Showing posts with label Dharma sukshmaalu. Show all posts
Showing posts with label Dharma sukshmaalu. Show all posts

Monday, 6 July 2015

పుష్కర స్నానం చేసే ముందు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవల్సిన విషయం

పుష్కర స్నానం చేసే ముందు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవల్సిన విషయం...
పరమ శివుని యొక్క మూడవ కంటి మంట నుంచి ఒక కృచ్చ పుట్టింది. ఆ కృచ్చ నాకు ఆకలి వేస్తోంది ఏమి తినమంటావు అని శివుని అడిగింది. అడిగితే ఆయన అన్నారు.. పుష్కరాల్లో స్నానం చేసి పాపాలను పోగొట్టు కోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు నదుల దగ్గరకి వస్తారు. వాళ్ళు స్నానం చేసి బయటకి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్య రాశి వస్తుంది. కాని పుష్కర స్నానం చేసేప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి నదిలోకి విసిరి ఒక మంత్రం
"పిప్పలాదాత్ సముత్పన్న
కృత్యే లోకభయంకరీ
మృత్తికాంతే వయాదత్తా
మహారార్ధం ప్రకల్పయా "

అని మంత్రం చెప్పకుండా, మట్టి విసరకుండా ఎవరు నీటి నుండి స్నానం చేసి బయటకు వచ్చారు వాళ్ళ యొక్క పుణ్యాన్ని నువ్వు తినేయి అని ఆనతి ఇచ్చారు. అందుకని పుష్కర స్నానం చేసిన వారి పుణ్యాన్ని కృచ్చి తినేస్తుంది. అందుకని కష్టపడి పుష్కర స్నానం కోసం వెళ్ళేది మన పాపరాశి దగ్ధం చేసుకోవటానికి కాబట్టి...
"పిప్పలాదాత్ సముత్పన్న
కృత్యే లోకభయంకరీ
మృత్తికాంతే వయాదత్తా
మహారార్ధం ప్రకల్పయా"
(పుష్కర స్నానం చేసేముందు గుప్పెడు మట్టి తీసుకుని నదిలో వేసి ఈ మంత్రం చెప్పిన తరువాత ఆ నదీమ తల్లి ఒడిలో పుణ్యస్నానమాచరించాలి).

Sunday, 5 July 2015

భగవంతుని అనుగ్రహమే అసలు సాధనం


మనిషి పతనానికి ఎన్నో విషయాలు ఉంటాయి, అందుకే మనిషి ఒక స్థాయిని చేరడానికి ఒక సాధన కావాలి, ఆసాధన దైవంతో సంబంధం ఏర్పర్చగలగాలి అప్పుడు దివ్యుడు కాలగడు. దైవానుగ్రహం అనేది సూర్యుడైతే మనం చేసే సాధన ఒక చిన్న మిణుగురు పురుగంత లెక్కకు రాదు. అందుకు విశ్వామిత్రుడు తను సాధించినదానికి దైవ అనుగ్రహం మూలం అని భావించాడు. ఇది గుర్తించి శ్రీరామచంద్రుడిని తన వెంటతెచ్చి తను సాధించిన బల అతిబల విధ్యలని రామచంద్రునికి అర్పించాడు. ఆరు రాత్రుల యాగం చేసాడు. ఆతర్వాత విశ్వామిత్రుడు సీతమ్మతో రామచంద్రుడిని చేర్చి తను సిద్దిని పొందాడు. ఇదే కథ బాలకాండలో ఉంటుంది.
ఈ 'ఆరు రాత్రుల యాగం' అని చెప్పడంలో ఒక రహస్యం ఉంది. మనిషిలో కలిగే అంతర్-వ్యాదులు ఒక ఆరు అని చెబుతారు. మొదటి వ్యాధి దేహాసక్తాత్మబుద్ధి, అంటే దేహమే నేను అనుకొనే అజ్ఞానం. రెండోది స్వాతంత్ర్య అందత, నేను నా అంతట బ్రతక గలను, ఎవరిపై ఆధారపడి లేను అనే అజ్ఞానం. మూడోది ఇతర శేషత్వ బుద్ధి, మనం వల్ల కాదు మనం బ్రతికేది అని జ్ఞానం కల్గి, అది మన చుట్టూ ఉండేవారి వల్ల అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యాధి. నాలుగోది ఆత్మత్రాణ ఉన్ముఖత, నన్ను నేనే ఉద్దరించుకోగలను, నాకు కావల్సినదేమో నేనే నిర్ణయించుకోగలను అనే జబ్బు. అయిదోది ఆభాస బంధు ప్రీతి, మన చుట్టూ ఉన్నవారే సర్వస్వం అని అనిపించేది, వారితోనే నిరంతరం ఉంటాను అనే బ్రాంతి. ఆరోది విషయ లౌల్యము, ఏది కనిపించినా నాకే అనిపిస్తుంది. రకరాకాల వస్తువులు ఉంటాయి, వాటిని నేనే పూర్తిగా అనుభవించాలి అనే భావన, ఇది అన్నింటికన్నా ప్రమాధకరమైన వ్యాధి. ఈ ఆరింటి వల్లనే ఎన్నో ఉప వ్యాధులు పుట్టుకొస్తాయి. అన్నింటికీ మూలం ఈ ఆరు వ్యాధులు అని చెబుతారు. అవన్నీ రాముడు తప్ప తొలగించేవాడు మరొకడు లేడు అని రాముడిని తెచ్చుకున్నాడు.
ఆ వ్యాధులకు కారణం గడిచిన కర్మలు, ఇప్పుడు అనుభవించే కర్మలు, ఇప్పుడు తయారు చేసుకొని కొంతకాలం అయ్యాక అనుభవించే కర్మలు. గడచిన కర్మలను సంచితములు అని అంటారు. ఇప్పుడు అనుభవించే వాటిని ప్రారబ్దం అని అంటారు. ఇప్పుడు ఆచరించే వాటి వల్ల కొంతకాలం అయ్యాక వచ్చేవి ఆగామి అని అంటారు.

భగవంతుడిని ఆశ్రయిస్తే మన ప్రాచీన కర్మలని తుడిచి వేస్తాడు, ఇప్పుడు ఉండే కర్మలని అంటకుండా చేస్తాడు, రాబోయే కర్మలను దూరం చేస్తాడు. అట్లాంటివే గడిచిన కర్మలే సుభాహు అంటే, రాబోయే కర్మలే మారీచ, ఇప్పుడు మనం అనుభవించే కర్మలే మిగతా రాక్షసులు. జీవితమనే యాగాన్ని రక్షించగలిగేవాడు రాముడు. అట్లా రామచంద్రుడు మానవాస్త్రం వేసి మారీచుడిని తరిమివేసాడు. సుభాహు పైఅ అగ్ని అస్త్రం వేసి చంపివేసాడు. మిగతా వారిపై వాయువ్యాస్త్రం వేడి చెల్లా చెదురు చేసాడు. మనిషిగా మనం చేసే సాధనకు భగవంతుని అనుగ్రహం ఎంత అవసరమో విశ్వామిత్రుని కథ తెలుసుకుంటే అర్థం అవుతుంది.

