ఈ పంచభూతాల విన్యాసమే మీ జీవితం . అవేగనక సహకరించకపోతే మీరెంత ప్రయత్నం చేసినా, మీ జీవితంలో చెప్పుకో దగ్గ విశేషాలేవీ జరగవు . వీటి సహకారంతోనే అతి సాధారణమైనవాటి నుంచి అత్యుత్తమమైన అంశాల వరకూ , ప్రతీదీ కూడా ఒక అవకాశంగా మారుతుంది.మీ శరీరం ఒక ద్వారం లాటింది. ఒక ద్వారానికి రెండు అంశాలు ఉంటాయి: మీకు ఎప్పుడూ మూసి ఉన్న తలుపులు ఎదురైతే, అదే ద్వారం మీకో అడ్డుగోడలా అనిపిస్తుంది; అలాకాక ద్వారాలు మీకెప్పుడూ తెరుచుకుంటూ ఉంటే మీకదో అవకాశంలా ఉంటుంది. ద్వారం అదే, కానీ మీరు దానికి ఎటువైపు ఉన్నారనేది మీ జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తుంది.
‘ఒకే ఒక్క నిమిషం’ అని బాత్రూమ్ లోనుండి మీరు కేకవేస్తారు కానీ అదే క్షణం బైట ఎదురుచూస్తూన్న వాళ్ళకో యుగంలా అనిపిస్తుంది! లోపలున్న మీకు ‘ఆ…. ఒక్క క్షణమే కదా’ అని అనిపిస్తుంది, కానీ అవతల వాళ్ళకదో యుగం ! బాత్ రూమ్ తలుపుకెటువైపు ఉన్నారు అనే దాని పై ఒక్క నిమిషం లిప్తపాటుగా అనిపించవచ్చు లేదా ఓ యుగంలా అనిపించవచ్చు ! మీ జీవితానుభవం అద్భుతంగా ఉంటుందా , లేక ఈ జీవితమే ఓ అడ్డుగోడలా ఉందా అన్న విషయాన్ని మీ పంచభూతాల సహకణే నిర్ణయిస్తుంది
ఒకసారి, ఒక బిషప్ న్యూయార్క్ కి వచ్చి సెంట్రల్ పార్క్ లో మీటింగ్ పెట్టారు, కాతొలిక్స్ అందరూ అక్కడికి రావలసి ఉంది. ఈ నగరంలో కేవలం కొద్దిమందే కాతోలిక్స్ ఉన్నారు అని అప్పుడే వారికి తెలిసింది. వారంతా వచ్చారు – నమ్మకాలను పునరుద్ఘాటించి, మత ప్రచారాన్ని చేసి తమ సంఖ్యను ఎలా పెంచాలో బిషప్ మాట్లాడుతున్నారు. అప్పుడే కొత్తగా మతం పుచ్చుకున్న కాతోలిక్ ఒకరు ఇలా అడిగారు ‘ప్రియమైన ఫాదర్, జీసస్ తానే న్యూయార్క్ నగరంలో పునర్జన్మించి మళ్ళీ ఈ మతాన్ని పునరుద్ఘాటించొచ్చు కదా?’
ఈ బిషప్ ఒక క్షణం ఆలోచించి, ‘ నాయనా ,జీసస్ మళ్ళీ పుట్టాలంటే కొన్ని నిర్దిష్ట పరిస్థితులు కావాలి,. మొట్ట మొదటిగా ముగ్గురు వివేకవంతులైన వ్యక్తులు కావలి, అది ఈ న్యూయార్క్ నగరంలో అసంభవము. పైగా ఓ కన్య కూడా కావాలి , అమెనెక్కడ వెతుకుతారు ?’
ఏదైనా జరగాలంటే అందుక్కావలసిన అంశాలు, తగిన వాతావరణం ఏంతో అవసరం . భూత శుద్ధి అనేది మీ వ్యవస్థలోని పంచభూతాలను శుద్ధ పరిచి అవి సహకరించేలా చేసే ఒక మార్గం.
జీవితపు అవకాశాలూ , బంధనాలు ఈ రెండూ కూడా పంచభూతాల ద్వారానే జరుగుతాయి . విముక్తి లేక బంధనం అనేవి ఒకే కత్తికున్న రెండు అంచుల్లాంటివి. దాన్నోవైపు తిప్పితే అది స్వతంత్రం, మరో వైపు తిప్పితే పాశం!.
జీవిత ప్రక్రియంతా ఇంతే. ప్రేమాద్వేశాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయుంటాయి ; జీవన్మరాణాలెప్పుడూ ఒకదానిలో ఒకటి కలిసుంటాయి. అవి విడివిడిగా ఉంటే మనం తేలికగా నిర్వహించగలిగే వాళ్ళము, కానీ అవి ఎప్పుడూ ఒకదానిలో ఒకటి కలిసి ఉన్నాయి. మీరు మరణాన్ని తప్పించుకోవాలి అనుకుంటే మీరు ఈ జీవితాన్నే చేజార్చుకుంటారు. మీలో మీరు, ‘నేను మరణించ కూడదు ‘ అనే ఒక భావనను సృష్టించుకుంటే మీరు కనీసం మీ మంచం దిగి ఒక్క అడుగు కూడా వేయలేకపోయేవారు. ఎంత బాగా ప్రయత్నించినా మీరు తప్పించు కోగలిగేది జీవితాన్నే కానీ మరణాన్ని మాత్రం కాదు. ఇదే జీవిత విధానం – ఒకదానిలో ఇంకొకటి ఉంటుంది. అక్కడేముందో ఇక్కడ అదే ఉంది, ఇక్కడ ఏముందో అక్కడా అదే ఉంది. అన్నిటినీ మించి, మీరు నిశితంగా చూస్తే, అన్నీ మీలోనే ఉన్నాయి. అది ఎంతో సంక్లిష్టమైనదానిలాగా కనిపిస్తుందికానీ అదే చాలా సులువైనది కూడా .
