా మెరిసిపోయాడు,  అలాగే శిష్యులు తమ గురువుల నుండి శుభాశీసులు పొందడం ద్వారా చంద్రుడు వంటి సమ్మోహనం పొందవచ్చు.


గురు పూర్ణిమ అంటే ఏమిటి ?

  హిందూ మతం యొక్క ఆషాడం (జూలై -ఆగస్టు )మాసంలో పౌర్ణమి రోజున గురు పూర్ణిమ గా అభివర్ణించారు, ఈ రోజు గొప్ప యోగి మహర్షి వేద వ్యాసుడు జ్ఞాపకార్థం పవిత్రమైన దినంగా పాటిస్తున్నారు


హిందువులు నాలుగు వేదాలు, 18 పురాణాల్లో, మహాభారతం మరియు శ్రీమద్ భాగవతం రాసిన ఈ పురాతన ౠషిపుంగవునికి రుణపడి ఉన్నారు. గురువులు గురు భావించబడుతున్నా దత్తాత్రేయునికి కూడా  వ్యాసుడు బోధించాడు.

గురు పూర్ణిమ ప్రాముఖ్యత

ఈ రోజు, ఆధ్యాత్మిక భక్తులకు తన దివ్య వ్యక్తిత్వా గౌరవార్ధం వ్యాసుని పూజించి.ఙ్ననం సముపార్జిస్తూన్నరు

ఈ రోజు మీ ఆధ్యాత్మిక పాఠాలు ప్రారంభించడానికి ఒక మంచి సమయం. సాంప్రదాయకంగా, ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించేవారు ఈ రోజు నుండి వారి ఆధ్యాత్మిక 'సాధన' తీవ్రతరం ప్రారంభం.

పిరియడ్ 'Chaturmas' ( "నాలుగు నెలల") ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. గతంలో, ఆధ్యాత్మిక వేత్తల తిరుగుతూ మరియు వారి శిష్యులు వ్యాస భగవానుడు స్వరపరచిన బ్రహ్మ సూత్రాల పైన అధ్యయనం చేసి వేదాంతిక్ చర్చల్లో తాము సన్నిహితంగా ఉపయోగిస్తారు.

Sunday, 17 July 2016

సర్వరోగాలకు ఒకటే మందు “సూర్య నమస్కారాలు”

పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస, వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి . హార్మోనుల అసమతుల్యాన్ని సవరించడం వీటి వల్ల వచ్చే అదనపు ప్రయోజనం.
పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు అవడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. అంతే కాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగాను తయారవుతుంది. దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతాయి.
సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనస్సు స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరగడం, ఆలోచనలో స్పష్టత, భావ వ్యక్తీకరణలు , ప్రజ్ఞ కలుగుతాయి. వీటి వలన శరీరం ఒకే విధమైన విశ్రాంతిని పొందుతుంది. ఆత్మకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. సమతుల్యం, సహనం, నిర్దిష్ట మార్గానుసరణ, అనుభూతి పొందుతూ సంతోషం, అర్థవంతమైన జీవనం, ఆలోచనాత్మకమైన మనో విశ్లేషణ, హృదయ వివేకాన్ని సాధకుడు పొందుతాడు. ద్వాదశ సంఖ్యాత్మకమైన సూర్య నమస్కారాలు గోప్యమైనవి. వీటిని సక్రమంగా ఆచరిస్తే, ఇవి ప్రణామ ప్రవాహంగా అవిచ్చిన్నంగా సాగుతాయి. వీటిలో మొండెం, మెడ ముందుకు , వెనుకకు , పైకి, కిందకు ప్రధానంగా కదులుతాయి. ఈ కదలికలు ఏడు ప్రధాన చక్రాలను చైతన్యవంతం చేస్తాయి.
ఈ ప్రక్రియలో గుర్తుంచుకోవలసిన అంశాలు రెండు .
వేసే ప్రతి ఆసనంలోను శరీరంలోని వివిధ భాగాల కదలికలు గమనించడం మొదటిది .
శ్వాస యుక్తలయను కదలికలతో అనుసంధానించడం రెండవది. శరీరాన్ని వెనుకకు వంచేటప్పుడు లోనికి శ్వాసించడం, ముందుకు వంగేటప్పుడు శ్వాసను వదలడం.
ముఖ్య సూత్రం .
ప్రాణాయామం, సూర్యనమస్కారం, విశ్రాంతి ఆసనమైన శవాసనం అనే మూడు ఆదిత్య ప్రణామాల్లో అంతర్లీనంగా ఉంటాయి.
జాగ్రత్తలు
ఋతు సమయాలలోను, వెన్నెముక కింది భాగంలో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వీటిని ఆచరించకూడదు. గుండె , రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలున్న వారు, జ్వరం, అల్సర్ లు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయకూడదు.
సూచనలు
ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే జీవనశైలికి అలవాటుపడిన వారు, చెడు రక్తం, జీర్ణ సమస్యలు వంటి రుగ్మతలున్నవారు ' పవనముక్తాసన శ్రేణి' భంగిమలను మెల్లగా ప్రాక్టీస్ చేసి ఆ తరవాత సూర్య నమస్కారాలకు ఉపక్రమించాలి . పవనముక్తాసనం వలన శరీర భాగాలలోని మజిల్స్ సాగి, సూర్య నమస్కారాలలోని కదలికలకు అనువుగా సర్దుకుంటాయి.
అలా కాని పక్షంలో కీళ్ళ నొప్పులు , జ్వరం, పాదాలవాపు , చర్మం పగలడం వంటి సమస్యలు వస్తాయి.
సూర్యనమస్కారాలను సాయంత్రం వేళల్లో చేయకూడదు .
సూర్యుని వైపు తిరిగి, వేకువఝామునే సూర్య నమస్కారాలు చేయడాన్ని అభ్యసించాలి.
ఆసనాలు:
1. ప్రణామాసనం
నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి.
' ఓం మిత్రాయ నమః ' అందరికీ మిత్రుడనైన నీకు అంజలి ఘటిస్తున్నాము అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని పఠించాలి .
ప్రయోజనాలు :
ఈ ఆసనం చేస్తూ మనస్సును నిశ్చలంగా ఉంచడం వల్ల, మనస్సును హృదయం పై కేంద్రీకరించి ఉండటం వల్ల మనస్సు సూర్యాభివందనం చేయడానికి అనువుగా మారుతుంది.
2.హస్త ఉత్థానాసనం
శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపుకు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి. ' ఓం రవయే నమః' ప్రకాశవంతుడైన ప్రకాశదాతవైన నీకివే వందనాలు దేవా! అనే అర్థాన్నిచ్చే ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి.
ప్రయోజనాలు :