శివ నామ మహిమ


శివుని ఉపాసి౦చు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరి౦పబడును. సదాశివ, శివ అ౦టూ శివనామమును జపి౦చు వానిని చెదలు నిప్పును వలె, పాపములు స్పృశి౦చజాలవు. ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియ౦దు అత్య౦త శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉ౦డునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ స౦గమములో స్నానము చేసిన ఫలము లభి౦చును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమున౦దు రుద్రాక్ష ధరి౦పబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజి౦చవలెను. శివనామము గ౦గ వ౦టిది. విభూతి యమున వ౦టిది. రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వ౦టిది.

ఈమూడు ఎవని శరీరమున౦దు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ స౦గమ స్నానము వలన లభి౦చు పుణ్యమును మరియొకవైపు ఉ౦చి విద్వా౦సులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను. రె౦డి౦టి ఫలము సమానముగను౦డెను. కావున విద్వా౦సులు అన్నివేళలా ధరి౦చవలెను. ఆనాటి ను౦డియూ బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు మూడి౦టినీ ధరి౦చుచు౦డిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును.

శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము. స౦సరమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశమును పొ౦దును. శివనామమున౦దు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభి౦చును. అనేక జన్మములు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టే శివనామమున౦దు భక్తి కుదురును. ఎవనికి శివనామము న౦దు అతిశయి౦చిన నిర౦తర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు, ఇతరులము దుర్లభమనియు శివపురాణమున౦దు చెప్పబడినది.

ఆచమన విధానము

ప్రతి కార్యమున౦దు ఒక్కొక్క ఆచమనవిధానము చెప్పబడినది. ఆచమనము ద్వారా కేవలము మనలను మనమే శుధ్ధి చేసుకొనుటయేగాక బ్రహ్మను౦డి మొదలుకొని సమస్తమును పరితృప్తి చేయుచున్నాము ఆచమనము చేయకు౦డా చేసెడు కర్మలన్నియుని వ్యర్ధములైపోవును. కావున శౌచాన౦తరము కూడా శాస్త్రమున౦దు ఆచమనక్రియ నిర్దేశి౦పబడినది. శుభ్రమైన మడి వస్త్రమును మూడు, ఐదు గోచులుగా ధరి౦చి, శిఖ ముడివేసుకొని వుపవీతియై ఉ౦గరపు వ్రేలునకు దేవపవిత్రమును ధరి౦చి, ఆసనముపై సావధాన చిత్తముతో కూర్చొని, పాదములను నేలమీద ఉ౦చి ఆచమనము చేయవలయును. ఉత్తరము, ఈశాన్యము, తూర్పు నకు ముఖము చేసి మాత్రమే ఆచమనము చేయవలెను.

ఆచమనము చేయు నీరు బుడగలు, నురుగు లేనిదిగ స్వచ్చముగ ను౦డవలెను. ఆచమి౦చునపుడు నోటిను౦డి ఎటువ౦టి శబ్దము రాకూడదు.

ఆచమనము చేయు జలము బ్రాహ్మణునకు హృదయము వరకు, క్షత్రియులకు క౦ఠమువరకు, వైశ్యులకు తాలువు(దౌడ)వరకు, శూద్రులకు మరియు స్త్రీలకు నాలుక వరకు చేరునట్లుగా తీసుకొనవలెను.

గోకర్ణాకృతిగా పట్టిన హస్తములో మినుపగి౦జ మునుగున౦తటి జలమును మాత్రమే తీసికొని అరచేతితో ఆచమనము చేయవలెను. గోకర్ణాకృతి మూడు విధములుగా చెప్పబడినది.

౧. బొటనవ్రేలి మధ్య వ్రేలి మూలమునకు వ౦చిపెట్టి, చూపుడువ్రేలును దానిమీదకి వ౦చిపెట్టి, తక్కిన వ్రేళ్ళను చక్కగా చాచిపెట్టినచో హస్తము గోకర్ణాకృతికి(గోకర్ణము-ఆవు చెవి ఆకారమునకు) వచ్చును లేదా

౨. చూపుడు వ్రేలును వ౦చి బొటన వ్రేలి మూలమునకు చేర్చిపెట్టి, బొటనవ్రేలి మధ్యవ్రేలి మధ్య గణుపునకు చేర్చి తక్కిన వ్రేళ్ళను చక్కగా చాచినచో హస్తము గోకర్ణాకృతిగా ఏర్పడును. లేదా

౩. అరచేతిని అర్ధచ౦ద్రాకారముగా మడచి ఆవుచెవి వలె చేయవలెను, కనిష్ఠిక(చిటికెనవ్రేలు)ను మరియు అ౦గుష్ఠమును దూరముగ - వేరుగా చేసి తక్కిన మూడు వ్రేళ్ళను దగ్గరగా చేర్చి పట్టినచో హస్తము గోకర్ణాకృతిగా ఏర్పడును.

ఆచమనము చేయునప్పుడు ఎడమచేతి చూపుడువ్రేలుతో కుడిచేతిలోగల జలమును స్పృశి౦చుటవలన సోమపానము యొక్క ఫలము లభి౦చును.

తుమ్మినప్పుడు, ఉమ్మినతర్వాత, నిద్రి౦చిలేచిన పిమ్మట, వస్త్రములను ధరి౦చిన మీదట, ఆవిలి౦త వచ్చిన పిదప, అశృవులు - కనులను౦డి నీరు జారిన తదుపరి ఆచమనము చేయవలెను లేదా కుడిచెవిని స్పృశి౦చుట చేత ఆచమనవిధి పూర్తియగును.

మోకాళ్ళకు పైగా జలమున౦దు నిలబడి కూడా ఆచమి౦చవచ్చును. నీరు మోకాటిలోతుక౦టే తక్కువగా ఉ౦డినచో ఈమాట చెల్లనేరదు. అప్పుడు కూర్చు౦డియే ఆచమనము చేయవలెను.

హరి హర మూర్తి

పరమశివుని లీలామూర్తులలో పదమూడవమూర్తి హరిహరమూర్తి. అనగా ఆయన శరీరంలో సగభాగమును శ్రీమహా విష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకుని శరీరంలో సగభాగమును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు." నీవు ఏటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవల్సినది" అని పార్వతి దేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే, శ్రీ మన్నారయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టొత్తర శతనామస్తోత్రం. ఈ శివాష్టోత్తర నామ స్తోత్రమును ఆధారము చేస్కొని పార్వతి దేవి శంకరుని శరీరంలో అర్ధభాగమును పొందింది. అది పదునాల్గవ స్వరూపము. దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనుష్యజన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోషవేళలో ఇహమునందు సమస్తమయిన కోరికలను తీరుస్తుంది. పరలోక సుఖమును, భగవంతుని అనుగ్రహమును మనయందు ప్రసరింపచేస్తుంది.