ప్రాచీన భారతదేశంలో సమ్మోహన కళలో నిష్ణాతులైన కొంత మంది వేశ్యలు ఉండే వారు. వారు చాలా ఎక్కువ నగలు ధరించేవారు,ఆపాదమస్తకం ఆభారణాలే !. ఒక్కొకటిగా తీయాలంటే దానికి చాలా సమయం పడుతుంది. ఇవి తీసివేయటానికి మరో మార్గమే లేదు. కామవాంఛతో మరిగిపోతున్న పురుషుడు ఈ స్త్రీని వివస్త్రను చేయాలి అనుకుంటాడు, కానీ అతను తీయలేకపోతాడు. ఆమె ఇంకొంచం మత్తుపానీయాలతో కవ్వించి ప్రోత్సహిస్తుంది – కొంచం,ఇంకొంచం, మరికొంచంగా. అతడికి మైకమొచ్చి చూపు ఇంకా తక్కువయ్యే కొద్దీ అతని పని ఇంకా కష్టతరమవుతుంది, ఆ తరువాత గురక పెడుతూ అతను నిద్రలోకి జారుకుంటాడు. అక్కడ ఒక పిన్ను ఉంటుంది, దాన్ని లాగితే మొత్తం అన్నీ ఒక్కసారిగా పడిపోతాయి. కానీ ఆ కిటుకు ఆమెకు మాత్రమే తెలుసు.
జీవితం ఇటువంటిదే. పైకి సంక్లిష్టమే కానీ ఒక సులువైన పిన్ను ఉంటుంది. దాన్ని లాగితే అన్నీ ఒక్కసారిగా పడిపోతాయి. ఆ పిన్ను మీరే. మిమల్ని మీరు బయటకు లాగటం ఎలానో తెలుసుకుంటే అకాస్మాత్తుగా అన్నీ కుదుటబడతాయి. ఆ పిన్ను లాగితే అన్నీ కుప్ప కూలిపోయి మీరు విముక్తులవుతారు!
మీ ఆరోగ్యాన్ని ,మీ శరీరపు ప్రాధమిక నిర్మాణాన్ని మార్చుకోవాలంటే మీరు పంచభూతాలను భక్తి, గౌరవాలతో చూడండి. ఒక్క సారి ఇలా చేసి చూడండి మీరు పూర్తి జాగరూకతతో ఉన్నప్పుడు , ఈ పంచభూతాల్లో ఏ ఓక్క దాన్నైనా స్పృశించినప్పుడు , అదే శివుడనో , రాముడనో , క్రిష్ణుడనో, ఎసుక్రీస్తనో , మార్క్స్ లేదా అల్లాగానో భావించండి , మీ జీవితంలో అత్యుత్తమమైనదేదో , దాన్ని స్ఫురించండి . ఇప్పుడొచ్చిన సమస్యేమిటంటే మీరు ప్రస్తుతమొక మానసిక జీవి, మీ మనస్సు నిండా ఒక అధికార క్రమం ఉంది. ఈ ప్రక్రియ ఇటువంటి అధికార క్రమాలను కుదుట పరుస్తుంది . కొంతకాలమిలా చేసిన తరువాత ఇదివరకు తలచుకున్న ఆ మాట మాయమైపోతుంది . కానీ మీ జీవితంలో మీరు జాగరూకతతో ఉన్న క్షణాలు పెరిగిన కొద్దీ మీరు ఈ మార్పు తక్షణమే చూస్తారు.
దక్షిణ భారతదేశంలో పంచ భూతాల కోసమై అయిదు లింగాలు ఉన్నాయి. ప్రతీ ధాతువుకి, దాని నుండి విముక్తులవడానికి మీరు చేయగలిగే ఒక ప్రత్యేకమైన సాధన ఉంది. దీని కోసమే పంచ భూత స్థలాలను సృష్టించారు. మీరు వెళ్లి సాధన చేసుకోవడానికి మహోన్నత దేవాలయాలు నిర్మించారు. భౌగోళికంగా అవన్నీ డెక్కన్ ప్రాంతంలోనే – నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి. నీటికి సంబంధించిన దేవాలయం తిరువనైకావల్‌లో, అగ్నికి సంబంధించిన దేవాలయం తిరువన్నామలైలో, వాయువుకి సంబంధించిన దేవాలయం కాళహస్తిలో, భూమికి సంబంధించిన దేవాలయం కాంచిపురంలో, ఆకాశానికి సంబంధించిన దేవాలయం చిదంబరంలో ఉన్నాయి.
మనం అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే ఈ అయిదు లింగాలు సాధన కోసం సృష్టించబడినవి, ప్రార్ధన కోసం కాదు. జనాలు ఒక దేవాలయం నుంచి మరొక దేవాలయానికి ఈ పంచ భూతాల సాధన కోసం వెళ్ళేవారు. దురదృష్టవశాత్తూ, ఈ సంబంధం ఈనాడు లేదు. ఎందుకంటే ఈ సాధనకు కావలిసిన వాతావరణం తొలిగించేయబడింది. దీనికి కావలిసిన అవగాహనా, నైపుణ్యం సాధారణంగా కనుమరుగై పోయాయి, కానీ దేవాలయాలు ఇంకా ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఆ గుణాన్నీ, శక్తినీ నిలబెట్టుకున్నాయి, మిగతా ఆలయాలు బలహీనమైపోయాయి.
No comments:
Post a Comment