వెన్నెముకకు శక్తి ఇవ్వడం , దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేయడం వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. ఛాతీని విరిచినట్లుగా వెడల్పుగా చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది. అంతేకాక థైమస్, థైరాయిడ్ వంటి గ్రంథులపై బాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం, మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది.
3. పాదహస్తాసనం
శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. ' ఓం సూర్యాయ నమః ' సకల ప్రాణుల పుట్టుకకు కారణమైన పరమాత్మ అనే భావాన్నిచ్చే ఈ మంత్రాన్ని జపించాలి.
జాగ్రత్తలు:
మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు . అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది .
ప్రయోజనాలు:
ఈ ఆసనం వల్ల ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది . మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది , కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం సహకరిస్తుంది.
4.అశ్వ సంచలనాసనం
లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేలమీదకు వంచాలి. కుడి మోకాలుని కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి ఇంటి కప్పులపైకి చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్థ చంద్రాకృతిని కలిగి ఉంటుంది. ' ఓం భానవే నమః ' అజ్ఞానాన్ని తొలగించే గురువుకు వందనం ' అనే అర్థాన్నిచ్చే మంత్రం పఠించాలి.
జాగ్రత్తలు :
ప్రారంభ దశలో ఎక్కువమంది సాధకులు మోకాలిని వెనుకకు వంచడాన్ని మరిచిపోతారు. శరీరమంతా సక్రమమైన భంగిమలో ఉన్నదా లేదా అన అంశాన్ని గమనించాలి. చాలామంది పైకి చూడటం మరిచిపోతారు . తప్పనిసరిగా తలను పైకెత్తి చూడాలి. థైరాయిడ్ గ్రంథి చర్య క్రమబద్ధం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్రను కలిగి ఉంది.
ప్రయోజనాలు :
శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, ఎడ్రినల్, మరియు యురోజెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను అధిగమించడం, సంతాన సాఫల్యం , శ్వాసక్రియ మెరుగుపడటం - ఈ ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనాలు. .
5.సంతులనాసనం
నాలుగవ స్థితి నుండి గాలి నెమ్మదిగా వదులుతూ కాలివేళ్లు నేలను తాకుతూ, ఎడమకాలిని వెనుకకు కదిలించాలి. ఇప్పుడు మోకాళ్ళు రెండు నేలకు దూరంగా ఉంచాలి. శరీరం మధ్య భాగం పైకి ఎత్తినట్లు బోర్లించిన v ఆకారంలో ఉంచాలి. శరీరం మొత్తం కాలివేళ్ల పైన అరచేతులపైన ఆధారపడి నిలవాలి. దృష్టిని మాత్రం ఎదురుగా నేలపై ఉన్న ఏదైనా వస్తువుపైన కేంద్రీకరించి ఉంచాలి. ' ఓం ఖగయే నమః' ' అనాయాసంగా సాగిపోయే దైవానికి వందనాలు' అనే అర్థం వచ్చే ఈ మంత్రం జపించాలి.
జాగ్రత్తలు : అనాయాసంగా సాగిపోయే దైవానికి దైవానికి వందనాలు" అనే అర్థం వచ్చే ఈ మంత్రం జపించాలి.
ఎక్కువమంది ఈ ఆసనం వేసేటప్పుడు శరీరాన్ని చెక్కలా వంగకుండా ఉంచడం మరుస్తారు . కటి భాగాన్ని పైకి ఎత్తి ఉంచుతారు. అలా చేయకూడదు. దీనివల్ల శరీరం బరువు తగ్గదు. శరీరాన్ని వంచకుండా స్టిఫ్ గా ఉంచడం మరవకూడదు.
ప్రయోజనాలు:
ఈ ఆసనం వేస్తే మణికట్టుకు బలం వస్తుంది. మానసిక, శారీరక పుష్టి కలుగుతుంది. ఇది నడుముకు పటుత్వాన్ని ఇస్తుంది. వెన్నెముకకు (క్రింది భాగానికి) బలాన్ని అందిస్తుంది. అందువల్ల అనేక రుగ్మతలు తొలగుతాయి.
6.అష్టాంగ నమస్కారం:
అర చేతులను, కాలి వేళ్ళను కదిలించకుండా నేలపై ఉంచాలి. మొండాన్ని నేలపైకి నెమ్మదిగా వంచాలి. మొదటిగా మోకాళ్ళను నేలకు ఆనించాలి. తరువాత ఛాతీని, గడ్డాన్ని నేలకు తాకించాలి. ఈ భంగిమలో శరీరం అల ఆకారంలో కనిపిస్తుంది.
' ఓం పూష్ణే నమః' ' సర్వులకు పోషకుడైన నీకు వందనం' అనే భావంతో మంత్రాన్ని జపించాలి.
జాగ్రత్తలు:
కడుపు, కండరాలు వేలాడకుండా ఈ భంగిమ నిరోధిస్తుంది. మధుమేహం, మలబద్ధకం, జీర్ణ సమస్యల పరిష్కారంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎడ్రినల్ గ్రంథులకు విశ్రాంతినిస్తుంది. హార్మోనులను సక్రమంగా పని చేయిస్తుంది.