హనుమన్నమస్కారః


గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ |
రామాయణమహామాలారత్నం వందేzనిలాత్మజమ్ || ౧ ||

అంజనానందనంవీరం జానకీశోకనాశనమ్ |
కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్ || ౨ ||

మహావ్యాకరణాంభోధిమంథమానసమందరమ్ |
కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే || ౩ ||

ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః |
ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయమ్ || ౪ ||

మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి || ౫ ||

ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహమ్ |
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనమ్ || ౬ ||

యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
బాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిర్నమత రాక్షసాంతకమ్ || ౭ ||

ఆదిత్య హృదయం సోత్రం ... తాత్పర్యం

ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను.
ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక!
ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును.
ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది.
పూర్తిగా ఉదయించి ప్రకాశాకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించ బడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము.
సూర్య భగవానుడు సర్వ దేవతల యందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపే వాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాల చక్రాన్ని ముందుకు నడిపే వాడు.
ఆ సూర్య భగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు.
ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు.
సూర్య భగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించే వాడు, ఆకాశము, వివిధ లోకముల యానము చేసేవాడు, స్థితికారకుడు, బంగారు కాంతితో ప్రకాశించే వాడు, దినకరుడు.
సూర్య భగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యపకుడైన వాడు. ఆయన సప్తేంద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించే వాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు.
సూర్య భగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు, దినమునకు కారకుడు, బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అదితి పుత్రుడు, శంఖమును ధరించిన వాడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించే వాడు .

సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించే వాడు, సకల వేద పారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మ నాడిలో క్రీడిస్తున్నాడు.
సూర్య భగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించే వాడు. లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్త వర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు.
సూర్య భగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గిన వారికి కూడా తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము.
తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి). తారా గణములకు, దినమునకు అధిపతి అయిన సూర్య భగవానునికి నమస్కారములు.
జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు.
ఉగ్రుడు, వీరుడు, అమిత వేగముగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసే వాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు.
బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దాహించేవాడు, తీక్షణమైన రుద్ర రూపము కల ఆదిత్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించే వాడు, భయమును తొలగించే వాడు, శత్రు నాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మ స్వరూపుడు. క్రుతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు.
కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్ని రూపుడు, సర్వ జ్ఞాన ప్రకాశకుడు, విశ్వ కర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు.
సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసి, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు సుషుప్తావస్థలో (నిద్రా సమయములో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే యైన వాడు.
సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు.

ఫల శృతి:

రాఘవా! ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టములు కలిగిన సమయములో, దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును.
రాఘవా! దేవ దేవుడు, జగత్పతి యైన సూర్య భగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును.
ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళెను.
ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.
రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు ధరించెను.
రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను.
అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనముతో, రామా! ముందుకు సాగుము! అని పలికెను.

పాపకార్యం అంటే ఏమిటి?

 ఏ క్రియ అయితే కేవలం స్వార్ధం/అసూయల కారణంగా చేస్తామో, దానిని శాస్త్రం పాపంగా పరిగణిస్తుంది. ఒక్క స్వార్ధం వల్లనే, ఒక వ్యక్తికి కలిగే కోరికలను నెరవేర్చుకోవడానికి, సకల విధములైన అధర్మ మార్గములలో పయనించడం మొదలు పెడతాడు. ఇలా చేయడంలో భయము, విరోధము, బాధ మొదలైన దుర్గుణములతో మనసు కలుషితమైపోతుంది.


స్వార్ధం ప్రాతిపదికగా కాకుండా, వేదము చెప్పిన కార్యములను, విధివిధానములను మనం ఆచరించడం మొదలు పెడితే, అత్యాశ, అనారోగ్యకరమైన పోటీ తత్త్వము, స్వార్ధం, అసూయ తగ్గిపోతాయి.
వేదవిహిత కర్మాచరణ ఎవరికి నిర్దేశింపబడినవి వారు, చేస్తూ ఉంటే, అది మొత్తం సమాజానికి క్షేమాన్ని చేకూరుస్తుంది. అంతే కాక, అటువంటి వేదవిహిత కర్మాచరణ వ్యక్తుల యొక్క పాపములను కూడా పరిహరించి, పునీతులను చేస్తుంది. ఇలా పుణ్యకార్యములు చేస్తూ ఉండడం వల్ల, పాపవిముక్తులమై, మన మనసు పవిత్రమవుతుంది.

గణేష దుర్గాస్తోత్రం


ప్రాచ్యాం రక్షతు హేరంబశ్చాగ్నేయాం అగ్నితేజసః
యామ్యాం లంబోదరో రక్ష్యేత్ నైఋత్యాం పార్వతీసుతః
ప్రతీచ్యాం వక్రతుండస్తు వాయవ్యాం వరదః ప్రభుః
ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యాం ఈశనందనః
ఏవం దశదిశో రక్ష్యేత్ హ్యవరం విఘ్న నాయకః
హేరంబస్య దుర్గమిదం త్రికాలం యః పఠేన్నరః
కోటి జన్మ కృతం పాపం ఏకావర్తేన నశ్యతి

"తూర్పున హేరంబుడు, ఆగ్నేయములో అగ్ని సమాన తేజస్వి, దక్షిణాన లంబోదరుడు, నైఋతిలో పార్వతీసుతుడు, పడమర వక్రతుండుడు, వాయువ్యంలో వరదుడైన ప్రభువు, ఉత్తరాన గణపుడు, ఈశాన్యంలో ఈశానందనుడు, ఇలా పది దిక్కులా విఘ్ననాయకుడైన శ్రీమహాగణపతి నన్ను రక్షించుగాక. "

హేరంబుని స్మరించే ఈ రక్షాస్తోత్రాన్ని 3సార్లు పఠించేవారికి పాపసంహరణమే కాక, సంకటాలు తొలుగుతాయి. వెంటనే సమస్యా పరిష్కారం అవుతుంది. ఇది శ్రీ శివకృష్ణ సంవాదంలో ప్రబోధించిన స్తుతిగా పురాణాలు చెబుతున్నాయి.

ద్వాదశాదిత్యులు - వృద్ధాదిత్యుడు

పూర్వకాలమందు కాశీపురమున హరీతముని నామముతో నొక వృద్ధ బ్రాహ్మణుడుండెను. ఇతడు సూర్యభగవానుని భక్తుడు. సూర్యుని నిత్యము ఆరాధించుచూ, పూజించుటయే ఇతని జీవనము. ఇతనికొకసారి తాను యువకునిగా మారవలెనను కోరిక కలిగెను. ఈ కోరికతో విశాలక్షీ దేవి మందిరమునకు దక్షిణభాగములో శుభలక్షణములు గల సూర్యదేవుని మూర్తిని నిర్మించుకొని శ్రద్ధాభక్తులతో ఆరాధించుచుండెను.
ప్రసన్నుడైన భాస్కరుడు ప్రత్యక్షమై హారీతమునితో ’మునీ! నీ తపమునకు నేను సంతసించితిని. నీకిష్టమగు వరమును కోరుకొను”మనెను.
ముని “భగవాన్! మీరు నాపై ప్రసన్నులైన నాకు పునః యౌవనమును ప్రసాదించుడు. దానితో నేను ఉత్తమమైన తపస్సు చేయుదును. ఎందులకనగా తపస్సే శ్రేష్ఠమైన ధనము, ధర్మము, కామము మరియు మోక్షము. జితేంద్రియులైన పురుషులు తపస్సు చేయుటకొరకే చిరాయువును కోరెదరు. మోక్షము కొరకే ఉత్తమ జ్ఞానమును కోరెదరు. అందుచేత శ్రేష్ఠమైన తపోసిద్ధికి నేను మిమ్ములను పునః యౌవనమును ప్రసాదించవలసినదిగా యాచించుచుంటిని’ అని ప్రార్థించెను. సూర్యభగవానుడు ’ఏమమస్తు” అనుచు వృద్ధ హరీతముని వృద్ధాప్యమును తొలగించి పుణ్యసాధనకై పునఃయౌవనమును ప్రసాదించెను.
పునఃయౌవనమును పొందిన ముని ఎన్నోదినములు కఠోరమైన తపస్సు చేసెను. తపో తేజస్సునకు వీని రోమములు ప్రజ్వలితమగుచు చివరకు సూర్యభగవానుని దివ్యలోకమునకు వెళ్ళి అక్షయ సుఖములు పొందెను.
వృద్ధునిచే పూజింపబడిన కారణమున కాశీయందు సూర్యుడు వృద్ధాదిత్య నామముతో ప్రసిద్ధిగాంచెను.
హారీతమునిచే స్థాపింపబడిన వృద్ధాదిత్యుని ఉపాసించిన ఎంతోమంది సిద్ధిని పొందిరి.వీనిని ఆరాధించిన వారికి ముసలితనము, దుర్గతి రోగములు నశించును.
వృద్ధాదిత్యం సమారాధ్య వారాణస్యాం ధరోర్భవ!
జరాదుర్గతి రోగఘ్నం బహవః సిద్ధి మాగతాః!!
కాశీయందు ఆదివారమునాడు వృద్ధాదిత్యునకు నమస్కారము చేయువారికి మనోవాంఛిత సిద్ధులు ప్రాప్తించును. వారికెన్నడూ దుర్గతి గలుగదు. కాశీయందు విశాలాక్షి మందిరమునకు దక్షిణమున వృద్ధాదిత్యుడుండెను. వర్తమాన కాలమున మీరా ఘాట్ చెంత హనుమానుని మందిర సమీపమున ఈ మూర్తియుండెను. వీనిని ఉపాసించిన దీర్ఘాయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, మిత్రులు వివిధ రకములుగ ఉన్నతి స్వర్గము మొదలగునవన్నియు ప్రాప్తించును.

పుట్టినిల్లు- మెట్టినిల్లు కులదైవములు

పుట్టినిల్లు మెట్టినిల్లు అని రెండు కులదైవములను కొలుచుకోవడం స్త్రీలకు మట్టుకే చెల్లును. మనము కులదైవములను కొలుచుకోకపోతే మనం చేసే పనులలో చిక్కులు ఉద్యోగ వ్యాపారరీత్యా మందము, ఎదురుచూడని నష్టం, ఇలా ఎన్నో కష్టనష్టములకు గురికావలసి వచ్చును. కులదైవ దోషం ఉండేటప్పుడు మనం వేరే ఏ దైవమును కొలుచుకున్నా సరైన ఫలితములు లభించదు. అందువల్ల ఏడాదికి ఒక మాటైన మీ కులదైవ కోవెలకు వెళ్లి పూజాదులు చేసుకోండి.
మనలను కాపాడే దైవములు
ఇంటి దైవము. మనతో కూడా వుండి చనిపోయిన మన పూర్వీకులు. కన్యగానో సుమంగళిగానో చనిపోయిన వారు, మన ఇష్ట దైవము. దీనినే ఇంటి దేవత కుటుంబ దేవత కన్యా దైవం సుమంగళి ప్రార్థన అని కొలుచుకుంటాము.
కులదైవము : ఒక వంశములో పరంపరాను సారముగా జీవించే వారికి కులము అని పేరు. వీరు అనేకముగా పురుష సంతానము దాయాదులు జ్ఞాతులు మట్టుకే ఇలాంటి కులానికే ప్రత్యేకమైన దైవము కోవెల ఉండును. ఈ కులదైవములను కొలుచుకొన్న కోటి పర్యాయములు ఫలితము లబించును. గురువును మరచిన కులదైవమును మరవవద్దు అనేది మన పెద్దల వాక్కు. ఇంటిలో ఏ ప్రయోజనము అంటే వివాహము, ఉపనయనము , సీమంతము లాంటి ఈ శుభ కార్యములు చేసినా పత్రికలో కులదైవం పేరు వేయడం పరిపాటి.
జాతి దైవము : పైన చెప్పిన కులాల సమూహమే ఒక జాతి. ఈ జాతులకు వుండే దైవమె అని పరిగణింప బడును. వీటిలో అనేకముగా స్త్రీ దైవములే ఎక్కువగా ఉండును. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామీ సాయి బాబా లాంటివి .
గ్రామ దేవతలు: కుల జాతి సమూహమును కాపాడేది గ్రామ దేవత: వూరి ప్రజలందరూ జాతి మత భేదము లేకుండా కొలుచుకొనే దేవత. అనేకముకా గ్రామ దేవతలు కాళి మహమ్మారి లేక వీరభద్రుడు మునీశ్వరుడు లాంటివి వుంటుంది.
ఒక కులము అవిచ్ఛిన్నముగా వృద్ధి కావాలంటే కుల దైవ పూజ చాలా అవసరము. కులదైవ దోషము వుంటే మిగతా దైవముల అనుగ్రహము లభిచందు. కులదైవ అనుగ్రహం వల్ల పుత్రపౌత్ర అభివృద్ధి జరుగును. కుటుంబం సుఖ సంతోషములతో ఓలలాడును. అందరు కలిసి కులదైవ పూజలు (అన్న తమ్ములు ) చేసుకుంటే కులదైవమే కాకుండా మన పితరులు కూడా చాల సంతసించి ఆశీర్వదిస్తారు
కులదైవ పూజ వల్ల ఇంటిలో పెండ్లి కాని వారికి వివాహ బంధము ఏర్పడడం, సంతానము లేని వారికి పుత్రులు కలగడం,, సఖ్యత లేకుండా పోట్లాడుకునే దంపతుల మధ్య అన్యోన్య భావము ఏర్పడడం, జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లడం నేటికి మనకు లభించే నిదర్శనము.
ఏ వంశములోను పదమూడు తరాలకు అనంతరం ఒకే దైవం వుండదు. దానికి నిదర్శనం మన గృహములో ఒకటి పిల్లలు లేకుండా పోవడం, వున్నా కేవలం స్త్రీ సంతానం మట్టుకే వుండడం దీనిని మనం నేరుగా చూస్తున్నాము కదా! ఏ కులదైవమని ఒక వంశములో ౧౩ తరాలకు మించదు అంటే అంతతో ఆగి పోవును వృద్ది లేకుండా. ఇది నేటి విజ్ఞానము కూడా ఒప్పుకుంటుంది.

సర్వకార్య సిద్ధికి జయ మ౦త్ర౦

జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః!!