7.భుజంగాసనం:
అష్టాంగ నమస్కారం వలె ఉదరం నేలకు తాకేలా ఉంచాలి. శ్వాస లోనికి పీలుస్తూ నేలపై నుండి గడ్డాన్ని, తలను పైకెత్తి చూస్తూ ఉండాలి. నడుము వెనుక ఒంపు వచ్చేలా మెడను పైకెత్తి చూస్తూ ఉండాలి., మోచేతులను శరీరానికి దగ్గరగా ఉంచాలి.
' ఓం హిరణ్యగర్భాయ నమః ' విశ్వ ప్రతినిధియైన నీకు నమస్కారం' అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని మననం చెయ్యాలి.
జాగ్రత్తలు :
ఈ భంగిమ చివరిలో మోచేతులను చాచకూడదు. ఉదరాన్ని నేలకు అణచి ఉంచాలి.. అలా చేయడం వల్ల ఉదర గ్రంథులు చురుకుగా పనిచేస్తాయి.
ప్రయోజనాలు:
ఒత్తిడి, స్థూలకాయం, వెన్నెముక సమస్యలు, థైరాయిడ్ సమతుల్యం, యురోజెనిటల్ సమస్యలు - ముఖ్యంగా ఋతుక్రమ సంబంధమైన, ఋతువాగి పోవడం వలన వచ్చే సమస్యలకు ఈ భంగిమ అమోఘంగా పని చేస్తుంది . తొడలు , పిరుదులు, శరీరం వెనుకభాగాన్ని ఈ ఆసనం తీర్చిదిద్దుతుంది .
8.పర్వతాసనం :
పద్మాసనం లో కూర్చునే విధంగా కూర్చుని రెండు చేతులను ఒక చోట చేర్చి చిత్రంలో చూపిన విధంగా చేతులను సాగదీస్తూ పైకి ఎత్తాలి.
ప్రయోజనాలు :
వెన్నెముకకు ఇది మంచి వ్యాయామం , ఫలితంగా వెన్నునొప్పులకి ఇది ఔషధంలా పని చేస్తుంది.
జాగ్రత్తలు : కీళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ వ్యాయయం చేయకూడదు .
9.అశ్వసంచాలనాసనం :
పై ఆసనాల నుండి నెమ్మదిగా కటిద్వయాన్ని కిందికి దించి కుడికాలిని కొంచెం ముందుకు తెచ్చి రెండు చేతులను నేలకు అదిమి ఉంచాలి. ఎడమ మోకాలును నెమ్మదిగా వెనక్కి చాచాలి. నెమ్మదిగా లోనికి శ్వాసిస్తూ పైకి చూస్తుంటే అర్థ చంద్రాకారం కలిగి గుఱ్ఱం ఆకారం వలె ఉంటుంది.
' ఓం ఆదిత్యాయ నమః' 'విశ్వ సుతుడైన నీకు ప్రణామం' అనే మంత్రం స్మరణీయం.
ప్రయోజనాలు: ఈ ఆసనం వలన ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది. మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది. కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది.
10.పాద హస్తాసనం
అశ్వభంగిమ నుండి శ్వాసను విడుస్తూ ఎడమ పాదాన్ని ముందుకు చాచాలి. అప్పుడు రెండు పాదాలు ఒకే భంగిమలో ఉంటాయి. అదే సమయంలో శరీర భాగాన్ని పైకెత్తి ముందుకు నుంచునే విధంగా వంగాలి. చిత్రంలో చూసి అభ్యసించాలి. పై వివరాలే దీనికీ వర్తిస్తాయి.
' ఓం పవిత్రే నమః ' ' చైతన్యం కలిగించే వానికి ప్రణామం' అన్న భావాన్నిచ్చే మంత్రం అనుకోవాలి.
ప్రయోజనాలు :
శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, టైమర్ ఎడ్రినల్, మరియు యూరో జెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను సంతాన సాఫల్యాన్ని, శ్వాసక్రియ మెరుగుపరచడం , ఈ ప్రక్రియ వల్ల కలిగే ఉపయోగాలు.
11.హస్త ఉత్థానాసనం
పై భంగిమ నుండి రెండు చేతులను తల పైకి ఎత్తి ఉంచాలి. అలా చేసేటప్పుడు గాఢంగా గాలిని పీల్చాలి. నడుం వెనుకభాగం వద్ద కొద్దిగా వంగాలి. ' ఓం ఆర్కాయ నమః ' ' శక్తిప్రదాతకు నమస్సులు ' అనే భావాన్నిచ్చే మంత్రాన్ని జపించాలి.
ప్రయోజనాలు :
వెన్నెముకకు శక్తి ఇవ్వడం, దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేసే ఆలోచనల వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది.
ఛాతీని తెరచి ఉంచుకోవాలి, శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది . టైమస్, థైరాయిడ్, వంటి గ్రంథుల పై బాగాపని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం , మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది.
12.ప్రణామాసనం
శ్వాసను వదులుతూ రెండు అర చేతులను నమస్కార భంగిమలో ఉండేలా దగ్గరకు చేర్చి చాతీ వద్ద ఉంచాలి. దీనితో సూర్య నమస్కారాసనాలు పూర్తి అయినట్లే.
' ఓం భాస్కరాయ నమః ' ' గురువుకు అభివాదం' అనే భావంలో జపం చెయ్యాలి.