దాసో౭హ౦ కోసలే౦ద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శతృసైన్యానా౦ నిహన్తా మారుతాత్మజః!!

న రావణ సహస్ర౦ మే యుద్ధే ప్రతిబల౦ భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః!!

అర్ధయిత్వా పురీ౦ ల౦కామ్ అభివాద్య చ మైథిలీమ్
సమృద్ధార్థో గమిష్యామి మిషతా౦ సర్వరక్షసామ్!!

మహాబల స౦పన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కి౦ధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువు అయిన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నాపేరు హనుమ౦తుడు. శత్రుసైన్యములను రూపుమాపు వాడను. వేయి మ౦ది రావుణులైనను యుద్ధర౦గమున నన్నెదిరి౦చి నిలువజాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, ల౦కాపురిని నాశనమొనర్చెదను. రాక్షసుల౦దరును ఏమియూచేయలేక చూచుచు౦దురుగాక. నేను వచ్చిన పనిని ముగి౦చుకొని సీతాదేవికి నమస్కరి౦చి వెళ్ళెదను.

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా |
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 ||
సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 ||
నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 ||
పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా || 4 ||
దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || 5 ||
కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా || 6 ||
కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || 7 ||
సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || 8 ||
భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || 9 ||
జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || 10 ||
కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || 11 ||
ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || 12 ||
స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || 13 ||
నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || 14 ||
సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ . ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఈ కారణంగానే ఆ పిల్లవాడికి " పిప్పలాదుడు" అనే పేరు వస్తుంది.

ఆ పిల్లవాడి పరిస్థితి బాధకలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు.ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి ఆయన సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు.

పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని ఆయన అడుగుతాడు. శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు.

ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెబుతారు. ఆయన శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు. అందువలన శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||

ఎవరిని ధ్యానించాలి?

- ఆచార్య మసన చెన్నప్ప
కర్మ చేయడంలో మనం స్వతంత్రులం. కాని, కర్మఫలాన్ని అనుభవించడంలో అస్వతంత్రులం. దీన్నిబట్టి కర్మఫలాలు ఇచ్చేవాడు ఒకడున్నాడని తెలుస్తుంది. అతనికే పరమాత్మ అని పేరు.
ఎవరు ఈ మానవజన్మతో పాటు, సమస్త శక్తుల్ని మనకు ప్రసాదిస్తున్నారో, ఎవరిని ఈ విశ్వమంతా ఎల్లవేళల ఉపాసిస్తుందో, ఎవరి ఆజ్ఞను సమస్త దేవతలు శిరసా వహిస్తున్నారో, ఎవరిని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుందో, ఎవరిని ఆశ్రయించకపోతే మళ్లీమళ్లీ జన్మలెత్తవలసి వస్తుందో- అట్టి దేవుణ్నే మొక్కాలని వేదం చెబుతుంది.
అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని; చీకటిని విడిచిపెట్టి ప్రకాశాన్ని; మృత్యువును విడిచిపెట్టి అమృతాన్ని చేరుకోవాలని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి.
'సత్‌', 'జ్యోతి', 'అమృత' శబ్దాలు పరమాత్మకే వర్తిస్తాయి. ప్రపంచం అసత్తు. అనగా సత్యం కానిది. పరమాత్మ సత్యం. కనుక అతడు సత్యస్వరూపుడు. అజ్ఞానమే చీకటి. పరమాత్మ పూర్ణజ్ఞానం కలిగినవాడు. అతని జ్ఞానమనే వెలుగులో మన అజ్ఞానమనే చీకటి పటాపంచలమవుతుంది. కనుక పరమాత్మ 'చిత్‌' స్వరూపుడు. మనం మర్త్యులం. అనగా మృత్యు ముఖంలో ఉన్నవారం. ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇలాంటి మృత్యువు నుంచి మనం బయటపడాలి. కనుక అమృతసిద్ధి పొందాలి. అమృతం అంటే శాశ్వతానందం. అది పరమాత్మలోనే ఉంది. కనుకనే ఆయన ఆనందస్వరూపుడు. అందుకే మనం ఎల్లవేళలా సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మనే ధ్యానించాలి.
కనిపించే ఈ స్థూల ప్రపంచానికి మూలకారణమైన ప్రకృతి కూడా సత్‌ పదార్థమేకాని, అది జ్ఞానరహితమైనది. అనగా దానికి తెలివిలేదు. కనుక పరమాత్మకు బదులుగా ఈ జడ ప్రకృతిని ఎవరు ధ్యానిస్తారో వారు దుఃఖరూపమైన అంధకారంలో పడిపోతారని వేదం చెబుతుంది.
సర్వజ్ఞుడైన పరమాత్మ జడప్రకృతి కంటే భిన్నమైనవాడు. ప్రకృతి కారణంగా కలిగిన విశ్వానికి ఆకారం ఉంది. కాని అతనికి లేదు.
పరమాత్మ సర్వాంతర్యామి కనుక అతనిని పిలువలేం. సర్వాధారుడు కనుక అతనికెలాంటి ఆసనం ఇవ్వజాలం. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాడు కనుక అర్ఘ్య పాద్యాదులు సమర్పించలేమని శంకర భగవత్పాదులు 'పరాపూజా' అనే గ్రంథంలో శ్లోక రూపేణా రాశారు.
జడానికి బదులు జ్ఞానాన్ని ఆశ్రయించడం వల్లనే ముక్తి లభిస్తుందని సాంఖ్య దర్శనం చెబుతుంది.
ఈ దర్శనంలోనే ధ్యానమంటే ఏమిటో స్పష్టంగా ఉంది.
విషయరహితమైన మనస్సుకే ధ్యానం అని పేరు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే అయిదూ విషయాలు. వీటి నుంచి మనస్సు పూర్తిగా వైదొలగినప్పుడే ధ్యానానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆత్మ మనస్సు నుంచి కూడా విడివడి పరమాత్మ ధ్యానంలో మునిగిపోవాలి.
మనం ఎవరిని లక్ష్యంగా చేసుకొని ధ్యానిస్తున్నామో, ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే ప్రవాహరూపంలో ఉండాలి. పరమాత్మ సర్వ వ్యాపకుడైనప్పటికీ కేవలం మన హృదయంలో ఉన్న ఆత్మలోనే ఆయన దర్శనమివ్వగలడు. దీన్నే ఈశ్వర సాక్షాత్కారమని మన పెద్దలు చెప్పినారు. పరమాత్మ జడపదార్థం కాడు కనుక కనిపించడు. కాని, మన అనుభవంలోకి వస్తాడు. ఇదే ఈశ్వర సాక్షాత్కారం. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకు మనం చేయవలసిందల్లా ఆత్మకు పాపపంకిలాన్ని అంటకుండా జాగ్రత్తపడటమే.
నీటిమీద చెత్తాచెదారం ఉంటే చంద్రుణ్ని ఎలా చూడలేమో, అలాగే ఆత్మకు పాపం అంటుకుంటే పరమాత్మను కూడా అనుభవంలోకి తెచ్చుకోలేం.

గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.

1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా!
సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!!
2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్!
ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!!
3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా!
తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!!
4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా!
సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!!
5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః!
సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!!
6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు!
తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!!
7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః!
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!!
8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్!
ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!!
9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన!
ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!!
౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్!
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!!
౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన!
శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!!
12. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః!
గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్!!
౧౩. తస్యతద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్!
దృష్ట్వా తన్మహిమానం శ సమంతాదవకీర్యత!!
౧౪. సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః!
సర్వస్రోతా౦సి పూర్ణాని గంగాయా రఘునందన!!
౧౫. తమువాచ తతో గంగా సర్వ దేవా పురోహితం!
అశక్తా ధారణే దేవా తవ తేజస్సముద్ధతం!
దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా!!
౧౬. అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః!
ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతామ్!!
౧౭. శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం!
ఉత్ససర్జ మహాతేజః స్రోతోభ్యో హాయ్ తదానఘ!!
౧౮. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం!!
౧౯. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం!
తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత!!
౨౦. మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ!
తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత!!
౨౧. నిక్షిప్తమాత్రే గర్భే టు తేజోభిరభిరంజితం!
సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్!!
౨౨. జాత రూపమితి ఖ్యాతం తదాప్రభ్రుతి రాఘవ!
సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం!
తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం!!
౨౩. త౦ కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః!
క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్!!
౨౪. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం!
దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః!!
౨౫. తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్!
పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః!!
౨౬. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే!
స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్!!
౨౭. స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్!
కార్తికేయ౦ మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్!!
౨౮. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్!
షన్ణా౦ షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః!!
౨౯. గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా!
అజయత్ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః!!
౩౦. సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం!
అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః!!
31. ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా!
కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ!!
౩౨. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః!
ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్!!
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రి౦శస్సర్గః!!

అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది?

ఒక మహారాజు, రోజూ తోటకూర దానం చేస్తున్నాడు,వేల ఎకరాలలో తోట కూర పండించి పంచిపెడుతున్నాడు, స్వయంగా. స్వయంగా తోటకూర కట్ట చేతికిస్తూ, అంతకి ఇంతయితే ఇంతకి ఎంతవుతుంది అని ప్రశ్న వేసేవాడు. ఎవరూ సమాధానం చెప్పేవారు కాదు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవరూ సమాధానం చెప్పక పోయేటప్పటికి రాజు దిగులుపడ్డాడు. రాజ కార్యాలలో కూడా ఆసక్తి తగ్గింది, కాని ఈ తోటకూర దానం మాత్రం మానలేదు. రాజు అదృష్టం కొద్దీ ఒక బ్రాహ్మడు వచ్చాడు. అతనికీ తోటకూర కట్టిస్తూ ప్రశ్న వేశాడు. దానికాయన, రాజా నీకు ఈ విషయం మీద సమాధానం చెబుతానన్నాడు.
రాజుకి సంబరమయిపోయింది. ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తరవాత, సభలో బ్రాహ్మణుని ప్రవేశపెడితే, సమాధానం చెప్పేడు, ఇలా. రాజా అంతకు ఇంతయితే, ఇంతకు ఇంతే అన్నాడు. దానికి రాజు నిరుత్సాహ పడ్డాడు. అదెలా చెప్పగలిగేరని ప్రశ్నించాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా చెప్పేడు. రాజా నీవు పూర్వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడివిగా పుట్టేవు. నీకు ఆ జన్మలో, కొద్దిగా పెరడున్న ఇల్లు ఉండేది, యాయవారంతో బతికేవాడివి, ఉన్న పెరడులో తోటకూర సాగుచేసి అడిగినవారికి అడగనివారికి కూడా దానం చేసేవాడివి. ఆ పుణ్యం మూలంగా నువ్వీ జన్మలో మహారాజుగా పుట్టేవు. నీకు పూర్వజన్మ జ్ఞానం ఉండిపోవటం చేత, ఈ జన్మలో కూడా తోటకూర దానం చేయడం మొదలు పెట్టేవు, అప్పుడు తోటకూర దానంచేస్తే రాజునయిపుట్టేనుకదా! ఇప్పుడు కూడా తోటకూర దానంచేస్తే ఇంతకంతే మంచి జన్మ లభిస్తుందనుకున్నావు. నిజమేనా చెప్పమన్నాడు. అందుకు రాజు ఆశ్చర్యపోయి, అప్పుడు తోటకూర దానం చేస్తే రాజునయిపుట్టేను కదా, మరి ఈ జన్మలో ఇతోధికంగా తోటకూర దానం చేస్తే ఇంత కంటే మంచి జన్మ ఎందుకు రాదనుకుని తోటకూర దానం మొదలెట్టేను అన్నాడు. రాజా అప్పుడు నీవొక యాయవారం బ్రాహ్మడివి, నీతాహతుకు తగిన దానం చేసేవు, మంచి మనసుతో మరొకరికి సాయపడాలనుకున్నావు తప్పించి గొప్ప జన్మ రావాలని కోరుకోలేదు. కాని ఈ జన్మలో మహారాజువై ఉండి నీ తాహతుకు తగిన దానాలు చేసి ప్రజల మంచి చెడ్డలు చూడలేదు, ఇంతకంటె మంచి జన్మ కావాలని కోరికతో దానం చేస్తున్నావు, అందుచేత ఇంతకి ఇంతే అని జవాబు చెప్పేడు. దానికి రాజు ఆశ్చర్యపోయి, ఆయన కాళ్ళు పట్టుకుని స్వామీ! నాకు తరుణోపాయం చెప్పమన్నాడు.
రాజా! ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీవు నీ తాహతుకు తగిన దానం చెయ్యి. అన్ని దానాలకంటే ఆన్నదానం మంచిదే, అది ఒక పూటతో సరిపోతుంది, తృప్తినీ ఇస్తుంది, కాని రాజుగా నీవు ప్రజలు వారిమటుకు వారు సంపాదించుకునే ఏర్పాటు చూడాలి, అందుకు విద్యాదానం చేయాలి, ప్రజలకు సత్వర వైద్య సదుపాయం, సత్వర న్యాయం అందేలా చూడు. అదే నీవు చేయగల దానం, చేయవలసిన దానం అని చెప్పేడు. రాజు అప్పటినుంచి తోటకూర దానం మానేసి ప్రజల్ని బాగా పరిపాలించాడు.
పై కధని బట్టి మనకు తెలిసేది, తాహతుకు తగిన దానం చేయకపోవడం తప్పు, తాహతుకు మించిన దానం చేయడమూ తప్పే. ప్రాణం నిలబెట్టడానికి అన్నదానం అవసరమే కాని విద్యాదానం గొప్పది. తద్వారా మనుష్యులు వారి ఆత్మాభిమానాన్ని కోల్పోని పౌరులవుతారు, అప్పుడు వారు వారి కుటుంబానికి సమాజానికి ఉపయోగపడతారు.

జ్యోతిష్యం శాస్త్రం అనటానికి కొన్ని ఆదారాలు.

జ్యోతిష్యం మూఢనమ్మకంగా కొందరు భావించినా జ్యోతిష్యం "శాస్త్రం" అనడానికి చాలా ఆదారాలు ఉన్నాయి. మన మెదడులోని ద్రవాలలో నవ గ్రహాలకు సంబంధించిన ఖనిజాలు ఉంటాయి. గ్రహాలు పరస్పర ప్రభావం కలిగివుంటాయి. అదేవిధంగా మనిషిపై కూడా ఆ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. మానవ మస్తిష్కం గ్రహ గతులకు స్పందిస్తుంది.

సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. చంద్రగమనం కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. సముద్రపు అలలు, స్త్రీల ఋతుచక్రం, మానవుల మస్తిష్కం చంద్రగమన ప్రభావానికి లోనౌతాయి. సీజనల్ మెంటల్ డిజార్డర్ గా పిలువబడే (Seasonal Affective Disorder (SAD)) అనే మానసిక రోగం కూడా చలికాలంలో సూర్యుడు చాలాఎక్కువ సేపు కనపడకపోవడం వల్ల సంభవిస్తుంది.

అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అదేవిధంగా మానవుల దేహంలోని నీరు కూడా ఆ ప్రభావానికి లోనవుతుంది. మానవులలో ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి రుజువు కొందరు అమావాస్య పౌర్ణమి రోజుల్లో విపరీత ప్రవర్తనను చూపడం. ముఖ్యంగా మానసిక రోగులకు ఆరోజుల్లో పిచ్చి ఇంకా ఎక్కువ అవడం. ఒక్క చంద్రుడే కాదు ఇతర గ్రహాలు కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ క్లైమెటాలజీ The American Institute of Medical Climatology వారు Philadelphia పోలీస్ డిపార్టామెంట్ వారికి సాయపడటానికి ఒక రీసెర్చ్ ని నిర్వహించారు.

మానవ ప్రవర్తనపై పౌర్ణమి ప్రభావం మీద జరిపిన ఆ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూసాయి. ఆ పరిశోధన ప్రకారం పౌర్ణమి రోజుల్లో హత్య, విచక్షణా రహితంగా వాహనాల్ని నడిపి ఇతరుల మరణానికి కారణమవడం, అవసరానికి కాకుండా హాబీ పరంగా, మరోరకంగా తప్పకుండా దొంగతనం చేసి తీరాలనే తపన, ఇతరులమీద పగతీర్చుకోవాలనే కోరిక మొదలైనవి ఎక్కువగా రికార్డయ్యాయి. ఆ రకమైన నేరాలు ఆ రోజుల్లో ఎక్కువగా జరిగాయి. Miami విశ్వవిధ్యాలయానికి చెందిన Arnold Lieber అనే మానసిక శాస్త్రవేత్త మియామీలో గత 15 సంవత్సరాలలో జరిగిన 1,887 హత్యలకు పౌర్ణమి, అమావాస్యలకు గల సంబంధాన్ని గూర్చి పరిశోధనలు చేసి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మానవహనన ధుర్ఘటనలు ఎక్కువగా జరిగి మిగతా రోజుల్లో అవి తక్కువగా ఉన్నాయని గుర్తించారు.

W. Buehler అనే జర్మన్ శాస్త్రవేత్త పరిశోధనలో నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్నకాలంలో (పరిమానం తగ్గుతూ కనిపించే సమయంలో) కన్నా చంద్రుని పరిమానం పెరుగుతూ కనిపించే కాలంలో 10 శాతం అధికంగా స్త్రీలు గర్భం ధరించడం జరిగింది. నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్నకాలంలో (పరిమానం తగ్గుతూ కనిపించే సమయంలో) కన్నా చంద్రుని పరిమానం పెరుగుతూ కనిపించే కాలంలో గర్బం దాల్చినప్పుడు మగ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా పరిశోధనలు తేల్చాయి.

ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరుడు తన కూతురు లీలావతి జాతకం ప్రకారం ఆమె భర్త మరణిస్తాడని తెలుసుకుని ఏ ముహూర్తానికి ఆమె వివాహం జరిగితే ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందో తెలుసుకుని ఆ ముహూర్తానికి కాకుండా వేరే ముహూర్తానికి వివాహం జరిపించాలని ఒక గడియారాన్ని తయారుచేస్తాడు. కుండలో నీరు పోసి అడుగున చిన్న రంధ్రం ద్వారా నీరు ఒక్కొక్క చుక్క కింద పడేలా ప్లాన్ చేస్తాడు. దాని ఆధారంగా కాలాన్ని తెలుసుకుంటాడు. కానీ చివరికి కుమార్తె వివాహం జరిగి ఆమెకు జాతకం ప్రకారం వైధవ్యం ప్రాప్తింస్తుంది.

జాతక దోషాన్ని నివారించలేకపోయానని చింతిస్తూ తాను గడియారంగా మలచిన కుండ ను పరిశీలిస్తాడు. ఆ కుండ అడుగున చిన్న ముక్కు పుడక కనపడుతుంది. జరిగిన వాస్తవం ఏమిటంటే భాస్కరుని కుమార్తె లీలావతి ఆడుకుంటూ కుండలోకి తొంగిచూసినప్పుడు ఆమె ముక్కుపుడక జారి కుండలో పడి గడియారం గతి తప్పుతుంది. అందువల్ల భాస్కరుడు తాను అనుకున్న ముహూర్తానికి కాకుండా జాతకం ప్రకారం దోషం ఉన్న ముహూర్తానికే తన కూతురు వివాహం జరిపించి తరువాత బాధపడతాడు. ఇది జ్యోతిష్య శాస్త్రం గురించి ఒక వృత్తాంతం.

జాతకం పరిశీలించటం ఎలా జాతకంలో రోగ పరిశీలన

జాతకంలో లగ్నాదిపతి,లగ్నభావం షష్టాధిపతి,షష్ఠ బావంతో సంబందం ఉన్నయెడల జాతకునికి రోగాలు అడపాదడపా పీడిస్తాయని,ఒక రోగం తరువాత ఇంకో రోగం పీడిస్తూనే ఉంటుంది.వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేసి నయం చేయడం కన్నవ్యాధి రాకుండా చేసుకోవటమే మేలు అని జ్యోతిర్వైద్యం చెబుతున్నది.

రోగ నివారణ కేవలం మందులు వాడటం వలన సాద్యమనుకుంటే పొరపాటే.ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన,వాతావరణం,నీరు మార్చటం వలన, రత్నధారణ వలన,జప దాన హోమాదుల వలన,ఔషదాల వలన,మంత్రోచ్ఛారణ వలన,కాస్మిక్ కిరణాల ద్వారా,కలర్ ధెరపీ ద్వారా,అయస్కాంత వైద్య చికిత్స విధానాల ద్వారా రోగాన్ని నివారించుకోవచ్చును,ముఖ్యంగా ఆదిత్య హృదయం,దుర్గాసప్తశ్లోకి,సుందరకాండ పారాయణం ప్రతి రోజు చేసే వారికి రోగాలు దరిచేరవు.