అనంత విశ్వంలో పధ్నాలుగు లోకాలు

హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్‌పురుషుని (విశ్వరూపుని) శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం రెంవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం పదునాలుగు లోకాలనీ, వాటిలో ఊర్ధ్వలోకాలు (పైనున్నవి) ఏడు, అధోలోకాలు (క్రిందనున్నవి) ఏడు అనీ చెబుతారు.
లోకాల విభజన గురించి భాగవతంలో ఇలా చెప్పబడింది.--- బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి. తత్వ పదార్ధాల సూక్ష్మ, సూక్ష్మతర అవస్థలనుబట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి. క్రింది లోకాలకంటే పై లోకాలలో తత్వ పదార్ధాలు సూక్ష్మతరంగా ఉంటాయి. లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు.
లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే--
మొదటి భావన ప్రకారం కటి(మొల)నుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.
రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.
మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి.
బ్రహ్మాండపురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు, పోషిస్తాడు, తనలో లయం చేసుకొంటాడు
ఊర్ధ్వలోకాలు
1) భూలోకం
2) భువర్లోకం
3)సువర్లోకం
4)మహర్లోకం
5)జనలోకం
6)తపోలోకం
7)సత్యలోకం
అధోలోకాలు
1) అతలం=మయుడి కుమారుడైన బలుడి వినోద స్థానం.
2)వితలం=హాఠకేశ్వరుడు భవానీ అమ్మవారితో వినోదిస్తుంటాడు.హాఠకి నదీ జలాలతో తయారైన సువర్ణంతో అసుర స్త్రీలు అలంకరించుకొంటుంటారు.
3)సుతలం=బలి చక్రవర్తి స్వర్గంలో ఉండే ఇంద్రుడు అనుభవించే భోగాలకన్నా ఎక్కువ భోగాలను అనుభవిస్తూ వైభవంగా పాలిస్తుంటాడు.
4)రసాతలం= మయుడు రాక్షసులుండే పట్టణాలను నిర్మిస్తుంటాడు. దానవ దైత్యులు, నివాతకవచులు, కాలకీయులు ఉంటారు. వీరంతా మహా సాహసవంతులు.
5)మహాతలం=కద్రువకు జన్మించిన సర్పాలుంటాయి. కుహుడు, తక్షకుడు, కాళేయుడు, సుషేణుడులాంటి గొప్ప గొప్ప సర్పాలన్నీ గరుత్మంతుని భయంతో బయటకు రారు.
6)తలాతలం=రుద్రుడి రక్షణలో ఉంటుంది.
7)పాతాళం=నాగజాతి వారుంటారు. వాసుకి, శంఖుడు, కులికుడు,
ధనుంజయుడులాంటి మహా నాగులన్నీ గొప్ప గొప్ప మణులతో ప్రకాశిస్తుంటాయి. ఆ పాతాళం అడుగునే ఆదిశేషుడుండేది. ముఫ్పై వేల యోజనాల కైవారంలో చుట్టచుట్టుకుని ఉంటాడు. ఆదిశేషుడి పడగ మీద ఈ భూమండలం అంతా ఒక ఆవగింజంత పరిమాణంలో ఉంటుంది. ప్రళయకాలంలో ఆ ఆదిశేషుడే ఏకాదశ రుద్రులను సృష్టించి సృష్టి అంతా లయమయ్యేలాగా చేస్తుంటాడు.
ఈ ఏడు అథోలోకాలు ఒక్కోక్కటి పదివేల యోజనాల వెడల్పు అంతే లోతు కలిగి ఉంటాయి. వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు. ఈ లోకాల్లో కూడా కామ, భోగ, ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్టే ఇక్కడి వారికి లభిస్తుంటాయి. ఈ లోకాలన్నిటినీ మయుడు నిర్మించాడు.అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకవాసుల పని. ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడి వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు. అయితే సర్పాల మణులు దేదీప్యంగా కాంతులీనుతూ ఈ లోకాలలో వెలుగును ప్రసరింప చేస్తుంటాయి. ఇక్కడి వారంతా వ్యాధులకూ, వార్ధక్యానికీ, మానసిక బాధలకూ దూరంగా ఉంటారు.
లోకాల తత్వం : ప్రాణిలోకం ఎల్లప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది. అయితే వారికి లభించే సుఖం తత్వం లోకాన్నిబట్టి మారుతుంది. భూర్భువస్వర్లోకాలలో లభించే సుఖం నిత్యమైనది కాదు. నాల్గవదైన మహర్లోకం క్రమముక్తికి స్థానం కాని కల్పాంత సమయాలలో అక్కడా తాపం తప్పదు. మహర్లోకం పైన జనలోకం ఉన్నది. ఆ లోక ప్రవేశం మొదలుకొని శాశ్వత సుఖం ఆరంభమవుతున్నది. అది అమృతరూపం. జనలోకంపైన ఉన్న తపోలోకంలోని సుఖం శాస్వతమైనదే కాక క్షేమరూపంలో ఉంటున్నది. తపోలోకం పైన ఉండే సత్యలోకంలో సుఖం శాశ్వతము. మోక్షప్రదము కూడాను.

ఆహార నియమాలు

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.
ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.
అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.
రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.
రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.
రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి) వాడకూడదు. ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.
ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు. దృష్టిదోషం పోవడానికి ఇది చదవాలి.
ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి . ( అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది )
ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి ( ఘన పదార్ధాలను త్రాగండి అంటారు . అంటే నోటిలోనే సగం నమలబడాలి . అందువలన లాలాజలం పూర్తిగా కలిసి , ముద్దా మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం ( క్షారం ) విరుగుడు గా పనిచేస్తుంది .
ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు ?
పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి
అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .
రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే మాత్రం అత్యుత్తమ మైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .
అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||

అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.

సూర్యుడు కర్కాటక సంక్రమణం - దక్షిణాయన పుణ్యకాలం

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు.... అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శనిగ్రహం 2 1/2 సం పడు తుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు... ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొన (మేషాది మీనరా శులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది.
సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని
సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని
సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని
సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని
ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి ‘జరగటం’, ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు.
సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అ ని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది. సాధారణంగా జూలై 16వ తేదీనే!
ఈ కర్కాటక సంక్రమణాన్ని ‘దక్షణాయన’ మని అంటుంటారు. (మనకి సంవత్సరానికి అయన ములు రెండు. ఒకటి ఉత్తరాయనం, రెండవది దక్షిణాయనం) ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం, తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలా న్ని సంక్రమణంగా చెప్తాం. (మకర సంక్రమణం (సం క్రాంతి)... మకరరాశి ప్రవేశం! కుంభరాశి ప్రవేశం (మహాశివరాత్రి)) అయితే సూర్యుని మకర సంక్రమణ మే ‘ఉత్తరాయన పుణ్యకాలం’.
ఏ తిథులతోను సంబంధం లేకుండాను, ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ-దక్షిణాయన మనేవి. జనవరి 14న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ, జూలై 16న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.
సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. ఈ రెండు ఆయనాల్లోనూ దక్షిణాయనాన్ని అపవిత్రంగాను, ఉత్తరాయణాన్ని పవిత్రంగాను భావిస్తారు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.
దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీపూర్ణిమ, ఆదిపరాశక్తి మహిమలను చాటే దసరా, నరక బాధలు తొలగించిన దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు, గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.
దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని, లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.
సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు. ఈరోజు పుణ్యనదీ స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. మనందరము కూడా దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావి తరాలకు మన సంస్కృతిని తెలియజేద్దాం.

శనిదేవుని అనుగ్రహనికి సుందర కాండ లో ని 48 వ సర్గ ను పఠించాలి


శ్రీ మద్రామాయణం లోని సుందర కాండ లో ని 48 వ సర్గ ను శని వారం ఉదయం ,సాయంకాలం పఠిస్తే శని దేవుని అనుగ్రహం పొందగలరు .శని దేవుని పీడా బాధితులు శని వారం నాడు సుందర కాండ లోని ఈ నలభై ఎనిమిదవ సర్గ ను భక్తీ తో పఠిస్తే శని దేవుని అనుగ్రహం పొందుతారు.
శని వారం ఆంజనేయ స్వామి ని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి .’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’అంటే ప్రతి శని వారం భరతుడు హనుమను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని అర్ధం .
‘’ మంద వారేషు సం ప్రాప్తే హనూమంతం ప్రపూజ ఎత్
సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే
తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా ‘’
శని వారం రాగానే హనుమను పూజించాలి .ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది .అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.
తైలం తో కూడిన గంధసిన్దూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు .అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది .వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగుతుంది .శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి ,యశో వంతు లైన పుత్రులు కలుగు తారు .

శ్రీకృష్ణుడు చెప్పిన తొలి ఏకాదశి నాడు పాటించవలసిన నియమాలు

శ్రీకృష్ణ భగవానుడు ఒకానొకరోజు భీమునికి తొలి ఏకాదశి అనగానేమి, ఆరోజు పాటించవలసిన నియమాలు గురించి బోధించెను.

తొలి ఏకాదశి:  ఆషాడ మాస ఏకాదశిని  తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజుని ఇంకా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. తొలి ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు. తొలి ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసము ఉంటారు.  ఈ రోజు చాతుర్మాస్య వ్రతం మరియు గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని తొలి ఏకాదశి రోజు నుంచి క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.
ఉపవాసము; తొలి ఏకాదశ నాడు ఉపవాసము చేయుట వలన చాల మంచిదని, చేసిన వారికి కోరుకున్న కోరికలు నేరవేరునని అంటారు. అయితే ఉపవాసం అంటే కేవలం తినడం మానేయటం కాదు. ఆ రోజు మంచి పనులు అనగా పేదవారికి దాన, ధర్మములు చేయుట మరియు ఆ మహా విష్ణువును పూజించుట చేయవలెను.
ఉపవాసములో రకములు; శక్తి కొద్ది భక్తి అన్నారు పెద్దలు. అలాగే మన శక్తిని బట్టి మనం ఆ భగవంతుని పూజ గాని అందులో బాగామైన ఉపవాసం గాని చెయ్యవచ్చు. మన శక్తిని బట్టి ఈ క్రిందనివ్వబడిన నాలుగు విదానాలలో ఎలైగైన చెయ్యవచ్చు.
1.రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉండి మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
2.నీళ్ళు, పాలు తీసుకుని.. మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
3.నీళ్ళు, పాలుతో పాటు పండ్లను కూడా తీసుకుని, మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
4.అల్పాహారం స్వీకరించి, మరుసటిరోజు సూర్యోదయమునకు ముందే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవలెను.
ఈ వ్రతము వలన కలిగే ప్రయోజనాలు; అరవై వేల సంవత్సరాలు తపస్సు, , అశ్వమేధ యాగం, భూమి దానం చేసినంత పుణ్యం వస్తుంది. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. అంతేకాకుండా ఉపవాసము చేయడం వలన మనిషికి ఇంద్రియ నిగ్రహం కలిగి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను  జయించడం వలన దేనినైనా సాదించగలడు.
ఈ విధంగా శ్రీకృష్ణుడు ఈరోజుకు ఉన్న మహిమ గురించి మరియు చేయాల్సిన విధివిధానాల గురించి భీముడికి చెప్పినారు.

Saturday, 16 July 2016

Exclusive offer from Ganeshaguides.com -Free horoscope reading


  Namaste, We invite you to visit our website http://www.ganeshaguides.com/ where you will find valuable information about your horoscopes and astrology. Ganeshaguides is the official website we launched recently to help more people who suffer with various problems in their life. We stick to provide excellent service to our customers.

OFFER VALID TILL JULY 31st 2016 


We want you to know our predictions and get benefit from them. As we launched newly, we are providing the exclusive offer for the people to get the readings for FREE instead of genuine price. Yes, you read it correct.It's absolutely free. But we do have lot of work involve in reading the complete astrology. So, we are making it free reading only for 2 questions.You can ask questions related to your career,marriage,financial status,children etc.To know the predictions of your 2 very valuable questions in your life, Send your details to our mail id in the below format. 
---------------------------------------------------------------------------------------------------
Format:
       Name - S*********
       Date of Birth - 15-Jan-1985
       Time  - 8.25 AM
       Place of Birth - Mumbai

       My Questions
       1)When will I get job? 
       2)Which career suits me? 
-----------------------------------------------------------------------------------------------------
Remember,We will reply to your mail only for 2 questions. Incase if we find more than 2 questions,that mail will get REJECTED. Also,If you want to know about the love success/love marriage you should sent your partner's details also.
    or you can check your horoscope details  here

   HURRY UP -OFFER VALID TILL JULY 31st 2016

 All you need to do is Just send your details to the mail ganeshAAguides@gmail.com. Also we request you to  forward this message to your well wishers and also about our site- http://www.ganeshaguides.com/.
             
Note: As we created manually without any help from anyone, our site may have many problems.Kindly suggest/inform the problems you are facing with the website.We will try to rectify and make it more user friendly.