అగ్నితత్వ రాశులైన మేషం,సింహం,ధనస్సు లగ్నాలై 6 వ భావంతో సంభందం ఉన్న రోగం వచ్చిన తట్టుకోగలరు.రోగనిరోదక శక్తి కలిగి ఉంటారు.

భూతత్వ రాసులైన వృషభం,కన్య,మకరం లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న రోగం వచ్చిన కొంతవరకు తట్టుకోగలరు.వైద్యం చేయించుకుంటే రోగం నయమవుతుంది.

వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ లగ్నాలై 6 వ భావంతో సంబందం ఉన్న కుంభ రాశి మినహా మిగతా రెండు రాశుల వారికి రోగం తొందరగా నయమవ్వదు.

జలతత్వ రాశులైన కర్కాటకం,వృశ్చికం,మీన లగ్నాలై 6 భావంతో సంబంధం ఉన్న వీరికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది.సులభంగా రోగాలకు లొంగిపోతారు.

లగ్నం శరీరం,6 వ భావం రోగ స్ధానం,6 వ భావానికి వ్యయ స్ధానం పంచమం.పంచమం 6 వ భావానికి వ్యయం కాబట్టి రోగాన్ని నాశనం చేస్తుంది.4 వ భావం రోగాన్ని వృద్ది చేస్తుంది.6 వ భావంతో ఏర్పడిన రోగం 5 వ భావంతో రోగాలను వదిలించుకోచ్చును.లగ్నభావం 5,6 భావాలతో సంబందం ఉంటే రోగం వచ్చిన తగ్గించుకోవచ్చు.

లగ్నం 6 వ భావం కంటే 5 వ భావంతో బలంగా ఉంటే రోగాలు దరిచేరవు.లగ్నం,5 వ భావం బలంగా ఉంటే రోగం వచ్చిన పరిహార క్రియల ద్వారా రోగ నివారణ చేసుకోవచ్చు.మేషాదిగా రవి 5 వ రాశియైన సింహా రాశికి అధిపతి కనుక ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం ముందు “ఆదిత్య హృదయం”సూర్యునికి ఎదురుగా నిలబడి చదివితే రోగ నివారణ జరిగి చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది.

లగ్నభావం 4 వ భావంతో సంబంధం ఉంటే రోగం నయమవటం కష్టం.ఎందుకంటే 6 వ భావానికి 4 వ భావం 11 వ భావం ఉపచయం కాబట్టి.ఉపచయం అంటే అబివృద్ధి.రోగాన్ని వృద్ధి చేస్తుంది.

శని,కుజ,రాహువులు రోగాన్ని పెంచితే ,రవి,గురువు లు రోగాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి.

నవగ్రహ దోష నివారణకు హోమ సమిధలు

“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్చాంతిఃఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”

అంటూ శారీరక,మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు,దానాలు,జపాలు,హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది.వానిలో ముఖ్యమైనవి హోమ ప్రక్రియ జ్యోతిర్వైద్యంగా వినియోగ పడుతుంది.హోమంలో నవగ్రహ సమిధలు ఉపయోగించటంవలన ఒక్కో సమిధ వలన ఒక్కో రోగం నివారించబడుతుంది.

హోమ పొగ కంటిలోకి పోవడం వలన కంటిలో ఉండే నలత కంటిలో నుండి నీరు రూపంలో వెళ్లిపోతుంది.హోమాగ్ని సెగ మోకాళ్ళకు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు.గ్రహాలకు వేరు వేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే పరిశుద్ధమైన ఆరోగ్యవంతులవుతారు.

రవి:-తెల్లజిల్లేడు వాత,కఫ వ్యాదులను తగ్గిస్తుంది.తెల్లజిల్లేడు సమిధలతో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి.కళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయి.కోప స్వభావాలు తగ్గుతాయి.తలనొప్పి భాధలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.

చంద్రుడు:-మోదుగ సమిధలతో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు.ఆలోచనావిధానంలో మార్పులుంటాయి. సుఖవ్యాధులు దరిచేరవు.మోదుగాకును మెత్తగా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతుసంబంధ సమస్యలు,గర్భ సంబంధ సమస్యలు ఉండవు.మోదుగ పువ్వులు,గింజలు ఎండబెట్టి నీటిలో ఒక పావు చెంచా వేసి కాగబెట్టుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు. వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

కుజుడు:-చండ్ర సమిధతో హోమం చేస్తే ఎర్రరక్త కణాల ఇబ్బందులు,ఎముకల బలహీనత ఇబ్బందులను అరికడుతుంది.పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మడుమేహం,కోపస్వభావాలు తగ్గుతాయి.

బుధుడు:-ఉత్తరేణి సమిధను హోమంలో ఉపయోగిస్తే చర్మవ్యాదులు తగ్గుతాయి.జీర్ణ సంభంధ సమస్యలు ఉండవు.ఉత్తరేణి పూల్లతో గాని,వేరుతోగాని రోజూ దంతధావనం చేసుకుంటే దంతదోషాలు తొలగిపోతాయి.ఉత్తరేణి ఆకులు,గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు,జలుబు,ఆయాసం తగ్గుతాయి.

గురువు:-రావి సమిధలతో హోమంచేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి.రావి చెక్కకాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాటా రక్త దోషాలు తగ్గుతాయి.నోటిపూత పోవును. రావి చెక్కకాషాయాన్నిరోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

శుక్రుడు:-మేడి చెట్టు సమిదలతో హోమంచేస్తే వివాహ సమస్యలు,వైవాహిక సంబంద సమస్యలు ఉండవు. గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు). దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు ఉంటారు. దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహవ్యాధి నివారించబడుతుంది. దీని విత్తనాలు పొడి చేసి, తేనెతో కలిపి తీసుకున్నా మధుమేహం దరిదాపుల్లో కనిపించకుండా పోతుంది.

శని:-జమ్మి సమిధలతో హోమంచేస్తే అప మృత్యు భయం తొలగి పోతుంది.దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి.శమీ వృక్ష గాలి శరీరానికి తగిలిన శారీరక ఇబ్బందులు తొలగిపోతాయి.ప్రతి రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసిన దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి.

రాహువు:-గరికలతో హోమంచేస్తే ఇంటిలో నరదృష్టి తొలగిపోయి సర్ప సంభంద దోషాలు తొలగిపోతాయి. గరిక రసాన్ని గజ్జి,చర్మంపైన ఉన్న కురుపులపై పెట్టిన చర్మరోగాలు నివారించబడతాయి. దెబ్బతగిలి రక్తం కారిపోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.

కేతువు:-ధర్భాలతో హోమంచేస్తే కాలసర్పదోషాలు తొలగిపోతాయి.మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.

జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే శాంతి ప్రక్రియలో భాగంగా హోమం చేసుకోవాలి అని చెబితే ఇంట్లో స్థలం లేదని దేవాలయంలోనో,మరెవరైనా ఇంట్లోనో నవగ్రహ సమిధలతో హోమం చేస్తే గ్రహభాడలు తొలగిపోవు.. ఇబ్బంది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే హోమం చేస్తే మంచిది. తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుంది.